Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 21

 

    నా గుండెల్లో అటంబాంబు బ్రద్దలైంది.
    ఆమె సీమ!
    మేనకా హోటల్లో ఒక గంట సేపు స్వేచ్చా శృంగారం అనుభవించిన యువతి నిజంగా సీమే!
    అయినా అనుమానం తీరక నేనామె ముఖాన్ని గోళ్ళతో గోకాను. చేతులతో పామాను-- ఒకవేళ ఏదైనా మాస్కు వాడేరేమో లేక బాగా కోటింగ్ కొట్టి దగ్గర పోలికలున్న అమ్మాయి నలా అమ్మాయి నలా తయారు చేశారేమోనాన్న అనుమానంతో.
    కానీ అటువంటి దేమీ జరుగలేదు. ఈమె అక్షరాల సీమే!
    ఎన్నార్ధంగా కాపురం చేస్తున్నాను.  నా సీమను గుర్తుపట్టడం లో నేను తప్పు చెయ్యలేదు.
    నేను సీమ నేలా తప్పు పట్టగలను? తప్పు నాదే . మేనకా హోటల్ ని పరీక్షించే ఉద్దేశ్యంతో సీమను బలి పశువును చేశాను. మేనకా హోటల్ వాళ్ళ తెలివితేటల ముందు ఏ పతివ్రతలూ అగరని తెలిసిపోయింది.
    ఏమిటి వాళ్ళు చేస్తున్నది? అయినింటి ఆడపిల్లలను నీలాంటి పనులకెలా ఒప్పించ గలుగుతున్నారు?
    ఇప్పుడు నాకెంతో భయం పట్టుకుంది. అదృష్టవశాత్తు ఆరోజు ఆ స్థానంలో నేనున్నాను. అదే స్థానంలో మరో పురుషుడుంటే....
    ఆఫ్ కోర్స్ -- సీమ దృష్టిలో ఇప్పుడు అక్కడ మరో పురుషుడే ఉన్నాడు. అయినా ఆమె విచ్చలవిడిగా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అమెఅలా ప్రవర్తించే స్థితికి ఏ విధంగా తీసుకు రాబడింది?
    సీమ పతివ్రతగా మసలలేదని తెలిసిన అ క్షణం నించీ నా మనసు ఆమె నసహ్యించుకోవడం ప్రారంభించింది. ఆమె అసహ్యం ద్వేషంగా కూడా మారుతోంది.
    ఓకే భయంకర రహస్యాన్ని తన మనస్సులో దాచుకోగలిగిన సీమ అటువంటి రహశ్యాల నింకా ఎన్నింటి నైనా ఇముడ్చుకోగలదు. ఆమె ఒక పాపపు రూపం అని నాకు తోచసాగింది.
    క్రమంగా నాలో బలపడిన కోరిక ఒక్కటే. సీమను హత్య చేయాలి.
    అయితే అది అనువైన సమయం కాదని బలవంతాన నిగ్రహించుకున్నాను. దానికి పటిష్టమైన పధకం వేయాలను కున్నాను.

                                                            9
    "శ్రీమతి కె. వసంత -- " పేరు చెప్పాను.
    "అడ్రస్ !"
    "కేరాఫ్ కె. కృష్ణ మూర్తి , లక్ష్మీ నివాస్, రంగారావు పేట ."
    "గుడ్ -- ఎల్లుండి సాయంత్రం వచ్చి ఫోటో గ్రాఫిక్ కన్ ఫర్ మేషన్ చేస్కుందురు గాని--"
    అలాగేనని బయటపడ్డాను. నేను చేయబోయేది మిత్ర ద్రోహం కావచ్చు. కానీ హోటల్ మేనక లాంటి సంస్థలను పోషించే శర్మ వంటి మిత్రులకీ పరాభవం అవసరమే!
    అనుకున్న ప్రకారం వెళ్ళి ఫోటో చూసుకు వచ్చాను.
    అది ముమ్మూర్తులా శ్రీమతి శర్మ ఫొటోయే. ఆ ఫోటోలో ఆమెను చూశాడంటే శర్మ మరే ఆడదాని వంకా కన్నెత్తైనా చూడడనిపించింది. ఈ మేనక హోటల్ వాళ్ళు ఫోటో స్టూడియో పెట్టుకు బ్రతకొచ్చు -- ఎందుకీ దిక్కుమాలిన వ్యాపారం మొదలు పెట్టారో గాని ----
    ఎందుకేమిటి? డబ్బు కోసం -- సీమ గురించి నేను కొద్ది సేపటి అనుభవానికి ఎనిమిది వందల అరవై ఖర్చు పెట్టాను. అందులో సీమ కేమైనా ముట్టిందేమో తెలియదు. మనిషికి రెండొందలోచ్చిందనుకున్నా రోజుకు పదిమంది ఆడవాళ్ళను తీసుకుంటే రెండువేల రూపాయలు!
    శర్మ - నువ్వు తీసిన గోతిలో నువ్వే పడుతున్నావ్ -- అనుకున్నాను కసిగా.
    నాకు వసంతా శర్మ మీద ప్రత్యేకమైన కోరిక ఏమీ లేదు. ఒకప్పుడైతే గౌరవ భావమే ఉండేది. ఈమెనకా హోటల్ అనుభవం అనంతరం -- అందులోనూ సీమ అక్కడికి రప్పించేక-- కేవలం పగ తీర్చుకోవాలన్న కసితో ఆమె మీద కోరిక పెంచుకున్నాను.

                                  10
    నా పగ తీరే రోజు వచ్చింది. ఆఫీసు నుంచి తిన్నగా మేనక హోటల్ కు వెళ్ళాను. శర్మ లాంటి ఉద్యోగస్తుల భార్యలకు వీలున్నది ఆఫీసు టైము లలోనే గదా! ఒక్కో కార్యక్రమమే ముగించుకుంటూ స్పెషల్ రూముకు వెళ్ళాను. అక్కడ యంత్రంలో వసంతా శర్మ , నడి వయస్కురాలు-- ఆ ప్రక్క నున్నది ఎవరు? నా కళ్ళు నన్ను మోసం చేయలేవు....
    సోఫాలో వసంతా శర్మ కి ప్రక్కన సీమ కూర్చుని ఉంది. ఇదెలా జరిగింది?
    "ఇద్దరు యువతులు కనబడుతున్నారు?" అనడిగాను.
    "బహుశా ఇద్దరికీ ఒకేసారి అపాయింట్ మెంటిచ్చి ఉంటారు. మీక్కావలసిన వారే మీ గదికి వస్తారు. మీ క్కవలసినామే ఉంది గదా!" అనడిగేడతను.
    "ఉంది!" అన్నాను.
    "అయితే అ రెండో ఆమె గురించి పట్టించుకోకండి-- మరొకరి కోసం గదికి వెడుతుంది లెండామే!" అన్నాడతడు.
    ఈ పర్యాయం నా శారీరం లో విపరీతమైన అవేశాముంది. ఎవడో సీమను కోరాడు. వాడి కోసం సీమ వచ్చింది. "సీమా -- ఇక నీ చావు తప్పదు" అనుకున్నాను ఉద్రేకంగా మనస్సులోనే.
    సీమ, వసంత లేచి నిలబడ్డారు-- యంత్రం లో అంధకారం అలముకుంది.
    అతను నాకన్నీ వివరంగా చెప్పాడు.
    అండర్ గ్రౌండ్ నెంబరు పదకొండు కి ఎదురుగా నున్న అద్దాల గదిలో నిలబడ్డాను.
    శ్రీమతి వసంత శర్మ వచ్చింది. గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.
    రెండు నిముషాలాగాను. ఒకతను వచ్చాడు. నన్ను చెక్ చేయడానికి. ఒళ్ళంతా తడిమాడు. ఏదో అనుమానం వచ్చింది. నా పాంట్ అండర్ జేబు లోని క్లోరో ఫాం సీసా పెన్ టార్చి తీశాడు. అతని ముఖం అంత ప్రసన్నంగా లేదు.
    "మా రెగ్యులర్ కస్టమర్స్ దగ్గర్నించి ఇటువంటిది ఎక్స్ పెక్ట్ చేయలేము. దయ యుంచి మీరు పక్క గదిలోకి రండి. మిమ్మల్ని పూర్తిగా పరీక్షించాలి"అన్నాడతను.
    అతన్ననుసరించి పక్క గదిలోకి వెళ్ళాను. ధరో చెకింగయింది.
    "ఏమీ  అనుకోవద్దు -- మేము చేస్తున్న వ్యాపారం అటువంటిది " అన్నాడతను.
    'అటువంటప్పుడు నాదో చిన్న సందేహం -- ఇప్పుడు నేను ప్రవేశించబోయే గదిలోంచి నేను కోరినామే బయటకు వెళ్ళి పోయుండవచ్చు--" అన్నాను.
    "మా వ్యాపారంలో అటువంటి మోసలుండవు. అవసరమనుకుంటే నేనామెను బయటకు పిలుస్తాను. మీరద్దాల గదిలోంచి చూద్దురు గాని -- ' అన్నాడు.
    నేను మళ్ళీ అద్దాల గదిలోకి వెళ్ళాను. అతను తలుపు తట్టి "మేడమ్ !" అన్నాడు. వసంత ఒకసారి బయటకు వచ్చి ప్రశ్నార్ధకంగా చూసింది.
    'ఆయనింకా గదిలోకి రాలేదా?" అనడిగాడతను. ఆమె నోరు విప్పకుండా తల అడ్డంగా ఆడించింది.
    "మీరు లోపలకు వెళ్ళవచ్చు. అయన ఇప్పుడే వస్తారు" అన్నాడతను. ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
    ఆ తర్వాత అతను నా దగ్గరకు వచ్చాడు. "ఇంకేమైనా సందేహాలున్నాయా?" అనడిగాడు.
    "లేవు!" అన్నాను.
    "విష్యూ అల్ ది బెస్ట్ !" అని వెళ్ళిపోయాడు.
    లోపల ఉన్నది ఒకనాడు నన్ను చాలెంజ్ చేసి గెలిచిన నిత్రుడి భార్య అన్న విషయం నా ఆవేశాన్ని, కోరికనూ పెంచింది. సీమ ఇప్పుడు నిజంగా పతితురాలై పోయిందన్న బాధ వాటికి కలవగా ఒక విచిత్ర మానసిక స్థితిలో ఆ గదిలో నేనడుగు పెట్టాను.

                                  11
    మనశ్శాంతి లేదు. ఎక్కడెక్కడో పిచ్చి వాడిలా తిరిగి ఏడు గంటలకు ఇంటికి వెళ్ళాను. తాళం వేసి ఉంది. ఉద్రేకంలో నా పళ్ళు కటకట మన్నాయి.
    "ఎన్ని గంటలో ఈవిడ గారి ఎంగేజ్ మెంట్-- అనుకున్నాడు అసహ్యంతో.
    డూప్లికేట్ కీతో తాళం తీశాను. తలుపు లైనా వేయకుండా నిస్పృహగా కుర్చీలో కూర్చున్నాను. ఇంట్లో చీకటి -- నా మనసులో చీకటి -- అసలు నా బ్రతుకే చీకటి.
    అలా ఎంతసేపు కూర్చున్నానో తెలియదు. హటాత్తుగా ఇంట్లో దీపం వెలిగింది. ఉలిక్కిపడి తల ఎత్తాను. ఎదురుగా కనపడ్డ వ్యక్తీ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాడు.
    "నువ్వా శర్మా!" అన్నాను ఆశ్చర్యంగా.
    "అవును -- నేనే -- ఏమైపోయావ్ -- ఎక్కడి కెళ్ళావ్ ?' అన్నాడు శర్మ.
    శర్మ ముఖంలో చిరాకు చూస్తుంటే నాకు అనుమానం కలిగింది -- ఇతగాడికి నా గురించి తెలిసిపోయిందని .
నాకు చిరాగ్గా ఉంది. నేను రాను !" అన్నాను.
    "ఏం మగాడివి నాయనా! ఇంటి కొచ్చావు. ఇంటికి తాళం వేసి ఉంది. రాత్రి ఎనిమిది గంటలు దాటింది -- ఇల్లాలేమై పోయిందో నని పట్టించుకున్నావా?' అనడిగాడు శర్మ.
    "నాకు లేని శ్రద్ధ నీ కెందు కోయ్ -- నా ఇంటి ఇల్లాలి మీద" అన్నాను విసురుగా.
    శర్మ ముఖం ఎర్రబడింది. "మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వు. నీ భార్య అవతల చావు బ్రతుకుల్లో వుంది. మధ్యాహ్నం నుంచి ప్రయత్నిస్తున్నాను. ఆఫీసులో లేవు. ఇంటి దగ్గర లేవు . ఏం చేయాలో తెలియదు. మరో ప్రయత్నంగా ఇప్పుదోచ్చాను--"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS