ఆనంద్ నేరాలు చేయడం లేదు గానీ తన దగ్గరున్న విలువైన వజ్రాలు క్యాషు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయిదారు లక్షల రొక్కం అతని వద్ద చేరింది. దానిని బ్యాంకు డిపాజిట్ల రూపంలో మర్చాలని చూస్తున్నాడు. హటాత్తుగా ఇంత డబ్బెక్కడి దని ఎవరూ తన మీద అనుమాన పడకూడదని అతని ఆశయం.
ప్రస్తుతం అతనుంటున్న ఇల్లు అన్ని సదుపాయాలూ కలిగి ఉంది. సామాన్యమైన ఇరుగూ పొరుగూ ఉంటున్నారు. అటూ ఇటూ కొత్తగా పెళ్ళయిన జంటలే ఉన్నాయి. ఒక పక్కగా ఉన్న జంటలోని కుసుమ చాలా అందంగా ఉంటుందన్నాడని ఆనంద్ పైన రాజేశ్వరి అలిగింది కూడా.
కుసుమ భర్త వెంకట్రావు ఏదో బ్యాంకులో పని చేస్తున్నాడు. నెలకు అరెడొందలు సంపాదించు కుంటున్నాడు. అతనికీ ఆనంద్ కూ కాస్త మంచి పరిచయమే ఉంది. వెంకట్రావు తో ఆనంద్ పరిచయం పెంపొందించుకోడానికి కుసుమే కారణమని అప్పుడప్పుడు రాజేశ్వరి ఆనంద్ ని ఎత్తి పోడుస్తూంటుంది.
ఆమె ఎత్తి పొడుపుల మాటేలగున్నా ఆనంద్ దృష్టి తరచుగా కుసుమ మీద పడుతుండేది. అతని దృష్టిని కుసుమ గమనించిందో లేదో తెలియదు కానీ ఆమె అతని కళ్ళలోకి కళ్ళు కలిపేది కాదు. ఆనంద్ మాత్రం విడవకుండా తన ప్రయత్నాల్లో తనున్నాడు.
ఒకరోజు కుసుమ ఉల్లిపాయల కోసమని ఆనంద్ ఇంట్లోకి వచ్చింది. ఆ సమయానికి రాజేశ్వరి బాత్రూం లో ఉంది.
"రాజేశ్వరి స్నానం చేస్తోంది " అన్నాడు ఆనంద్.
"రెండుల్లిపాయలు కావాలి" అంది కుసుమ వంచిన తల ఎత్తకుండా.
తన పరిసరాల్లో కుసుమ ఉంటె ఆనంద్ శరీరం పులకరించి పోయింది. అతను హడావుడిగా వెతికి నాలుగుల్లిపాయలు తీసి కుసుమ కందించాడు. ఆ సమయంలో ఆమె వెనుదిరుగబోతుండగా చటుక్కున చేయ్యి పట్టుకు న్నాడు. అతని చేయి వణుకుతోంది. మనసు భయపడుతోంది.
"ఇంట్లో ఆయనున్నారు....' అంది కుసుమ. సుతారంగా అతని చేయి విదిలించుకుని అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
ఆమె సమాధానం ఆనంద్ మనసుకు పులకరింత కలిగించింది.
6
"ఎవరూ ?' అంది కుసుమ.
"నేను --"అన్నాడు ఆనంద్.
కుసుమ తలుపులు తీసింది. "ఆయనింట్లో లేరు....' అంది భయంగా.
"తెలుసు. మా ఆవిడ కూడా ఇంట్లో లేదు..."
"ఎక్కడికి వెళ్ళారు?"
"మేట్నీ షోకి వెళ్ళింది. నాకు తల నొప్పిగా ఉండి ఇంట్లో వుండిపోయాను. తనకు మహా సినిమాల పిచ్చి ."
"మీకు ఏ పిచ్చి లేదా?"
"ఉంది."
"ఏమిటది?"
"కుసుమ పిచ్చి...." అంటూ నవ్వాడు.
"మీకు కుసుమ పిచ్చి కాదు...." అంటూ నవ్వింది కుసుమ.
"మరి----"
"ఆడవాళ్ళ పిచ్చి...."
"కావచ్చు. అదే నిజమైతే నా దృష్టిలో ఉన్న ఏకైక ఆడది కుసుమ."
"ఎంత ధైర్యం మీకు. పరాయి ఆడదాన్ని -అందులోనూ పెళ్ళయినదాన్ని పట్టుకుని....ఇలాంటి మాట లంటారు?"
"ఆనంద్ నవ్వి. "ఇదివరలో మా ఆవిడ సినిమా హల్లోనూ, మీ అయన బ్యాంకులోనూ మీరు నేనూ ఒక తలుపు అడ్డం లోనూ ఉండడం చాలా సార్లు జరిగింది కానీ తలుపు తట్టి నా కుసుమను పిలిచే ధైర్యం నిన్న నువ్వు ఉల్లిపాయలకు వచ్చినప్పుడే కలిగింది. అంతవరకూ నువ్వు నాకందవేమోనని భయపడ్డాను" అన్నాడు.
"నేనూ మీ గురించి అలాగే అనుకున్నాను. మీరు చేయి పట్టుకోగానే ఆశపుట్టి ప్రోత్సహించాలని పించింది." అంది కుసుమ.
ఆమె మాటల కశ్చర్య పడి ఆనంద్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమె కళ్ళలో విపరీతమైన కాంక్ష కనపడుతోంది. ఆమె అందానికా కాంక్ష వన్నె తెచ్చింది. అవన్నెలు ఆనంద్ ని ఉద్రేకపరిచాయి. అతను చటుక్కున ఆమెను బలంగా కౌగలించుకున్నాడు. ఆమె చుబుకం పైకెత్తి పెదవులను చుంబించాడు. క్షణాలలో ఇద్దరిలోనూ ఆవేశం మరిగింది.
కుసుమ నడుం పైన చేయి వేసి తన పడకగాదిలోకి ఆనంద్ నడిపించనున్న సమయంలో ఎవరో ఇంటి తలుపు తట్టారు. ఆనంద్ కు ఎక్కడ లేని చిరాకూ వచ్చింది. కుసుమ అతన్ని విడిపించుకుని తన ఇంట్లోకి పరుగెత్తి తలుపు వేసుకుంది.
"ఎవరూ?" అని అరిచాడు ఆనంద్.
"నేను. రాజేశ్వరి ని."
అతని ఆవేశం చల్లారిపోయింది. వెళ్ళి తలుపు తీసి, "సినిమాకు వెళ్ళలేదా?" అన్నాడు.
"ఏం సినిమా , జనం కొట్టుకు చస్తున్నారు. బ్లాకు లో రెండ్రూపాయల టిక్కెట్టు పది రూపాయల దాకా వెళ్ళిపోయింది..."
"అయినా కొనేసు కోవలసినది...."
"సరేలే. అవతల నువ్వు తలనొప్పితో బాధపడుతుంటే, ఎనిమిది రూపాయల ఎక్సట్రా గా తగలేయనా అంది రాజేశ్వరి ఆప్యాయంగా ఆనంద్ ని చూస్తూ.
"ఎనిమిది రూపాయలు అదా చేశాననుకుంటున్నావు కానీ నాకు ఎనిమిది వేల రూపాయల అవకాశం పోయింది . కుసుమ లభించడం మామూలు మాటలా?" అనుకున్నాడు మనసులో ఆనంద్.
7
"అన్నట్లు చెబుదామనుకుని మరిచిపోయాను. మన ట్రంకు వెంకట్రావు గారికిచ్చాను." అంది రాజేశ్వరి.
"ఎందుకు?" అన్నాడు ఆనంద్.
"ఎందుకో నాకేం తెలుసు? అయన అడిగాడు ఇచ్చాను."
"ఎప్పుడడిగాడు."
"పొద్దున్నే సిగరెట్లు తెచ్చుకోవడానికి నువ్వలా వెళ్ళావు. వెంకట్రావు గారిలా వచ్చి ట్రంకు అడిగాడు..."
'ఆయనకు మనింట్లో ట్రంకు ఉందని ఎలా తెలుసు?"
"నువ్వు తెచ్చినపుడు చూశాడట. అంత పెద్ద ట్రంకు చూసి ఆశ్చర్య పడ్డాడట. కానీ ఇప్పుడాయనకే అవసర పడిందట...."
ఆనంద్ ఉలిక్కిపడి , "ఏమిటో ఆ అవసరం..." ఆన్నాడు.
"ఏమో మరి.... కుసుమ కోసమా అనుకుంటే నిన్న రాత్రి బండి కామె పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడవసరం ఇప్పుడెందుకు వచ్చిందో....."
కుసుమ పుట్టింటికి వెళ్ళిందనగానే ఆనంద్ కి నిరుత్సాహం కలిగింది. అనుభవానికి అతి చేరువలోకి వచ్చి అందకుండా వెళ్ళిపోయింది కుసుమ.
"మళ్ళీ ఎప్పుడొస్తుందో...."
"అది నీకెందుకు. అయన పడాల్సిన బాధ...." అంది రాజేశ్వరి చిరాగ్గా.
"తన బాధేమిటో ఆనంద్, రాజేశ్వరి కి చెప్పుకోలేదు. అయాచితంగా లభించే అందమైన ఆడది అనుభవానికి దొరక్కుండానే పోయింది.
ఒకటి రెండ్రోజులయేక కాబోలు ఆనంద్ ఉన్న సమయంలోనే ట్రంకు తీసుకుని వెంకట్రావు వాళ్ళింటికి వచ్చాడు.
"మీ ట్రంకు మీకు తిరిగిచ్చేస్తున్నాననుకొండి. ఆనంద్ చిన్న తప్పుకు క్షమించాలి. వాడడం లో ట్రంకు పెయింట్ కొద్దిగా దెబ్బతింది. అందుకని కొత్తగా పెయింట్ వేయించాను. అయితే పూర్వపు రంగు దొరకలేదు. దాంతో రంగు మారింది. ...." అన్నాడు వెంకట్రావు.
ఆనంద్ ఉలిక్కిపడ్డాడు. నిజంగా అతను చెప్పిన కారణంగానే ట్రంకు రంగు మర్చవలసిందా లేదా వెంకట్రావు కూడా....
ఒకవేళ అయితే....ఎవరిని?
ఆనంద్ నవ్వి -- "మీ శ్రీమతి గారూళ్ళో లేరనుకుంటాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు?"---- అన్నాడు.
వెంకట్రావు ముఖం వివర్ణమైంది -- "ఆమె ఇక రాదు" అన్నాడు.
ఆనంద్ బాగా దెబ్బతిని -- "ఎందువల్ల?" అన్నాడు.
"నాకు ట్రాన్స్ ఫరై పోయింది. ఎల్లుండే నా ప్రయాణం...."
ఆనంద్ అతన్ని మాటల్లోకి దించాడు. రాజేశ్వరి ని పిలిచి కాఫీ చేసి పట్రమన్నాడు. కబుర్ల లో వెంకట్రావు కే ఊరు ట్రాన్స ఫరయింది కనుక్కునెందుకు ప్రయత్నించాడు. వెంకట్రావు మాట్లాడే పద్దతిని బట్టి అతను నిజం చెప్పడం లేదని తోచింది ఆనంద్ కు.
కాఫీ తీసుకుని థాంక్స్ చెప్పి వెంకట్రావు వెళ్ళి పోయాక ఆనంద్ తీవ్రాలోచనలో పడ్డాడు. ఎలాగో అలా ఒక్కసారైనా కుసుమను అనుభవించి తీరాలి. అందులోనూ ఆమెకు తన పట్ల ఆకర్షణ, ఆరాధన కూడా వున్నట్లన్నాయి. కానీ ఒకటి రెండ్రోజుల్లో తనకు కుసుమ పత్తా లేకుండా పోయేటట్లుంది. అందుకని ఎలాగో అలా వెంకట్రావు అసలు అడ్రస్ తెలుసుకోవాలి. అతను పనిచేస్తున్న బ్యాంకుకు వెళ్ళి తెలుసుకుందామా అంటే అతను నిజంగా బ్యాంకులో పని చేస్తున్నాడో లేదో తెలియదు.
మర్నాడు ఆనంద్ వెంకట్రావు ననుసరించి వెళ్ళాడు. వెంకట్రావు తిన్నగా ఒక బ్యాంకు లోకి వెళ్ళాడు. అది సెట్టిస్ బ్యాంక్.
కొద్దిసేపాగి ఆనంద్ కూడా ఆ బ్యాంకులోకి వెళ్ళాడు. ఓ కౌంటర్ లో కూర్చొని పని చేసుకుంటున్న వెంకట్రావు ని చూశాడు. అక్కడ తిరుగుతున్న ఫ్యూన్ ని పలకరించి దూరం నించి చూపించి-- "ఆయనేవరు?" అడిగాడు.
"అయన పేరు వెంకట్రావండి . ట్రాన్స్ ఫరు మీద కాకినాడ వెళ్ళి పోతున్నారండి ....' అంటూ ఫ్యూను వరుసగా ఆనంద్ కు కావాల్సిన సమాచారం అందించాడు. వివరాలన్నీ విని ఆనంద్ తన పని సులభమైనందుకు ఆనందించాడు. కుసుమ ఇక తన స్వంత మైనట్లే భావించాడు.
వెంకట్రావు వెళ్ళిపోయిన పది రోజులకు అతను రాజేశ్వరి తో తనకు అర్జంటుగా కాకినాడ వెళ్ళాల్సిన పని ఉందన్నాడు.
క్షణం అలోచించి -- "కుసుమ కోసమా?' అంది రాజేశ్వరి.
"నీకెప్పుడూ వేళాకొళమే --" అని పైకి నవ్వేసిన ఆనంద్ -- "నువ్వు దేవాంతకురాలివి. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి -- " అని లోపల అనుకున్నాడు.
