Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 53

 

    
    "ఎంత ?"
    "నెలకు అయిదొందలు...."
    'అంతిచ్చుకోలేను. మూడొందల వరకూ ఇచ్చుకోగలను...."
    'సరే కానీయ్ " అంటూ లేచాడు.

                              *    *    *
    మర్నాడుదయం అతనే నాతో మాట కలిపేడు. "మీకు నా మీద చాలా కోపంగా ఉందనుకుంటాను."
    "కోపం కాదు గానీ అమాయకులైన ఆడవాళ్ళను మీరు బాధిస్తున్నారు. అది నాకు నచ్చడం లేదు" అన్నాను.
    అతను నవ్వి, "ఎవరి సంగతి? మీరనేది సరళా, శారదల సంగతేనా? వాళ్ళు నిజంగా అమాయకులనుకుంటున్నారా? ఎంత కులటైనా ఆడది పతివ్రతలా మాట్లాడుతుంది. నాతో ఏం పరిచయం లేకుండానే వాళ్ళు నాకు డబ్బిచ్చారానుకుంటున్నారా మిమ్మల్ని చూసి భయపడి అలా నటించారు!" అన్నాడు.
    "నేను నమ్మను. మీరు వాళ్ళ గుర్తులెవరి ద్వారానో సంపాదించి ఉండాలి" అన్నాను. ఎవరో అన్నా నాకు తెలుసు రంగమ్మ ద్వారా అతనికా వివరాలు లభించాయని.
    అతను నా వంక అనుమానంగా చూశాడు. "మీకు అనుభవం తక్కువన్న మాట.ఆ పరిచయం లేనిదే అలాంటి గుర్తులు ఆడవాళ్ళవి తెలుసుకోలేరు. ఇంతవరకూ వచ్చింది కాబట్టి, మీతో నిజం చెబుతున్నాను. నాకు ఆడవాళ్ళ నాకర్షించే పద్దతులు బాగా తెలుసును. వాళ్ళను వలలో వేసుకుని తర్వాత డబ్బు గుంజుతాను. అయినా నేను పేద ఆడవాళ్ళను భాధించడం లేదు కదా!"
    అప్పుడే నాకతని నవ్వు గుర్తు కొచ్చింది . ఆ నవ్వులో ఏదో విశేషముంది. ఆ నవ్వుకి లొంగిపోయే నేను మారు మాట్లాడకుండా అతనికి గదినిచ్చాను. ఆనవ్వే తన పట్ల సమ్మోహనాస్త్రంగా పని చేస్తోందేమో? కానీ మరి....? రంగమ్మ తెచ్చిన చీటీ! వాళ్ళతో పూర్వ పరిచయముండి వుంటే అతనికి రంగమ్మ తెచ్చిన చీటీ అవసరమేముంది? లేదు. ఇతనేదో నాటకమాడుతున్నాడు.....
    "వాళ్ళ గుర్తులు సంపాదించదానికి మీకేదో పద్దతి ఉందని నా అనుమానం...."
    'అమ్మాయిలకు నేనంటే ఉన్న ఆకర్షణ మీకు తెలియదు. నన్ను చూసి నిగ్రహించుకోలేక నిన్న శారద ఏం చేసిందో చూశారా? అమచ్చ వ్యవహారమంతా దొంగ నాటకం - నన్ను చెట్టు చాటుకు తీసుకు పోవాలనే ...." అతను తలచుకుని తలచుకుని నవ్వాడు- 'ఈ ఉళ్ళో యాభై శాతం పైగా అమ్మాయిలూ నా క్లయింట్స్-- ఈరోజు బీచ్ కి వెడదాం -- ఎక్కడైనా ఒంటరిగా ఉన్న ఒక్క అమ్మాయిని చూపించండి. ఆమె నా క్లయింటని రుజువుచేస్తాను.."
    "నేనది చాలెంజ్ గా స్వీకరించాను. అందువల్ల ఆ సాయంత్రం అతనితో బీచ్ కి వెళ్ళాను. కాసేపు అటూ ఇటూ తిరిగేక -- ఒంటరిగా నిలబడి ఏదో ఆలోచిస్తున్న ఓ యువతిని అతనికి చూపించేను - రంగారావు ఉత్సాహంగా 'ఆమె నా క్లయింటే-" అని నవ్వుతూ ఆమెను సమీపించి , షోగ్గా తన కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఇప్పుడతను ఆమెను పరీక్షగా చూస్తున్నాడు. కానీ కళ్ళజోడు వెనుకనున్న దొంగ చూపులు ఆమెకు తెలియవు . ఒక్క నిమిషం ఆగి "మేడమ్ !" అన్నాడు.
    ఆమె ఉలిక్కిపడి -- "ఎవరు ?" అంది.
    "ఒకరాత్రి మనం లాడ్జిలో ఎంతో హాపీగా గడిపాం. కానీ ఒకరి పెర్లోకరు తెల్సుకోలేదు -" అన్నాడతను నిర్భయంగా.
    "యూ...." అందామె కోపంగా.
    'ఛీ - ఆడవాళ్ళంతా ఒకటే! ఈ పక్కనున్న న మిత్రుడికి బ్రహ్మచెముడు. ఏమీ వినపడదు. అందువల్ల మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు --"
    ఆ అమ్మాయి కళ్ళు ఎరుపెక్కాయి-- " ఎవడ్రా నువ్వు?"
    "ఎవడ్రా?' అంటూ అతను అసభ్యకరమైన భాష ఉపయోగించి , అదే భాషలో ఆమె శరీరంలో పర పురుషుల కంట బడటానికి వీలులేని ప్రదేశంలోని ఒక గుర్తు చెప్పాడు . చెవుడు నటించకపోతే  ఆ మాటలకు నేను చెవులు మూసుకోవాలసిందే!
    ఆమె స్టన్నయిపోయినట్లుంది - ఒక నిమిషం అనంతరం తేరుకుని - ఎవరు నువ్వు?" అంది.
    'ఇంకా అలాగే నటించు -- నిన్ను గురించిన నిజాలను ప్రచారం చేసి నీకు పెళ్ళి కాకుండా చేయగలవాడినని మాత్రం గుర్తుంచుకో -"
    "మిస్టర్ ! నీకేం - కావాలో చెప్పు! నన్నల్లరి పెట్టకు ...."
    "దట్స్ గుడ్! చూడు, నీ పేరేమిటి?"
    "యమున...."
    "డబ్బుందా?"
    "లేదు, గుమస్తా ఉద్యోగం చేస్తున్నాను-"
    'ఐసీ అందుకే నన్ను లాడ్జీలో కలిశావు. సరేలే - నా దగ్గర మర్యాదగా మాట్లాడడం నేర్చుకో.... వస్తాను-"
    అక్కణ్నుంచి బయటపడ్డాక రంగారావు అన్నాడు. "అసలు ఆడవాళ్ళతో పరిచయం చేసుకోవడం ఒక పెద్ద టెక్నిక్ . ముక్కూ ముఖం ఎరుగని స్త్రీతో - ఆమె భర్త పక్కనుండగా ఎలా పరిచయం చేసుకుంటానో చూద్దురు గాని-"
    మేము కొంత దూరం నడిచేక మాకొక యువ జంట తగిలారు . ఇద్దరూ కొంచెం గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలను బట్టి జంటలో భార్య పేరు రమ అనీ, ఆవిడా కాలేజీలో బియ్యే చదివిందని తెలిసింది. ఈ వివరాలు తెలియడానికి - మేము వాళ్ళకు వెనకాలే కొంత దూరం నడవ్వలసి వచ్చింది. అలా కొంతదూరం నడిచేక మేము వేగంగా నడిచి -- వాళ్ళను దాటాము. అప్పుడు రంగారావు ఎందుకో వెనక్కు తిరిగి -- ఆవిడను చూసి ఉలిక్కిపద్దట్టు నటించాడు.
    "హల్లో రమా !" అన్నాడు రంగారావు.
    దంపతులిద్దరూ తెల్లబోయారు.
    "నన్ను గుర్తుపట్టలేదా రమా!" అన్నాడు రంగారావు.
    "ఎవరు మీరు?" అన్నాడు రమ భర్త కొంచెం తీవ్రంగానే.
    "నా పేరు రంగారావు సార్! మీరు రమ భర్త అనుకుంటాను- మీ పేరు ...."
    'ఆనంద్!"
    "చూడండి ఆనంద్ గారూ! మీ శ్రీమతి నేనూ ఒకే కాలేజీలో ఒకే క్లాసు చదువుకున్నాం. మీరు చూస్తె ఎంతో సంస్కారం గల వారిలా కనిపిస్తున్నారు. కాని మీకు భయపడో ఏమో ? ఆమె గారు నన్నేరుగనట్లు నటిస్తోంది. క్లాస్ మేట్ అంటే ఎవరైనా తప్పుగా అర్ధం చేసుకుంటారుటండీ-- అందులోనూ మీలాంటి వారూ-- చదువై విడిపోయేక క్లాస్ మేట్సయిన ఆడపిల్లలందరూ చెల్లెళ్ళనిపిస్తారు. అందువల్లనే రమ ఇప్పుడు హటాత్తుగా ఇక్కడ కనబడే సరికి - నా చెల్లెల్ని చూసినంత ఆనందం కలిగి పలకరిస్తే -- చూడండి...."
    ఆనంద్ నోచ్చుకున్నట్లు కనపడ్డాడు ---" అందులో తప్పేముంది రమా!"
    "నాకు నిజంగానే ఈయనెవరో...."
    'చూశారా....చూశారా మీకు భయపడి....?" అన్నాడు రంగారావు.
    ఆనంద్ చిరాగ్గా ముఖం పెట్టి -- "ఈ పెద్ద మనిషి నిన్నేరుగుదునని అంత ఖచ్చితంగా చెబుతుంటే , నువ్వలా కాదనడం ఏం బాగోలేదు. పరిచయమున్న ప్రతి మగవాడితోనూ ఏదో ఉందనుకునేటంత సంస్కార విహినుడునా  నేను-" అన్నాడు.
    రమ ఏదో గుర్తు చేసుకుంటున్నట్లు -- ప్రయత్నించి - ""ఆ గుర్తు కొచ్చినట్లే ఉంది..." అంది. కానీ నిజానికి ఆమెకు గుర్తుకోచ్చినట్లు లేదు. ఆ తర్వాత అవీ ఇవీ కబుర్లు చెప్పి , అతను ఆనంద్ అడ్రస్ సంపాదించాడు.
    వాళ్ళూ, మేము విడిపోయేక రంగారావు నాతొ చెప్పాడు-" రేపు ఆమె ఇంటికి వెడతాను. నా ఆకర్షణకు లోను చేసుకుంటాను. తర్వాత మచ్చల వివరాలతో భయ పెట్టి వీలుంటే సొమ్ము చేసుకుంటాను...."
    ఈ సంఘటనతో నాకు రంగారవంటే బాగా అసహ్యం ఎక్కువైంది. అటువంటి వాడు సంఘద్రోహి అని తెలిసి తెలిసి - అటువంటి వాడికి ఆశ్రయ మెందుకిచ్చానా అని బాధపడ సాగాను. అయితే మరో రెండు నెలల్లో రంగారావు తన మకాం మార్చేశాడు. అతనిప్పుడా ఉళ్ళో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు. వెళ్ళే ముందు రంగారావు నాకెన్నో రకాలుగా కృతజ్ఞతలు తెలియ పర్చుకున్నాడు. నేను వీలైనంత ముక్తసరిగా ఉన్నాను.
    తన సంపాదనకు నేనెన్నుకున్న మార్గం మీకెంత మాత్రమూ నచ్చలేదని నాకు తెలుసును. కానీ నేను చేసే పని నాకు నచ్చింది అసలు భగవంతుడే నన్నిలా జీవించమని రాసి పెట్టడనుకుంటాను" అన్నాడతను వెళ్ళేముందు నాతో.
    "మనం చేసే పని మంచిది కాదనిపించినప్పుడు భగవంతుడు గుర్తు కొస్తుంటాడు లెండి- " అన్నాను నేను.

                             *    *    *    *
    
    వసంత దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరం చూశాను -- అప్పుడే వేసవి సెలవులు అయిపోయాయా అనిపించింది . ఆమె బియ్యే ఫైనలియర్ చదువుతోంది. స్టేషన్ కి రమ్మనమని రాసింది. కానీ ఆరోజుకు బద్దకించి- మర్నాడు తిన్నగా లేడీస్ హాస్టల్ కు వెళ్ళాను. నేను స్టేషన్ కు రానందుకు వసంత ప్రదర్శించిన కోపం ఇంతా అంతా కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS