35
దుర్గ గుంటూరు ఏ.వి కాలేజీ లో బి,ఎస్. సి రెండో సంవత్సరం లో వుంది.
ఆమె పూర్తిగా మారిపోయింది. బాగా సన్నబడి నాజూకుగా తయారైంది. మొనదేలి నిటారుగా వున్న ముక్కు ప్రస్ప్రుట మైంది. పలుచబడిన చెక్కిళ్ళ లో అరుణిమ సన్నగిల్లింది. వినయం, సరళత్వం ప్రస్పుట మౌతున్న నయనద్వయం ఆమె హృదయ పరిపక్వతను చాటుతోంది మునుపున్న సంకోచ భయాలు, బాధ వమానాలకు గురి అవుతూ నిత్యం ఏమి జరగనై యున్నదో నన్న భయాందోళన లతో బెదిరిపోతూ చూస్తున్న చూపులు మారిపోయి దారుద్యాన్ని పుంజు కున్నాయి. ఎల్లప్పుడు గుంభనగా, నిశ్శబ్దంగా ఉండే ఆమె పైన లెక్చరర్ల కే కాదు. సహా విద్యార్ధినులకు కూడా జాలి. గౌరవం ఏర్పడ్డాయి. ఆమె ఒక గొప్పింటి బిడ్డ. భర్తచే త్యజింప బడిందని మాత్రం వారిలో కొందరికి తెలుసు. అంతేగాని ఆమె భర్త సుధాకర్ అక్కడే లెక్చరర్ గా పనిచేస్తున్నాడని ఎవ్వరికీ తెలియదు.

డిసెంబర్ నెలలో ఒకదినం కాళీగా వున్న గంటలో పరీక్ష కేదో చదువుతూ స్తంభం చాటున కూచుంది. ఎందుకో ఆనాడు ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. మనసు నిగ్రహించు కోలేక తన గదిలో కెళ్ళి ఎవ్వరు లేని సమయంలో పెట్టె తెరిచి అడుగున వున్న పెళ్లి ఫోటో చూస్తూ కూచుంది.
మరుసటి రోజు సోమవారం సాయంత్రం సైన్స్ అసోసియేషన్ మీటింగు వుంది.
అతిధుల బల్ల మీద పెట్టటానికి వెజ్ లో దుర్గ చక్కని పూలు అమర్చింది. అది ఆమె పని కాదు. సైన్స్ అసోసియేషన్ సెక్రటరీ దుర్గ స్నేహితురాలు. ఆమెకు సాయం చేస్తోంది-- అంతే. అది చాలా అందమైన పూల కుండీ. చిన్న చిన్న -- రంగు రంగుల గాజులతో చేయబడినది. ఆ గాజు ముక్కలు ముక్కోణాకారంలో వుండి పలకల పలకలుగా వున్నందు వల్ల వింత కాంతు లీనుతూ అత్యంత సుందరంగా కనబడుతుంది. దాని నిండా చేమంతి పూవుల ను, ఆకులను తీగలను సుందరంగా ఆమర్చి మేడ మెట్లు దిగుతుంది. ఆ పూలను అమర్చిన దుర్గకు ఇంకా ఏదో లోటు కాన వస్తోంది. ఒక్క మెట్టు దిగి లతను పువూ చుటూ చుట్టింది -- తల ప్రక్కకు త్రిప్పి కుండీని దూరంగా పెట్టుకుని చూసింది" లత నిటారుగా నుంచుంది. దాన్ని సుకుమారంగా క్రిందకు వంచింది. మరొక్క మెట్టు దిగి ఎవరిదో స్వరం వినబడే సరికి ఆశ్చర్యంతో మెట్టు మీద శిలా ప్రతిమ యై నుంచుండి పోయింది. మెట్ల మలుపు దగ్గర వాళ్ళ కెమిస్ట్రీ లెక్చరర్ కనబడింది. మరొక్క అరక్షణం లో మరొక వ్యక్తీ. ఆ చ్యక్తి చేయి ఆ స్త్రీ నడుము చుట్టూ వుంది. దాదాపు వారి భుజాలు తాకుతున్నాయి.
దుర్గ ఆ పురుషుడ్ని చూచి అచేతనంగా చూస్తూ నిలుచుండి పోయింది. ఎవరో మెట్లు దిగటానికో, ఎక్కటానీకో వస్తున్న చప్పుడైంది. వారు విడి పడ్డారు. ఆ లెక్చరర్ నోట మాట రాక దుర్గ కేసి చూస్తుండిపోయింది. దుర్గ గట్టిగా కళ్ళు మూసుకుంది. పాలిపోయిన విచ్చిన పెదిమలు తీవ్రంగా కంపించాయి. చటుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. కాని ఆమె కళ్ళు గాలిలో తేలిపోయాయి. వివశయై డబ్బున క్రిందపడి దొర్లుతూ వచ్చింది.
అంతవరకూ స్తబ్ధత తో నిశ్చేష్టులై నిలుచున్న సుధాకర్ . ఆమె ఒక మెట్టు పైకి ఎక్కారు కానీ దుర్గ శరీరం దొర్లుతూ వారి పాదాల చెంతకు మూటలా వచ్చి పడగానే కంగారు పడ్డారు అది శరారం కాదు , రక్తపు ముద్ద. పూల కుండీ తునాతునకలై పోవటం వల్ల ఆ గాజు ముక్కలు గ్రుచ్చుకుని ఆమె శరీరం రక్తాన్ని స్రవిస్తోంది.
సుధాకర్ వంగి ఆమెను లేవనెత్తే లోపల పదిమంది వచ్చి దుర్గ ను లేపారు. ఆమె మోచెయ్యి వ్రేలాడుతుంది.
ఆమెతో వాళ్ళ వార్డెన్. ఇద్దరు అమ్మాయిలూ వెళ్ళిపోయారు. సైన్స్ అసోసియేషన్ నిర్విఘ్నంగా జరిగిపోయింది. కాని అధ్యక్షత వహించిన సుధాకర్ గారు అధ్యక్షుని అంతిమ పల్కులుగా ఏమీ ---ఏమీ మాట్లాడలేదని విద్యార్ధినులు నిరాశ చెందారు.
దుర్గకు చాలా రక్తం పోయింది. ప్రిన్సిపాల్, మరికొంత మంది లెక్చరర్లు వెళ్లారు. ఆమెకు రక్తం ఎక్కించి, కట్లు కట్టేసరికి చాలా రాత్రి అయిపొయింది.
సుధాకర్ తన గదికి వచ్చాడు. ఎంత విస్మరిద్దామన్నా దుర్గ ముఖం పదేపదే తన ఎదట ప్రత్యక్ష మౌతుంది. , అంతరాంతరాళాలలో మతుమరిగి వున్న క్రోధం విజ్రుంభించకుండా వున్నందుకు తనకే ఆశ్చర్యం కల్గింది. ఆ కెమిస్ట్రీ లెక్చరర్ ను పెళ్లి చేసుకోవాలను కున్నాడు. ఈ చర్యల ద్వారా దుర్గ హృదయంలో అగ్ని పర్వతాలను సృష్టించి భీకర ప్రళయ చేయాలనుకున్నాడు. తన రెండవ భార్యతో సహా దుర్గ ఎదుట నుంచుని ఆమె హృదయాన్ని భస్మీ పటలం చేయాలనుకున్నాడు కానీ ఎదీ చేయలేక పోతున్నాడు. తనకు ముందు నుంచీ వున్న బలహీనతవల్ల, ఏవేవో చేయాలను కుంటాడు కానీ ఏవీ చేయలేక పోతున్నాడు. తను వట్టి పిరికివాడు. చేతకాని వాడు. శుష్క హృదయుడు. -౦ బలహీనుడు , తన స్థానంలో మరోకరున్నట్లయితే ప్రధమం నుంచి తను కోరినవి పొందేవాడు. దుర్గ నుంచి డబ్బు సునాయాసంగా తీసుకొనేవాడు. అన్నీ జరిగి ఉండేవి. కాని తనకేదో బలహీనత ఆవరించింది. ఏదో అదృశ్య శక్తి తనను అపశ్రుతి గా చేస్తోంది. ఆరోజు సుధాకర్ పిచ్చి వాడై పోయాడు. కారేజీ తినలేదు. తలుపు గడియ వేసి రెండు గ్లాసుల మంచినీళ్ళు త్రాగి పడుకున్నాడు. నిద్ర దూరమయింది.
పదేపదే దుర్గ ముఖం మరో తలపులకు ప్రత్యక్షమౌతుంది. మెట్ల మీద భయం నితాశ దుఃఖం మేళవించిన ముఖంతో తన వైపు చూస్తూన్న ఆ అపర్జాలత నేత్రాలు ఎదురుగా వచ్చాయి. ఆ పాలిపోయిన ముఖం తనలోని రక్తాన్ని నిల్పి వేస్తున్నట్లుంది. ఫేళ ఫేళమంటూ విరిగిన ఆ చక్కని పూల కుండీ తన ఆత్మను నిలిపివేస్తూ ప్రళయ ప్రభంజలా ధ్వని చేసింది.
గంటలు గడుస్తున్నాయి. హృదయాన్ని చిక్కబట్టి దుర్గ నించి తన తలంపులను మరలించ ప్రయత్నించి విఫలుడయ్యాడు . అర్హం కాని అశాంతి దావానలంలా తన్ను దహిస్తోంది అప్రతిభుడై ప్రక్కకు తిరిగి పడుకున్నాడు గాని-- దుర్గను వెళ్లి చూడాలన్న కోర్కెను అణచు కోలేకపోయాడు. రిస్ వాచీ లో పదిన్నర చూపుతూ అక్షరాలు మెరుస్తున్నాయి.
గబుక్కున లేచి నుంచున్నాడు. మశిష్కం స్థబ్ధత్వం వహించింది. తల పట్టుకుని కూచున్నాడు. ఆ శిరస్సు లోని శంక పటాపంచ లైపోయింది. ఒక్కసారి లేచి నుంచుని గుడ్డలు వేసుకుని హాస్పిటల్ కు బయలు దేరాడు.
దుర్గ ఎక్కడున్నది కనుక్కుని వార్డ్ దగ్గర కొచ్చేసరికి నర్స్ ఎదురొచ్చింది.
36
"సారీ --- ఇది విజిటింగ్ అవర్స్ కావు...." అందామె వెళ్లి పోతానికుద్యుక్రుతాలైంది.
"ఆమె కేలావుంది?' ఆత్రంగా అడిగాడు సుధాకర్.
"స్పృహ రాలేదు."
"రక్తం"
"ఔను ...రెండు సైంట్లు ఎక్కించారు....ఇంకొకటి అవసరం రావచ్చు.
"సిస్టర్ ....దయచేసి నన్ను వెళ్ళ నివ్వండి" ఆమె నిటారుగా నుంచుని అతని కళ్ళలోకి సూటిగా చూచింది.
"చూడండి? మీరెవరో మాకు తెలియదు. ముందు మీరు డ్యూటీ డాక్టర్ ను కలిస్తే బావుంటుంది....వారైనా ఇప్పుడు మిమ్మల్ని లోపలికి పంపిస్తారను కొను."
'ఆమె దగ్గర ఎవరున్నారు?"
"ఎవరో పని మనిషిలాగా ఉంది..."
"సిస్టర్ ....ఆమెను ప్రైవేట్ వార్డ్ లో వేరే రూం లో వుంచారుగా"
ఔను"
"నేను వెళ్ళటాని కభ్యంతరం ఏముంది?"
సిస్టర్ విసుగ్గా చూస్తోంది. కొద్ది క్షనాలాగి మెల్లగా ప్రశ్నించింది. "మీరెవరు?" ఓ ఐయాం సారీ నేను ముందే చెప్పి వుండవలసింది పేషెంటు శ్రీమతి దుర్గ-- నా భార్య-- నేను సుధాకర్ ....ఇక్కడే ఎ,సి. కాలేజీ లో లెక్చరర్ ను."
ఆమె తృటి కాలం తదేకంగా అతని వైపు చూసింది. వయసు మళ్ళిన నర్సు కు కొంత అర్ధమైంది...." భార్యకు చెప్పవలసిన అవసరం లేదని అన్నారే-- ఆమె వేరే వుంటున్నారటగా?"
"అవును ఏవో పట్టింపులు---"
"రండి. లోపల డ్యూటీ డాక్టర్ ఉన్నాడు చూద్దురు గాని"
ఆ గది తలుపు తెరచింది. లోపల కూచున్న స్టూడెంట్ నర్స్ బైటి కొచ్చింది. సుధాకర్ ను చూపుతూ అంది "వీరు బి. వార్డు లో రూం నెంబరు ఎనిమిది పేషెంట్ హజ్బెండ్ ట అని అప్పగించి తన పని మీద వెళ్ళిపోయింది.
