అబ్బ! ఆ శామ్యూల్ పాట మాత్రం వినలేక చచ్చామను కొండి! సాహిత్యాన్ని చిత్రవధ చేసి మరీ పాడాడు!' అందరూ గట్టిగా నవ్వేశారు. శ్యామ్యూల్ పాటని తల్చుకొని దూరంగా కూర్చొని కాఫీ తాగుతున్న ఫైనల్ స్టూడెంట్స్ సుమిత్ర, మధురి ఇదంతా గమనిస్తున్నారు.
'ఇదివరకు రాజా చాలా బుద్ది మంతుడి లాగా ఉండేవాడు సుమిత్రా! ఈ మధ్య మంజులతో మరీ అతిగా ప్రవర్తిస్తున్నట్లున్నాడు. ఐనా, రామకృష్ణ లాంటి వాడితో తిరిగితే యిలాగే తయారవుతారు ఎలాంటి బుద్ది మంతులు కూడా. క్రొత్తగా ఫైనలియర్ లో చేరిన సుమిత్ర తో. రాజా మీద కామెంట్ చేసింది మధురి, సుమిత్ర ఏం మాట్లాడలేదు.
* * * *
డియర్ రాజా!....అడుగున మంజుల సంతకం చూడగానే రాజా అదిరి పడ్డ్డాడు. ఆ రోజే లోకల్ పోస్ట్ లో వచ్చింది లెటర్. మంజుల ధైర్యానికి విస్తుపోయాడు . ' ఐ లవ్ యూ!' ఉత్తరం లోని మాటలు పదేపదే గుండెల్లో ప్రతిధ్వనించ సాగాయి. ఇన్నాళ్ళూ తమిద్దరిదీ స్నేహమే అనుకుంటున్నాడు తను. కాని యీ రోజు వేరే క్రొత్త నిర్వచనం యిచ్చింది మంజుల. ప్రధమంగా మంజుల రేకెత్తించిన , యీ అనుభూతి, రాజాకి చాలా గమ్మత్తుగా అదో రకమైన హాయిని కల్గించింది. వెంటనే రిప్లయి వ్రాశాడు.
'రాజా! నేనొక మాట చెప్తాను వింటావా?' ఎప్పుడూ నవ్వుతూ, త్రుళ్ళుతూ తిరిగే రామకృష్ణ , ఆరోజు చాలా సీరియస్ గా అడిగేప్పటికి రాజా ఆశ్చర్యపోయాడు.
'నీ మాట నేనెప్పుడు వినలేడురా?' నవ్వుతూ రామకృష్ణ భుజం మీద చేయి వేశాడు.
'మంజులతో నీ పరిచయం తగ్గించుకోవడం మంచిది' రామకృష్ణే నా , యీ మాటలేనేది నివ్వెరపోయాడు రాజా.
"ఆ అవున్రా రాజా! నాకెందుకో మంజుల నీపట్ల స్వచ్చమైన ప్రేమని చూపిస్తున్నదంటే నమ్మకం కుదరడం లేదు. ఆ అమ్మాయి ప్రతి మాటలో, చేతలో ఎక్కడో గర్వం, నిర్లక్ష్యం కన్పిస్తుంటాయి. నువ్వేమన్నా ఆ పిల్లని పెళ్లి చేసుకుందామనుకుంటున్నా వేమో! ఆ అమ్మాయి కి, అందం తప్పితే, నీ భార్యగా ఉండదగ్గ లక్షణాలేవీ లేవు. అలాంటి పిచ్చి పిచ్చి వూహలు కట్టి పెట్టి, యిక నీ ప్రేమకీ గుడ్ బై కొట్టెయ్. ఇప్పటికే కాలేజీ లో ఉన్న రూమర్స్ వింటుంటే, నాకే బాధన్పిస్తోంది. అసలు నా పొరపాటుందనుకో! ఆవేశంగా అంటున్న రామకృష్ణ కి బదులు చెప్పలేక పోయాడు రాజా!
అప్పుడే యవ్వనం రేకెత్తిస్తున్న చిలిపి వూహల సందడి లో రాజా మంజుల అపురూప సౌందర్య పు మైకంలో పడ్డ మాట వాస్తవం. కోరి మంజుల, అతణ్ణి కవ్వించి, చాలా వరకు ప్రభావితుడ్ని చేసింది. రాజాని మంజుల, తన అందంతో , చిలిపి పనులతో , ఆకర్షించడానికి చేసిన ప్రయత్నాలని, రాజా రెస్పాన్స్ ని, కొన్ని వందల జతల కళ్ళు, అత్యంతాసక్తి గా, అతి జాగ్రత్తగా పరిశీలించాయి. అందులో అబ్బాయిల కళ్ళు , రాజాకేసి, ప్రశంసా పూర్వకమైన ఈర్ష్యతో చూస్తె, అమ్మాయి ల కళ్ళు మంజుల వైపు అసూయా బాణాల్ని సంధించాయి. అబ్బాయిల్నీ, అతి తృణప్రాయంగా తీసిపారేసి కాలేజీ బ్యూటీ మంజుల తనంతట తానుగా, తన స్నేహం కోరినందుకు రాజా, అదో రకమైన గర్వంతో, అమాయకత్వం తో పొంగిపోతే, అందరికీ హీరో లాంటి వాడయిన రాజాని, తన అందంతో బందీ చెయ్య గల్గినందుకు మంజుల మురిసిపోయింది.
"అదిగోరా! మన లవ్ బార్డ్స్ ఏమిటో మాట్లాడు కుంటున్నారు.' శివరాం ముకుందం తో హేళనగా అంటున్నాడు. ముకుందం అదేదో పెద్ద జోక్ అన్నట్లు విరగబడి నవ్వాడు. మంజుల విసురుగా వెళ్ళిపోయింది. రాజా ముకుందం కేసి తీవ్రంగా చూశాడు. ముకుందం బెదిరిపోయి నవ్వాపేశాడు.
'రాజా-- మంజుల' బోర్డు మీది పేర్లు చూసి, అవాక్కయి నిలబడి పోయాడు రాజా! రామకృష్ణ కళ్ళెర్ర బడ్డాయి. 'ఇదంతా ఆ శివరాం గాడి పనయి ఉండాలి!' పళ్ళు కొరికాడు. బోర్డు తుడిచేసి వచ్చి కూర్చున్న రామకృష్ణ ని చూసి కిమ్మనలేదు శివరాం. లోపలికి వస్తున్నా లెక్చరర్ ని చూసి ఏదో అనబోయిన రామకృష్ణ ఊరుకున్నాడు.
* * * *
ఉద్రేకపు వేడి తగ్గి , వాస్తవిక పరిస్థితులు చురుక్కు మనడంతో , రాజా, మంజుల కొంచెం పరిస్థితుల్ని అర్ధం చేసుకున్నారు. ఇద్దరూ, మాట్లాడటం తగ్గించు కున్నారు. ఇద్దరూ ఫైనల్ లోకి వచ్చారు.
* * * *
మర్నాటి నుండి ప్రిపరేషన్ హాలిడేస్ యిస్తున్నారు. ఇహ మంజులతో చివరిసారిగా మాట్లాడాలను కున్నాడు రాజా. మంజుల పెళ్లి, యింకో రెడ్నేల్ల లో జరుగుతుందనే వార్త తీసుకొచ్చాడు రామకృష్ణ. మొదట మనసు దెబ్బతిన్నట్ల నిపించింది. 'మంజులని తను చేసుకోవాలను కున్నా, యింకో రెండు మూడు సంవత్సరాలకి, చదువు పూర్తయి , ఉద్యోగం దొరికితేకాని కుదరదు పోనీయ్! ఇంతవరకూ యిద్దరూ పెళ్లి గురించి అనుకోలేదు గా! బహుశా మంజుల కూడా పెద్ద పట్టించు కోదేమో! తన పెళ్లి విషయం నిజమే అయితే , ఆ అమ్మాయి సుఖ పడాలనే తను మనస్పూర్తిగా కోరుకుంటాడు. తామిద్దరి స్నేహం, ఒక మధురాను భూతి గా మిగిలి పోతుంది.' ఈ భవనతో రాజా మనసు కొంచెం వూరట చెందింది.
'మంజులా!' ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న మంజుల రాజా పిలుపుకి వెనక్కి తిరిగి చూసి ఆగింది. మంజుల ప్రక్కనే నడుస్తూ అడిగాడు రాజా.
"ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేశాయి. బాగా చదువు తున్నావా?'
'ఆ! ముభావంగా అంది మంజుల. రాజా కొంచెం చకితుడయ్యాడు. కాసేపు ఊరుకుని, తనే మళ్లీ మాట్లాడాడు. 'ఇన్నాళ్ళూ కలిసి స్నేహంగా తిరిగాం. ఇక నుంచీ మనదారి వేరు, అనుకుంటే ఎందుకో బాధగా, దిగులుగా అన్పిస్తుంది, నీకేమీ అన్పించడం లేదా మంజులా?' అమాయికంగా అతి నిజాయితీగా అడిగాడు రాజా.
"ఎండుకన్పించదూ? చాలా చాలా అన్పిస్తోంది.
వ్యంగ్యం స్పష్టంగా తెలుస్తోంది కంఠం లో. విస్మయంగా మంజుల కేసి చూసాడు రాజా. మౌనం మరింత రెచ్చగొట్టింది మంజులని.
"నువ్వొట్టి మోసగాడివి. ప్రేమించానని అన్నీ అబద్దాలు చెప్పి, యిపుడు నీ దారిన నువ్వు చల్లగా జారుకుంటున్నావా?' చాలా తీవ్రంగా, పదునుగా అడిగాననుకుంది.
రాజా కనుబొమలు ముడిపడ్డాయి.
"నువ్వేం మాట్లాడుతున్నావో నా కర్ధం కావడం లేదు.'
'అవునవును. ఇప్పుడెందు కర్ధమవు టాయి? నాతొ కలిసి తిరిగినన్నాళ్ళూ బాగానే అర్ధమయ్యాయి. విదిపోవాలను కునేప్పటికి అయోమయంగా తోస్తున్నాయి' హేళన చేస్తున్నట్లుంది. ఈ ధోరణి రాజాకి 'చిరాకన్పించింది. ఆసహనంగా అన్నాడు. 'అసలు నువ్వనదలుచు కున్నదేంటో సూటిగా చెప్పేయి. అంతేకాని యీ దొంక తిరుగుడు పద్దతి నాకు నచ్చదు.'
"ఇంకా ఏమడగాలి? అమాయకురాలైన ఆడపిల్లతో పరిచయం పెంపొందించు కోవడం, తప్పు కాదా? నా మీద వచ్చిన రూమర్స్ కి నీ బాధ్యత లేదా? ప్రేమించానని ఉత్తరాలు రాసి, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా పారిపోవడం పిరికివాడి లక్షణం కాదా అని అడుగుతున్నాను. బహుశా యిప్పుడు బాగా అర్ధమయ్యాయను కుంటాను.' తన వాగ్ధాటికి మనసులో తననే అభినందించు కొంది.
రోడ్డు మీద జనసంచారం అట్టే లేదు. వీధి దీపాల వెలుగు మందంగా ప్రసరిస్తోంది. నడక ఆపి, రాజా ఒక్క క్షణం నిర్ధాంత పోయి చూశాడు. మరుక్షణం లోనే బిగ్గరగా నవ్వేశాడు. అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ.
"వారేవా! మంజూ ఏమన్నావ్? మళ్లీ అను.' ఆగి, ఆగి నవ్వాడు. మంజుల తోక త్రొక్కిన త్రాచులా లేచింది.
"ఏం? జీవితాలతో ఆటలాడు కోవడం అంత నవ్వుగా ఉందా? ఇపుడు నువ్వు రాసిన వుత్తరాలు పదిమంది ముందు పెట్టి నవ్వుల పాలు చెయ్యగలను."
రాజాకి, జీవితంలో మొదటిసారిగా మంజుల మీద అసహ్యం కలిగింది. 'పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఉత్తరాలతో, చెయ్యదలచు కుంటే , నేనూ నిన్నల్లరి పెట్టి నీ జీవితాన్ని నరకం చెయ్యగలను. కాని అలాంటి ఆలోచనలంటే నే పరమ అసహ్యం నాకు. నువ్వు నన్ను రెచ్చగొట్టి, నా స్వభావానికి విరుద్దమైన మాటలని అనిపిస్తున్నావ్. మొదట ఎవరు కోరి కావాలని పరిచయం చేసుకొంది? ఎవరు ఉత్తరాలు రాసింది? ఇవన్నీ నిజంగా తెలియకే మాట్లాడావా? రూమర్స్ మనిద్దరి మీదా వచ్చాయి. దానికీ యిద్దరి బాధ్యతా ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. ఇన్నాళ్ళ మన పరిచయంలో పెళ్లి ప్రసక్తి వచ్చిందా? నువ్వేప్పుడన్నా పెళ్లి చేసుకుందాం, అని అడిగావా? సరే, నేనిప్పుడదుగుతున్నాను. నేను బి.ఏ పాసవగానే ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. ఉద్యోగం దొరగ్గానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కోరినవి నేనివ్వలేను కాని, నీ మనసు నొప్పించ కుందా మసలు కుంటాను. కాదూ, ఇప్పుడే చేసుకుందాం, అన్నా నేను సిద్దమే! నీ జీవితంలో నేను ఆటలాడు కొన్నానని నామీద నేరం మోపావు. అందులో నిజం ఎంత వున్నా, నేనలాంటి వాడిని కాదని నిరూపించడానికే నా ప్రయత్నం. మరి ఏమంటావ్?' సమాధానం కోసం ఎదురు చూశాడు. మంజుల ఆరోపణలు, రాజా మనసుకి పెద్ద అఘాతాన్నే కలిగించాయి.
సూటిగా అడిగిన ఈ ప్రశ్నకి మంజుల తడబడింది. జవాబు కోసం వెతుక్కుంది. 'రాజా యిలా అడుగుటాడని తను ఆశించలేదు. ఇప్పుడు రాజాని పెళ్లి చేసుకుంటే తను చాలా అవస్థ పడాలి. ఉద్యోగం దొరుకుతుందని నమ్మక మేమిటి? దొరికినా చాలీ చాలని బ్రతుకులు బ్రతకాలి. దీనికన్నా, నాన్న చూసిన డాక్టర్ ని చేసుకుంటే నే హాయి. ఎలాంటి సమస్యలు పీడించవు. రాజా పట్ల తనకు ప్రేమ లేదా? మొదట పంతంగా , అతడ్ని ఏడిపించాలని పరిచయం చేసుకుంది. కాని, తనకు తెలీకుండానే అతడి ఆకర్షణ లో పడింది. ఈ ఆకర్షణ నుండి విముక్తి పొందాలని వివేకం నచ్చ చెప్తున్నా , హృదయం కొంచెం ఘర్షణ పడుతోంది. తను రాజాని చేసుకో కుందా వుంటే, తను కోరుకున్న జీవితం తనకు లభిస్తుంది. రాజా ఉన్నతి కి, తను అడ్డు రాదు. ఈ ఆలోచనతో మంజుల మనసు తేలిక పడింది. రాజా ఉన్నతి కోసం తన ప్రేమను త్యాగం చెయ్య బోతున్నందుకు గర్వపడింది , పాపం, మంజులకు. ఒక విషయం తెలియలేదు! మనిషి, తన లక్ష్యాన్ని సాధించుకునే ప్రయత్నం లో , తనకు తెలీకుండానే , తన ఆలోచనల్ని తదనుగుణంగా తన కనుకూలంగా మలచుకొని, వాటినే అతి ఉదాత్త మైనవి గా, యితరుల కోసం అన్నట్లుగా ...భ్రమ పడి మురిసి పోతాడని? స్వార్ధం ఎప్పుడూ పై మెట్టులోనే వుంటుంది.
'ఏం జవాబు చెప్పు.' రెట్టించి అడిగాడు.
రాజా ఆవేశం చూసిన మంజులకు తను 'ఊ' అంటే యీ పళంగా ఉన్నపాటున తీసికొని వెళ్లి పెళ్లి చేసుకుంటాడన్నంత భయం కల్గింది. ఏం చెప్పాలో చప్పున తట్టలేదు. 'తను రాజాని మాత్రం పెళ్లి చేసుకోవటానికి సిద్దంగా లేదు.' అది మంజుల మనసుకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలా అని వోటమిని ఒప్పుకోటం బాధాకరంగా ఉంది. న్యాయానికి జరిగిన దానిలో తన ప్రమేయమే ఎక్కువ అని తెలిసినా, అలా అని ఒప్పుకోవటం మాత్రం అసంభవం అని తేల్చుకుంది. చటుక్కున రాజా దగ్గరికి వచ్చి, అతడి చెయ్యిని స్నేహ పూర్వకంగా నొక్కుతూ, మార్దవం నిండిన స్వరంతో అంది. 'పోనీయ్ రాజా! నిన్ను నిందించడం నాకు కష్టంగానే ఉంది. నా స్వార్ధం కోసం నిన్ను పెళ్లి చేసుకుని, నీ భవిష్యత్తుని పాడు చెయ్యటం నా కిష్టం లేదు. నాకింతే పాప్తం అని సరి పెట్టుకుంటాను. నీ కోసం, త్యాగం చెయ్యడం కన్నా కావాల్సిన దేముంది! నీకు బాధ కల్గిస్తున్నా ఒకమాట చెప్పాలి. ఇహ నుంచి మనం అపరిచుతుల్లా మెలగడమే శ్రేయస్కరం. 'గుడ్ నైట్ ఎండ్ గుడ్ బై' ఇంకోమాట మాట్లాడటానికి రాజాకి అవకాశ మివ్వకుండా , దూరంగా కన్పిస్తున్న తన ఇంటి కేసి వడివడిగా సాగిపోయింది.
రాజా నిశ్చేష్టుడై నిలబడ్డాడు ఒక్క నిమిషం. మరుక్షణం గట్టిగా నవ్వేశాడు. మంజుల మాటలని తలచుకొని , తలచుకుని మరీ నవ్వాడు.
ఎలక్ట్రిక్ పోల్ దగ్గర , ఒక్కడే నిలబడి నవ్వుతున్న రాజాని దారిన పోయే ఒకరిద్దరూ వింతగా చూశారు. రాజా అది గమనించి నవ్వాపేశాడు. సిగరెట్ పొగ వదులుతూ అనుకున్నాడు.
