2
శంకరనారాయణగారి ఇంట్లో నూకాలమ్మ అని ఒక దాసీ ఉంది. సూర్యోదయానికి కొంత ముందుగానే వచ్చి, పాచిపని ప్రారంభించడం నూకాలుకు అలవాటు. ఆనాడు కూడా అలావాటు చూప్పున, తూర్పు దిక్కు ఒక విధమైన బూడిద రంగు వదిలి, బంగారు రంగు పులుముకునే సమయానికే వచ్చింది నూకాలు ఆ ఇంటి ముంగిట అడుగు పెట్టిందో లేదో "ఉంగా..ఉంగా" అన్న పసిపాప ఏడుపు ఆవిడకి వినిపించింది. ఆ దిక్కు కేసి చూసింది కదా, ఇంకేముంది? రాబోతూన్న అరుణ కాంతుల్లో ఒక కాంతి దారి తప్పి, వచ్చి, శంకర నారాయణ గారి ఇంటి ముంగిట ఈ రూపంలో అవతరించి నట్టున్న ఓ నెలన్నర, రెండు నెలల పసికందు కెవ్వుమని ఏడుస్తూ, తన గొడవను వారెవ్వరూ పట్టించు కొడం ;లేదన్నట్టు, కాళ్ళూ, చేతులూ విసిరి విసిరి కొడుతూ , గొడవ చేస్తుంది.
"అమ్మగారండోయ్!' అంది నూకాలు, ఆ బిడ్డ నేత్తుకుంటూ . ఎవ్వరూ బదులు పలకలేదు.
"అమ్మగారండొయ్, అయ్యగారండొయ్ , దొరికిందడోయి , అమ్మగారూ! ఆడపిల్లే నండి! అయ్యగారూ! అమ్మగారూ! " పాపం, ఆ ఆవేశాన్ని అణుచుకో లేక, నూకాలు పిచ్చిపిచ్చిగా కేకలు వెయ్యటం మొదలు పెట్టింది. శంకర నారాయణ గారే తలుపు తీశారు.
"ఏమిటే?"
'అడబిడ్డండీ!"
"ఆ?"
"అమ్మగారి పార్ధన్ని మన్నించి, ఆ ఆదినారాయణుడే ఈ బంగారు బొమ్మని మనింటి గడప మీన ఉంచేళ్ళాడండీ!......... అమ్మగారండీ!"
"ఇదుగో, ఇదుగో.... ఒసేవ్ , నూకాలూ! నీకే మైనా పిచ్చి పట్టిందేమె? ఎవరి బిడ్డో, ఏమో? పోలీసులకు తెలిసిందంటే నానా రభసా జరుగుతుంది! తెలిసిందంటే ఏమిటి? తెలియ జేయ్యాలి! ఉండు." అసలు నూకాలు అయన గారి మాటలు వినడానికి అగితేగా? అది సరాసరి కనకదుర్గ దగ్గిరికి పరుగు తీసింది. శంకర నారాయణ గారు పరుగుపరుగున వెళ్లి, పోలీసులకు ఫోన్ చేశారు.
పాపం, పోలీసులు వచ్చే లోగానే కనకదుర్గ కు ఆ పసి పాప మీద పరిమితి లేని మమకారం ఏర్పడింది. అప్పటికే పాపకు స్నానం చేయించి పాలు పట్టి ఇంట్లో ఉన్న పెద్ద దొరసాని బొమ్మ గౌను దిగేసి, తనలో ఉన్న మురిపాలన్నీ ఒలక బోసుకుంది ; ముద్దుల వర్షం కురిపించింది.
"ణా తల్లే!' నా బంగారు బొమ్మే! నా సీతామహాలక్ష్మీ త్రిపుర సుందరీ జ్ఞానాంబికే!" అంటూ ఆనందాతిరేకంతో తనను తాను మరిచి విహరించింది. ఆ పుణ్య వతిలో పొంగి పోరాలుతున్న ప్రేమాతిశయం తో పోలీసులకు సంబంధ మేమిటీ?
"మీకెక్కడ దొరికింది ఈ పాప?"
"నాకు దొరక లేదండీ. మా నూకాలికి దొరికింది . అదే నా కిచ్చింది.
"నూకాలేవరు?"
"ఇంకెవరూ? నేనేనండీ?" అంది నూకాలు, తనను కూడా పోల్చు కోలేనంతటి అసమర్ధులు పోలీసుల్లో ఉన్నారా అని ఆశ్చర్యపడుతూ.
"నీ కేవరిచ్చారూ ఈ పాపను?"
"ఎవరో ఇవ్వడ మెంటండీ, ఇన స్పెట్టారు గారూ? దేముడే అమ్మగారి పార్తన్ని మన్నించి, ఆ పిల్ల అమ్మాయి గార్ని ఈ ఇంటి గడప మీద ఉంచి పోయాడు. సూడగానే నాకంతా అర్తమై పోయిందండీ.అందుకనే అమాంతంగా 'అయ్యగారాండీ.' 'అమ్మగారండీ' అంటూ కేకలేశా.' అపళాన మా అయ్యగారేనండీ తలుపు తీశారు! తియ్యగానే........"
"చాలు చాలు."
"ఇంకా శానా ఉందండీ మనవి సేసుకోడానికి!"
"అయితే ఈ పాపను నీకెవ్వరూ ఇవ్వలేదు. 'శంకర నారాయణ గారి ఇంటి ముంగిట ఎవరో పడేసి పోయారు అంటావు! అంతేనా?"
"అంతేనండి , నాదేం నాలికా, బట్ట పేలికా నిమిషానికో మాట మార్చడానికి?"
"సరిలే, సరిలే. ముందు నువ్వు ఆవలి కెళ్ళు."
"నూకాలు వెళ్ళొచ్చా అండీ ఇన్ స్పెక్టర్ గారూ?"
"ఆ! ఆ జడివాన వెలిస్తే గానీ మనం మరేమీ చెయ్య లేమను కుంటా!"
నూకాలు రుసరుస లాడుతూ వెళ్ళిపోయింది. పోతూ పోతూ "ఒరబ్బో! అనుకుంది తనలో తాను , తాననుకుంది అందరికీ వినపడాలన్న ఉద్దేశం తోటే!
"ఏం చేద్దామంటారు , సర్?" అన్నారు శంకర నారాయణ గారు.
"చెయ్యడాని కేముందండీ? అన్ని విషయాల్నీ వివరించి , మీరు మాకొక ఉత్తరం వ్రాసి ఇవ్వండి. తలిదండ్రు లెవరో, అసలు విషయ మేమిటో తేల్చడానికి ప్రయత్నిస్తాం."
'అంటే ఆ తరువాత మళ్ళీ పాపను ఆ పారవేసుకున్న వారికి అప్పగించవలసి ఉంటుందా అండీ? ఉహు, నా బంగారు తల్లిని నేనేవ్వరికీ ఇవ్వను. అంత ఇష్టం లేక పారవేసుకున్న వారిని గురించి ఇంత గొడవ ఎందుకూ? ఇన్ స్పెక్టరు గారూ, పాపను ఇక్కడే ఉండనివ్వండి. ఏ లోటూ రాకుండా నే చూసుకుంటాను. నా కళ్ళల్లో పెట్టుకుని కాపాడు కుంటాను. ఏమండీ, మీరైనా చెప్పండీ!" అంటూ ఆరాట పడింది కనకదుర్గ.
శంకర నారాయణ గారు ఏమనగలరు? ఇన్ స్పెక్టర్ మాత్రం ఏం చెయ్యగలడు? ఇద్దరూ కాస్సేపు మిన్న కున్నారు. తటపటాయించారు. చివరకు పోలీసు ఉద్యోగే ఒక నిర్ణయానికి వచ్చి, "సరే, అలాగే నండీ . అమ్మాయిని మీ వద్దనే ఉంచుకోండి. ఒకవేళ ఆ పాప తలిదండ్రులు దొరికినా, మీరన్నట్టు ఇష్టం లేక పారవేసుకున్నారు కాబట్టి, మీలాటి వారు ఆ బిడ్డను పెంచి, పెద్ద చేసి బాగోగులు చూసుకుంటా నంటే, వాళ్ళు మాత్రం ఎందుకు వద్దంటారు? సెలవు సర్"అన్నాడు.
"థాంక్యూ . నమస్కారం."
"నమస్కార మండీ, ఇన్ స్పెక్టర్ గారూ! కావాలంటే ఆ తల్లి దండ్రులకు రెండు మూడు వేలు ఇవ్వడానికి కూడా మేం వెనకాడం."
"అలాగే నమ్మా. సెలవు."
ఇన్ స్పెక్టరు గారు వెళ్ళిపోయారు. శంకరనారాయణ కనకదుర్గ లు ఒకరి నొకరు చూసుకున్నారు. "ఏమనాలా?' అని శంకర నారాయణ గారి ఆలోచన. అయన ఏమీ అనకుండా ఉంటేనే ఉత్తమమని కనకదుర్గ నిశ్చితాభిప్రాయం! కాస్సేపు అలాగే గడిచిపోయింది.
"మా మొహాన ఇన్ని కాఫీ నీళ్ళు పోస్తారా?' అన్నారు శంకరనారాయణ గారు చిట్టచివరి కి అధికార పూర్వకంగా .
"ఆ, నాకంత తీరుబడి ఎక్కడిదండీ? ఒసేవ్ నూకాలూ , వంట మనిషితో చెప్పి అయ్యగారికి ఒక కప్పు కాఫీ పంపించ వే!' అని ఆయనగారి సంగతి తేల్చేసి, "నాతల్లే! నా బంగారు కొండే! నా సీతా మహాలక్ష్మీ త్రిపుర సుందరి జ్ఞానాంబి కే!' అంటూ ఆ పెన్నిదానాన్ని హృదయానికి హత్తుకుని, అదో పారవశ్యం లో పడిపోయి, అలానే వెళ్ళిపోయింది కనకదుర్గ.
ఆ పరిస్థితుల్లో ఏ మగవాడ యినా చెయ్యగలిగింది ఏముంటుంది? శంకర నారాయణ గారూ అదే చేశారు. ఉస్సురంటూ సోఫా మీద కూలబడ్డారు , పాపం అయన.
