Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 27

 

    అన్నయ్యకు ఫోన్ చేసావా?" భూపతిరావు ఆఫీసుకి రాగానే దినేష్ ని అడిగిన తొలిప్రశ్న అదే.
    అప్పటికే ఫోన్ చేసి వివరాలన్నీ కనుక్కున్న దినేష్ కాస్తంత అనీజీగా వున్నాడు.
    వెంటనే  ఏం సమాధానం చెప్పలేకపోయాడు.   
    "ఫోన్ చేసావా?" మరలా అడిగాడు భూపతిరావు.
    "ఆ.....చేసాను" తగ్గుస్వరాన అన్నాడు దినేష్! తను ఫోన్ లో విన్న విషయాలన్నీ తండ్రికి చెప్పాలా వద్దా అని సంకోచిస్తున్నాడు దినేష్.
    "ఏమన్నాడు?" సీరియస్ గానే అడిగాడు భూపతిరావు.
    "అన్నయ్య యూనివర్శిటీలో లేడట."
    "మరి?"
    "ఏదో  మూమెంట్ క్లీన్ ప్రోగ్రామ్ చేపట్టి సిటీలోకి వెళ్లాడట"
    భూపతిరావుకి కోపం సర్రున వచ్చింది. తమాయించుకొని "వెంటనే రమ్మని కబురెట్టు" అన్నాడు.
    దినేష్ తండ్రివైపు సందేహంగా చూస్తూ నోరు తెరవబోయి ఆగిపోయాడు.
    కొడుకు ఏదో చెప్పటానికి సందేహిస్తున్నట్లుగా గ్రహించగలిగాడు భూపతిరావు.
    "పర్వాలేదు చెప్పు. ఏం జరిగింది?" అన్నాడు కాస్త అనునయంగా.
    "ప్రీమియర్ ఇండస్ట్రిస్ ఆవరణలో అన్నయ్యకు దెబ్బలు తగిలాయట. ప్రస్తుతం ఓ ప్రయివేటు నర్సింగ్ హొమ్ లో వున్నాడట. రక్తం బాగా పోయిందట....." దినేష్ మాటలు పూర్తికాలేదు.
    భూపతిరావు చేతిలో వున్న స్టిక్ మధ్యకు విరిగిపోయింది.
    
    
                                                          *    *    *


    నాగ్ కి రక్తం ఎక్కించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
    సాహితి ఆందోళనగా ఆ వార్డ్ ముందు పచార్లుచేస్తూ ఆలోచిస్తోంది.
    తన మీదకు దాడి జరిపిన ఇద్దరు వ్యక్తుల్ని చాలా కాలం క్రిందట ఎక్కడో చూసిన గుర్తు-గ్నాపకాల్ని తవ్వుతోంది.....కాని ప్రయోజనం లేకపోతోంది.
    పచార్లు చేస్తున్నదల్లా ఓచోట ఆగిపోయింది.
    

                                       11

    ఐదు సంవత్సరాల క్రితం ఏదో ఒక సందర్భంలో తనమీద దాడి  జరిపిన ఆ ఇద్దరు వ్యక్తుల్ని చూసినట్లుగా గుర్తు__ఏ సందర్భంలో? ఖచ్చితంగా ఎప్పుడు  అనేదే గుర్తుకు రావటంలేదు.
    చికాగ్గా ఓ సారి విదిలించింది.
    అంతలో హాస్పిటల్ ఆవరణలోకి రెండు కార్లు, ఓ జీప్ ఎంటర్  అయ్యాయి. అందులోంచి నలుగురు వ్యక్తులు డిగి సరాసరి నాగ్ ఉన్న వార్డ్ వైపే రావటం చూసింది సాహితి.
    బాగా దగ్గరయ్యాక ఆ నలుగురిలో ఒకర్ని వెంటనే గుర్తుపట్టింది- అతను నేషనల్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్  సదరన్ రీజియన్ డీలర్.
    అతను దగ్గరకు వస్తూనే "హలో మేడమ్  హౌ ఆర్యూ?" అంటూ పలకరించాడు.
    మర్యాద పూర్వకంగా తనూ విష్ చేసింది డీలర్ సరాసరి హాస్పిటల్  సూపర్నెంట్  గదిలోకి నడిచాడు.
    సాహితి ఓసారి వాచీవేపు చూసుకొని ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా వరండా దిగీ ప్రక్కనే ఉన్న ఓ డాక్టర్ గదిలోకి వెళ్ళి నాగ్ వున్న గదిలోకి ఫోన్ చేసింది.
    "హలో డాక్టర్.....పొజిషన్ ఎలా ఉంది?" మామూలుగా అడగాలని ప్రయత్నించినా ఆమె కంఠంతో కాస్తంత ఆందోళన వ్యక్తమయింది.
    "డోన్ట్ వర్రీ మేడమ్___హీ  ఈజ్ ఆల్ రైట్ "
    అది విని సాహితి ఫోన్ పెట్టేసి కారువైపు నడిచింది.
    కారు దగ్గరే వెయిట్ చేస్తున్నా సెక్రటరీ సాహితిని చూసి వినయంగా పక్కకు తప్పుకుంటూ కారు డోరు తెరిచి పట్టుకున్నాడు.
    సాహితీ కారులో కూర్చోబోతూ "మీరిక్కడే ఉండి అతని పొజిషన్ గురించి నాకెప్పటికప్పుడు తెలియపర్చండి. ట్రీట్ మెంట్ లో ఎలాంటి లోపం రాకూడదు మైండిట్" అంటూ డోరు వేసుకుంది.

    
                                                               *    *    *
    
    జోరున వర్షం__ఉండుండి ఈదురుగాలులు__కన్ను పోసుచుకున్న కానరాని గాఢంధకారం__అప్పుడప్పుడు మెరుపులా వెలుగుల్లో జడలు విరబోసుకున్నట్లుగా ప్రహారిగోడ ముందు నాలుగు నిలువెత్తులో అశోక చెట్లు__ఉధృతంగా ఊగిపోతూ వాటి పై చివరలు నేలను తాకుతున్న భ్రమను కలిగిస్తూ_ప్రళయం  ముంచుకువచ్చిన భావన- కరెంటుపోయి అరగంట దాటింది టెలిఫోన్ పనిచేయటం లేదు.
    ఒంటరిగా....ఒకే ఒక్కతను ఎదురుగా బెడ్ మీద నాలుగున్నర ఎండ్ల  తన చిన్నారి.....మోడువారిన తవ జీవితానికో అర్థం కలిగిస్తూ... ఎందుకు బతకాలని అప్పుడప్పుడు ఏర్పడే  శూన్యానికి సమాధానం చెప్తూ- ఒంటి క్రొవ్వొత్తి చీకటిని చీల్చతానికి విశ్వప్రయత్నం చేస్తూంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS