సుబ్బన్నకి తండ్రి చిన్నతనంనుంచీ ఇచ్చిన శిక్షణవల్ల సెంటిమెంటు తెలియదు. తనకు సాయంచేసిన వాడికపకారం చేయడాని కతనేమాత్రమూ సంకోచించడు. అతను తలపెట్టిన దారుణాన్ని కన్నీళ్ళాపలేవు. జాలి పలుకులు వారించలేవు. కానీ చేసేదేదో చాలా తెలివిగా రహస్యంగా చేస్తాడు.
కొడుకు ప్రవర్తన జగ్గడికి చాలా తృప్తిగా వుంది. అన్ని విధాలా తన కొడుకు వృద్ధిలోకి వచ్చేడని రూఢి చేసుకున్నాక కొడుకుని పిలిచి-"ఒరేయ్ సుబ్బన్నా-నువ్వు నాకో పని చేసిపెట్టాలిరా....." అన్నాడు.
"చెప్పు...." అన్నాడు.
"రంగారావు తెలుసుగదా-వాడి కూతుర్ని వాడి కళ్ళ ముందే అనుభవించాలి నువ్వు....." అన్నాడు జగ్గడు.
సుబ్బన్న చలించలేదు-"అలాగే జేస్తాను., కానీ ఇలాంటి పనులూరికే చేసే అలవాటు లేదు నాకు...." అన్నాడు.
జగ్గడు ఆశ్చర్యంగా-"నేను నీ బాబునిరా....." అన్నాడు.
"వ్యవహారం దగ్గర మనకి సెంటిమెంట్లు పనికిరావు...." అన్నాడు సుబ్బన్న.
జగ్గడికి చాలా సంతోషమయింది. తన కొడుకో పని సాధించగలడని అతనికి పూర్తిగా రూఢి అయింది. "మామూలుగా కాదురా-మీ ఇద్దరూ వ్యవహారంలో ఉండగా నేను ఫోటో తీస్తాను. ఎంతకావాలో చెప్పు....." అన్నాడు.
"రెండువేలు...."
"సరే అలాగే ఇస్తాను....."
"ఇస్తానంటే కాదు. ఒక వెయ్యి అడ్వాన్సివ్వాలి...." అన్నాడు సుబ్బన్న.
జగ్గడికి చాలా ముచ్చటయింది-"ఇస్తాను కానీ-నేను ఫోటో ల్తీసుకుందు కెక్కడికి రావాలంటావ్?"
"పిల్లదాన్ని మనింటికే తీసుకొస్తాను. ఫోటోల్తీసు కుందుకు నీకు బాగా వీలుగా ఉంటుంది...." అన్నాడు సుబ్బన్న.
5
సుబ్బన్న చాలా సులభంగా తనకున్నది సాధించాడు. అతను సూటూ బూటూ వేసుకుని కాలేజీ దగ్గర రంగారావు కూతురు కళ్యాణిని కలుసుకున్నాడు. చాలా నమ్మకంగా మాట్లాడి ఆమె తండ్రి ఫలానాచోట ఉన్నాడు-రమ్మంటున్నాడని చెప్పాడు. అతని వేషధారణ, ఉచ్చారణ ఆమెను మోసం చేశాయి. ఆతనొక చిన్న పెంకుటింటికి తీసుకువెడితే ఆమె కనుమానంగా-అతను తెలివిగా ఆమెను నమ్మించి లోపలకు రప్పించాడు. అతని సంభాషణా చాతురి అద్బుతం.
లోపలకు రాగానే కళ్యాణికి కత్తి చూపించాడు సుబ్బన్న ఆమె హడిలిపోయింది. అతను చెప్పినట్లు విని లొంగిపోవడాని కామె కెంతో సమయం పట్టలేదు. ఏ మాత్రమూ ప్రతిఘటించలేదామె. ప్రతిఘటిస్తే చంపేస్తాడేమోనని భయపడిందామె.
జగ్గడు చాలా హయిగాం తాపీగా వాళ్ళిద్దరినీ ఫోటోలు తీశాడు. ఇదేదో బ్లాక్ మెయిల్ వ్యవహారం కానున్నదని కళ్యాణికి తెలిసిపోయింది. ఇష్టంలేకపోయినా ఆమెకు తప్పలేదు.
తన అవసరం తీరేక సుబ్బన్న ఆమెను వదిలిపెట్టేశాడు. తండ్రి దగ్గర ఇంకో వెయ్యి వసూలు చేసుకున్నాడు.
రెండ్రోజులు పోయాక జగ్గడు రంగారావుని కలుసుకుని-"కులాసాగా ఉన్నారా బావగారూ....." అనడిగాడు.
రంగారావు మండిపడి-"తప్పనిసరై ఒకసారి నా పెళ్ళాం నిన్ను అన్నా అందిగా అని వరస కలుపుతావుట్రా వెధవా...." అన్నాడు.
"మాటలు జాగ్రత్తగా రానీండి. నేను బావగారూ అన్న కారణంవేరు. ఈ ఫోటో బాగా చూడండి. ఇందులో ఉన్న మగాడు మా అబ్బాయి. అమ్మాయెవరో చూడండి. నేను బావగారూ అనెందుకు పిలుస్తున్నానో తెలుస్తుంది....."
ఫోటో చూసి రంగారావు మ్రాన్పడిపోయాడు. అతనికి నోట మాట రాలేదు.
"ఏయ్ రంగా-పగ ఒకటికాదు-రెండుకాదు-పదమూడేళ్ళుగా రేగుతున్న పగ. నా కొడుకు సుబ్బన్న నాకులా ఎదవకాదు. నీకు చెల్లెనని దణ్ణంపెడితే ఆడదాన్నొదిలిపెట్టే రకంకాదు వాడు. వాడేంచేస్తాడో వివరంగా తెలుసుకోవాలంటే నా దగ్గరింకా చాలా ఫోటోలున్నాయి. నేనడిగింది నీడగ్గర్నుంచి దొరక్కపోతే ఈ ఫోటో లింకా చాలామంది చూస్తారు....." అన్నాడు జగ్గడు.
"ఏంకావాలి నీకు?"-అన్నాడు రంగారావు.
"దెబ్బకు దెబ్బ రక్తానికి రక్తం...."
"అంటే?"
"నీ పెళ్ళాం కావాల్నాకు. అన్నా అని పిలిచిందని వదిలిపెట్టేశాను. అది నన్ను జైలుకి పంపించింది. నా పెళ్ళాన్నెలాగూ వాడుకున్నావ్ నువ్వు కాబట్టి నీ పెళ్ళాం నాకూ వరసే అవుతుంది. ఏ బలవంతం నేరంమీద నన్నది జైలుకు పంపించిందో-అదే నేరం ఇప్పుడు నీ యొక్క, దానియొక్క అనుమతిలో జరగాలి....."
రంగారావు పళ్ళు కరకరలాడాయి.
"అలా చప్పుళ్ళు చేయకు. నీ కూతురు బ్రతుకు నా చేతిలో ఉంది....." అన్నాడు జగ్గడు.
రంగారావుకేం జవాబివ్వాలో తోచలేదు.
6
జగ్గడికి చాలా సంతోషంగా ఉంది. రేపే అనసూయ తనతో ఉండడానికి ఒప్పుకుంది. దాని మొగుడు దాని ఎదురుగా ఉండి దానిచేత ఆ మాట లనిపించేడు. దాని కళ్ళలో నీళ్ళున్నా తన కంటివేడి ఆవిరుల కవి ఇగిరిపోయాయి.
డబ్బుంది కదా అని తన జీవితంతో ఆటలాడబోయిన రంగారావుకు జీవితాంతం గుర్తుండిపోయే అవమానం జరుగుతోంది. ఇందుకు సుబ్బన్న తనకు చాలా సాయపడ్డాడు.
భోజనం చేయడానికి కొడుకుకోసం ఎదురుచూస్తున్నాడు. సుబ్బన్న కాస్త ఆలశ్యంగా వచ్చాడు. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి భోంచేశారు.
భోజనాలయ్యేక సుబ్బన్న తండ్రికి స్వయంగా మజ్జిగ ఇచ్చాడు.
జగ్గడు తాగడం పూర్తికాగానే విరుచుకు పడిపోయాడు. సుబ్బన్న చలించలేదు. తండ్రిని మంచంమీద చేర్చాడు, పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. తర్వాత పెట్టెలు వెదికాడు. దొరికిన కొన్ని కవర్లు తీసుకుని అన్నీ పరిశీలించి తృప్తిగా తలాడించి-వాటిని పాంటు జేబులోకి తోసేశాడు.
ఇంకో పదినిముషాలుండి-ఇల్లు తాళం వేసుకుని రంగారావింటికి వెళ్ళాడు.
రంగారావు సుబ్బన్నకోసం ఎదురు చూస్తున్నాడు.
"ఏమయింది?" ఆత్రంగా అడిగాడు రంగారావు.
"మీరిచ్చిన పొడి మజ్జిగలో కలిపి మా నాన్నకిచ్చాను. విరుచుకు పడిపోయాడు. బహుశా చచ్చిపోయాడనుకుంటాను. శ్వాస అడ్డంలేదు...." అన్నాడు సుబ్బన్న.
రంగారావు ఆశ్చర్యంగా సుబ్బన్నవంక చూసి-"అంటే-మీ నాన్నను చంపేశావన్నమాట! నీకు బాధగా లేదూ?"-అన్నాడు.
"ఎదవ సెంటిమెంట్లు గురించి నాదగ్గర మాట్లాడకండి. అన్నప్రకారం తక్కిన పదిహేనువేలూ ఇవ్వండి....."అన్నాడు సుబ్బన్న. వాడి కళ్ళలో విషాదం ఏమాత్రమూ లేదు.
రంగారావు అన్నీ వందరూపాయల నోట్లు నూటయాభై ఇచ్చాడు-"మరి నెగెటివ్వు తెచ్చావా?"
సుబ్బన్న జేబులోని కవర్లు అందించి-"అన్నీ ఇవ్వలేదు. ఇంకా రెండు నా దగ్గరున్నాయి...." అన్నాడు.
"ఎందుకని?"
"మా నాన్న చావుగురించి ఎవరికీ ఏ అనుమానమూ రాకుండా ఉండేలా చూస్తాననీ-అంత్యక్రియాలవీ మీరే జరిపిస్తాననీ చెప్పారు. వ్యవహారం పూర్తయి అన్నీ సక్రమంగా ముగిసేదాకా-ఆ రెండు నెగెటివులూ నా దగ్గరే ఉంటాయి"-అన్నాడు సుబ్బన్న.
సుబ్బన్న ముఖ కవళికలు చూసిన రంగారావు నమ్మలేక పోతున్నాడు. వీడు మనిషా? పశువా? తండ్రిని చంపేశాడు డబ్బుకోసం. ఇంతపిసరు విచారం వాడి ముఖంలో కనపడ్డంలేదు.
"సరే-అలాగే-కానీ మరి నువ్వు మా అమ్మాయి జోలికి రాకూడదు...."
"బాగుంది ఆ పిల్ల నాకెందుకు? డబ్బిస్త్గే అంతకంటే మంచి పిల్లలు దొరుకుతారు నాకు. మీ అమ్మాయికోసం మా నాన్న నాకు రెండువేలిచ్చాడు. అందుకని తప్పితే లేకపోతే మీ అమ్మాయి జోలికి నేను వచ్చేవాడినేకాదు" అన్నాడు సుబ్బన్న.
"సెహభాష్ సుబ్బన్నా-నీలాంటి మనిషే నాక్కావాలి. అప్పుడప్పుడు కనిపిస్తూండు...." అన్నాడు రంగారావు.
"అలాగే సరైన ధర ముట్టచెబితే ఏ పనైనా చేసే స్తాను...." అన్నాడు సుబ్బన్న.
ధనికులపై కత్తికట్టి తన కొడుకుని అమానుషుడిగా తయారుచేసేడు జగ్గడు. కానీ తన కొడుకు అమానుషత్వమే వారికి శ్రీరామరక్ష కాగలదని అతనెన్నడూ ఆలోచించలేదు.
సెంటిమెంటు కారణంగా జైలు పాలయ్యానని బాధపడి-కొడుకును సెంటిమెంట్సుకు అతీతంగా పెంచితే- అదీ తన ప్రాణానికే వచ్చింది జగ్గడికి. నిప్పును తాకితే కాల్చక మానదన్నట్లు, డబ్బున్నవాడితో పేచీపడే పేదలబ్రతుకులంతే!!
* * *
సమాప్తం
