వీడని జంట
వసుంధర
వాళ్ళిద్దరూ స్మగ్లర్సు. ఒకడి పేరు రాజా. రెండో వాడి పేరు విక్టర్. ఇద్దరూ పెద్ద పని మీదే నగరం వస్తున్నారు. వాళ్ళిద్దరి చేతుల్లోనూ చెరో బ్రీఫ్ కేసూ వున్నాయి. వారి దగ్గిర లక్షలు విలువ చేసే మత్తు పదార్ధాలున్నాయి. ఆ నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త సదానంద్ కు వారా మత్తు పదార్ధాలనందజేయాలి.
రాజా , విక్టర్ -- ఇద్దరు కూడా పోలీస్ రికార్డ్స్ లో వున్నారు. ఒకటి రెండు సార్లు జైలు క్కూడా వెళ్ళి వచ్చారు. పెద్దల ప్రాపకం వల్ల జైల్లో ఎక్కువకాలం మగ్గకుండా బయట తిరగ్గలుగుతున్నారు. స్మగ్లింగ్ అపరేషన్సు లో వారికి వారే సాటి అని అంతా చెప్పుకుంటారు. అయితే వాళ్ళు స్వయంగా ఏ వ్యాపారమూ చేయడం లేదు. ఒక చోటి వస్తువు ను మరో చోటుకు చేర్చడం వారి బాధ్యత. అందువల్ల వచ్చే ప్రతిఫలంతో ఇద్దరి జీవితమూ సుఖంగా దర్జాగా వెళ్ళిపోతోంది.
ట్రెయిన్ నగరం చేరుకుంటోంది. ఔటర్ సిగ్నల్ కోసం ఆగింది. రాజా, విక్టర్ -- ఇద్దరూ సిద్దంగా వున్నారు.
తమపై పోలీసు నిఘా వుందని వారికీ తెలుసు. ఎక్కడేవరు తమను గుర్తుపట్టినా -- ఓసారి సోడా చేసి కానీ వదలరు. ఇప్పుడు సోదా జరిగిందంటే తాము రెడ్ హండెడ్ గా పట్టుబడి పోతారు. తాము పట్టుబడి పోవడం వల్ల ప్రమాదం తమకే కాదు- పేరు పొందిన ఇద్దరు పారిశ్రామికవేత్తల బ్రతుకులు బయట పడతాయి. అందువల్ల వాళ్ళు కూడా తమను వేయి కళ్ళతో కనిపెడుతుంటారు. తాము పోలీసులకు దొరికితే వాళ్ళు తమను ప్రాణాలతో బ్రతకనివ్వరు.
చేసేపని ప్రమాదకరమైనదని తెలిసినా కొందరికి ప్రమాదాల్లో జీవించడం లోనే మజా వుంటుంది. ప్రస్తుతం రాజా శ్రీనివాసుడిని. విక్టర్ జీసస్ నీ ప్రార్ధించుకుంటున్నారు. తాము తలపెట్టిన కార్యక్రమం జయప్రదంగా నెరవేరేలా చూడమంటున్నారు. తప్పితే తమకు వేరే జీవన విధానం ఏర్పాటు చేయమని వాళ్ళు భగవంతుణ్ణి వేడుకోవడం లేదు.
ప్రస్తుతానికిద్దరూ మారువేషాల్లో వున్నారు. రాజా ముస్లిం వేషంలో వున్నాడు. విక్టర్ పిలక బ్రాహ్మణుడు . తమనేవరైనా గుర్తిస్తారన్న భయం వారికీ లేదు.
ట్రెయిన్ ఔటర్ సిగ్నల్లోంచి కదిలే సమయంలో ఓ వ్యక్తీ వారి కంపార్టు మెంట్లో ప్రవేశించాడు రాజా, విక్టర్. యిద్దరూ కూడా అతణ్ణి గుర్తు పట్టారు. అతడు డిటెక్టివ్ వెంకన్న. ఒకసారి అతడే తామిద్దర్ని పట్టుకున్నాడు.
ఇప్పుడు వెంకన్న కంపార్టుమెంట్లో కి ఎందుకొచ్చాడూ అని ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఇద్దరికీ శరీరాల్లో సన్నని వణుకు ప్రారంభమైంది.
అది ఫస్ట్ క్లాస్ కూపే. అక్కడిప్పుడు వాళ్ళు ముగ్గురే వున్నారు.
వెంకన్న తను సీట్లో కూర్చుని ఇద్దరి వంకా చూసి -- "బండి ప్లాట్ ఫారం మీదకు చేరడానికి పది నిముషాల పడుతుందనుకుంటాను --" అన్నాడు.
రాజా, విక్టర్ -- ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఇద్దరూ వెంకన్న మాటలు విననట్లురుకున్నారు.
"పది నిముశాలేనా అనుకుంటాం కానీ - ఆ కాసేపట్లో ఎన్నో ఘనకార్యాలు సాధించవచ్చు -- " అన్నాడు వెంకన్న మళ్ళీ.
రాజా, విక్టర్ -- ఇద్దరూ కూడా ఆ మాటలు వినని వాళ్ళలా తమ తమ సీట్లకు జారబడ్డారు.
'పది నిముషాలు కాదు -- రోజంతా టైమిచ్చినా సరే -- సాధించలేని ఘనకార్యం ఒకటుంది. అదే నా నుంచి తప్పించుకోవడం !' అన్నాడు వెంకన్న మళ్ళీ.
ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. అంటే వెంకన్న తమను గుర్తు పట్టాడన్నమాట. ఎప్పుడు పట్టాడో, ఎలా పట్టాడో ఇప్పుడెం చేస్తాడో ?
డిటెక్టివ్ వెంకన్న కు ఎదురు తిరిగి పారిపోవడం ప్రాణంతకమని చాలామంది నేరస్తులకు తెలుసు. అయితే అతడికి నేరస్థుల పట్ల శత్రు భావం లేదనీ వారికీ తెలుసు. మనిషిలోని నేరాన్నే కానీ, మనిషిని శిక్షించకూడదన్నది వెంకన్న సిద్దాంతం. ఆ కారణంగా అతడెన్నో నేరాలను పరిష్కరించినా నేరస్థులను వదిలిపెట్టేయడం వల్ల అతడి పరిశోధనల ఫలితాలు చాలావరకూ అపన పాఠకులకు మాత్రమే పరిమితమైనాయి.
"ప్రపంచంలో నేరస్థులున్నారు. వారిని పట్టుకునేవారున్నారు. తాము చాలా తెలివైనవారిమని నేరస్థులనుకుంటారు. కానీ, పట్టుకునేవారే ఎక్కువ తెలివైన వారు. అందువల్ల పట్టుబడని నేరస్థులు అరుదుగా వుంటారు...." అన్నాడు వెంకన్న.
"ఎవరు మీరు? ఇవన్నీ మా కెందుకు చెబుతున్నారు?" అన్నాడు రాజా చిరాకును ప్రదర్శిస్తూ.
"ట్రెయిన్ ప్లాట్ ఫారం చేరడానికింకా ఏడు నిముషాలే టయముంది. నేనెవరో తెలియనట్లు నటించి మీరు మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. మీరిలా బయల్దేరినట్లు పోలీసు లకు సమాచారం అందింది. నా తరపున నేనూ బయల్దేరి వచ్చాను. ఈ క్షణంలో మిమ్మల్న రెస్ట్ చేసి పోలీసుల కప్పిగించగలను. కానీ అలా చేయడం లేదు. మీ బ్రీఫ్ కేసులు రెండూ నాకు అప్పగించండి. మిమ్మల్ని వదిలి పెట్టినందుకు ప్రతిఫలంగా చెరో వెయ్యి నాకు చెల్లించుకోండి. అటుపైన యింకేప్పుడూ యిలాంటి జీవితం పట్ల ఆకర్షితులం కాదని నాకు మాటివ్వండి ...." అన్నాడు వెంకన్న.
"మీరెవరో , ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకర్ధం కావడం లేదు." అన్నాడు విక్టర్. కానీ అతడి మనసులో బెంగ పట్టుకుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించు కోవడానికి అతడి మనసు దారులు వెతుకుతోంది.
"కాలం వృధా చేయద్దు. మీరు నేరాలకు పనికి రారు. మీ పద్దతుల్లో చాలా లోపాలున్నాయి. కావాలంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఓ రోజు టైమిచ్చి మిమ్మల్ని పట్టుకోగలను . కానీ ...." అని ఆగాడు వెంకన్న.
"మీ కంత నమ్మకముంటే మమ్మల్ని వదిలిపెట్టి చూడండి - " అన్నాడు విక్టర్ తను బైటపడుతూ.
"మిమ్మల్ని వదుల్తాను కానీ మీ వద్ద నున్న మత్తు పదార్ధాలు తీసుకుంటాను. ఇద్దరి వద్దా చెరో వెయ్యి తీసుకుంటాను. ఆ తర్వాత నా వేట ప్రారంభిస్తాను. ఒక్క రోజులో తప్పించు కోలేక పోయారో -- మీరు నేరాలు చేయడం మానేస్తానని నాకు మాటివ్వాలి --" అన్నాడు వెంకన్న.
"మిమ్మల్ని మీరు పట్టుకోలేక పొతే ?"
"అప్పుడు మీ దగ్గర తీసుకున్న వన్నీ మీకు తిరిగి అప్పగిస్తాను...."
చటుక్కున విక్టర్ వెంకన్న మీద దెబ్బ తీయాలని చూశాడు. వెంకన్న మెరుపు వేగంతో అతడి భుజం మీద ఓ దెబ్బ వేసి -- "నా జోలికి రావడం వల్ల మీరిద్దరూ స్పృహ లేకుండా ఈ ట్రెయిన్లో పడి వుంటారు. ఆ విధంగా పోలీసుల పాల్పడడం మరింత సులభమవుతుంది --" అన్నాడు.
వాళ్ళకు తప్పలేదు. ఇద్దరూ వెంకన్నకు బ్రీఫ్ కేసులూ, చెరో చెయ్యి సమర్పించుకున్నారు. వెంకన్న క్షణాల మీద అక్కణ్ణించి మాయమయ్యాడు.
ట్రెయిన్ ప్లాట్ ఫారం మీద ఆగింది.
2
రాజా, విక్టర్ ఇద్దరూ అటో ఎక్కాడు. వెంకన్న అతి సులభంగా మత్తు పదార్ధాలను వశ పర్చుకొనడం వారికెంతో బాధనిపించింది. కానీ ఏం చేయాగలరు? అంతా కన్ను మూసి తెరిచే లోగా జరిగిపోయింది. వెంకన్న తమను వదిలిపెట్టడం అదృష్టం. ఈ విధంగా తమ ప్రాణాలకు రక్షణ లభించింది. ఇప్పుడొక్కరోజు సమయంలో వెంకన్నకు దొరక్కపోతే అతడి నుంచి మత్తు పదార్ధాలు తిరిగి పొందగల అవకాశ ముంది. అది తాము పయోగించు కోవాలి. వెంకన్న అన్నమాట తప్పడంటారు.
ఇద్దరూ త్రిభువన్ హోటలుకు వెళ్ళారు. ఆ హోటల్లో పన్నెండో నంబరు గది వారికోసం ప్రత్యేకించబడింది. రిసెప్షనిస్టు కు చెప్పుకుని వాళ్ళు తాళం తీసుకుని తమ గదికి వెళ్ళారు. గదిలో కూర్చున్నాక ఇద్దరూ ఆలోచనల్లో పడ్డారు.
"మనం బాగా పూలయ్యాం! వెంకన్న మనని కనిపెట్ట లేకపోయాడనుకో! అప్పుడు బ్రీఫ్ కేసుల కోసం వెడతాం గదా -- అంటే పట్టుబడి నట్లే కదా --" అన్నాడు రాజా.
"ఇలాంటి ఆలోచనల వల్ల మనకేమీ ప్రయోజనం లేదు. నా మాట విను. మనమిక్కడెక్కున సేపుండడం మంచిది కాదు. వెంకన్న మానని ఫాలో అవుతూనే వుండి ఉంటాడు. మనం వేషాలు మార్చుకుని ఈ ఊర్నించి చెక్కేయాలి.... అన్నాడు" విక్టర్.
ఆ గదిలో వారికి వేషాలు మార్చుకునేందుకు అన్ని సదుపాయాలూ ఉన్నాయి. ఇద్దరూ కాసేపు ఏ వేషాలు మార్చాలా అని ఆలోచించారు.
