"అడుగు... నీయంత ఫ్రాంక్ గానే చెప్తాను" అందామె.
ఒక్క క్షణం తటపటాయించింది మధూలి.
అటూ, ఇటూ చూసింది.
"మేడమ్! మద్యాన్ని నిషేధించడానికే మీరు నిర్ణయించుకున్నారు కదూ.... ఇవాళ మీరు జీవో ఇష్యూ చేస్తున్నారు కదూ...సారా కాంట్రాక్టర్లు స్టే తెచ్చుకోవడానికి వీల్లేకుండా మీరు రేపు హైకోర్టుకి హాలిడే ఇప్పిస్తున్నారు కదూ....ప్రొహిబిషన్ సెల్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు కదూ..."
మధూలి ఒక్కొక్క ప్రశ్నా అడుగుతుంటే వెలవెలబోతోంది సి.ఎమ్. త్రిభువనేశ్వరీ.
కేవలం ముగ్గురి వ్యక్తుల మధ్యే ఉన్న రహస్యం అప్పుడే ఎలా లీక్ అయింది?
ఆశ్చర్యంగా వుంది సి.ఎమ్.కు.
షి ఈజ్ నాటే ఆర్డినల్ గర్ల్...
షి ఈజ్ నాటే ఎడోలసెంట్ గర్ల్....
మధూలి తనతో ఇంతసేపూ జులాయిలా మాట్లడటం ఒక నటనా లేక విలక్షణ వ్యక్తిత్వమా?
ప్రొఫెష నిజాన్ని మరచిపోలేని మధూలి వ్యక్తిత్వం...
"ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి మధూలీ...." గాభరాగా అడిగింది సి.ఎమ్.
"అంటే.... నేను విన్నవన్నీ నిజమేనాన్న మాట....చూసారా....ప్రెస్ మీట్ కు నేను రాకపోయినా ఫ్లాష్ న్యూస్ ను మీచేత ఎలా చెప్పించానో....దట్సాల్ ఇప్పుడు తెల్సిందా....మధూలి అంటే ఏమిటో..." హేండ్ బేగ్ ని సర్దుకొని నిలబడింది మధూలి.
"నీకీ న్యూస్ ఎలా తెలిసింది మధూ..." భుజమ్మీద చేయివేసి అడిగింది త్రిభువనేశ్వరీ.
"నో మేడమ్! సోర్స్ చెప్పకూడదనేది జర్నలిజంలో ఒక లెసన్ మేడమ్....సారీ మేడమ్" హుషారుగా కళ్ళు చికిలిస్తూ అంది మధూలి.
"నేనెవర్నీ ఏమీ అనను. సోర్స్ ఎలా వచ్చిందో చెప్పు పర్వాలేదు" బ్రతిమాలుతున్నట్టుగా అంది త్రిభువనేశ్వరి.
"ఓకే మేడమ్....చెపుతాను కానీ ఇప్పుడు కాదన్న మాట. మీరు నాతో రహస్యంగా షికారుకు వస్తానన్నారుగదా....అప్పుడన్న మాట."
హతాశురాలయింది త్రిభువనేశ్వరి.
"నువ్వు పిల్లవు కాదు పిడుగువు....నీతో ఇకనుంచీ జాగ్రత్తగా వుండాలన్న మాట."
ఆ రూమ్ లోంచి బయటికొస్తూ అంది సి.ఎమ్.
"నా నిక్ నేమ్ ఏంటో తెల్సా మేడమ్! పిడుగు కాదు అగ్గిబరాటా" నవ్వుతూ చెప్పి-
"మేడమ్! నేనెప్పుడైనా మీ ఇంటికి రావచ్చుగదా..." అని అడిగింది.
"రావచ్చు."
"నైట్ షార్ట్ ట్వెలో క్లాక్ కి ఎప్పుడయినా వచ్చాననుకోండి నన్ను ఎలౌ చేస్తారా?"
"సెక్యూరిటీ ప్రొటోకాల్స్ నువ్వు మరచిపోతున్నావ్" హెచ్చరిస్తున్నట్లుగా అంది త్రిభువనేశ్వరి.
"మనిషికి సెక్యూరిటీ- అధికారానికి ప్రోటోకాల్స్- హృదయానికి ఈ రెండూ ఉంటాయంటారా మేడమ్..." అమాయకంగా తనవైపు చూస్తూ-
చాలా అమాయకంగా ఆ ప్రశ్న వేసిన మధూలివేపు-
ఒక్క లిప్తపాటు చూస్తూ వుండిపోయింది సి.ఎమ్. త్రిభువనేశ్వరీ దేవి.
"నీలో ఫిలాసఫర్ కూడా వున్నాడన్న మాట" నవ్వుతూ అనేసింది సి.ఎమ్.
"థాంక్యూ మేడమ్! మళ్ళీ కలుస్తాను."
వరండా మీదకొచ్చింది మధూలి సి.ఎమ్. త్రిభువనేశ్వరి గుమ్మం దగ్గరే విహ్సిత్రంగా మదూలివైపు చూస్తూ నిలబడిపోయింది.
గాలిపటంలా తుళ్ళుతూ ముందుకెళ్ళిపోతున్న మధూలి కనుమరుగయ్యేంతవరకూ-
అలాగే అక్కడే నిలబడిపోయింది త్రిభువనేశ్వరీదేవి.
* * * * *
నెమ్మదిగా లోనికి నడిచింది త్రిభువనేశ్వరీదేవి. మధూలితో మాట్లాడిన ఇరవై నిమిషాల కాలం గమ్మత్తుగా ఉందామెకు.
అనుకోకుండా మధూలి వేసిన కొన్ని ప్రశ్నలు త్రిభువనేశ్వరి మెదడులో గింగుర్లు కొడుతున్నాయి.
ఏ జ్ఞాపకాలకు తను దూరంగా వెళ్ళిపోవాలని, మరిచిపోవాలని భావిస్తుందో...
ఆ జ్ఞాపకాల్ని అనుకోకుండా తట్టి లేపింది మధూలి.
కొన్ని నిముషాలసేపు త్రిభువనేశ్వరిదేవి మనిషి కాలేకపోయింది.
ఫ్యూన్ టేబిల్ మీద బిస్కెట్స్, టీ ఎరేంజ్ చేసి వెళ్ళిపోయాడు. పక్కన వాటర్ బాటిల్స్...
అదే సమయంలో ఫోనొచ్చింది.
ఫోన్ చేసింది వరదరాజన్...
"ప్రిపేర్ చేసారా...వెరీగుడ్. అలాగే హైకోర్టు జడ్జీగారికి లెటర్ తయారయిందా. ఓకే... ఓ టెన్ మినిట్స్ లో వస్తాను" రిసీవర్ని యధాస్థానంలో ఉంచి టీపాయ్ మీదున్న ప్లేటులోంచి బిస్కెట్ ని చేతిలోకి తీసుకుని-
రెస్ట్ రూమ్ కి ఎడంపక్కనున్న రెండో ద్వారంవేపు చూసి అలాగే క్షణకాలం నోట మాట రాకుండా చూస్తూ ఉండిపోయింది సి.ఎమ్. త్రిభువనేశ్వరీదేవి.
ఆ వ్యక్తి పొడవుగా, దృఢంగా ఉన్నాడు. కళ్ళద్దాలు, సిల్క్ కుర్తా, పైజామా, చేతిలో త్రిబుల్ ఫైవ్ పేకెట్.
అటూ ఇటూ చూసింది త్రిభువనేశ్వరీదేవి. ఎక్కడా సెక్యూరిటీ స్టాఫ్ కనబడలేదు. లేవడానికి ప్రయత్నించింది.
అప్పటికే ఆ వ్యక్తి గదిలో కొచ్చేసాడు.
"నమస్తే మేడమ్....ఏంటలా కంగారు పడుతున్నారు? నేనేం మిమ్మల్ని మర్డర్ చెయ్యడానికి రాలేదులెండి...డోన్ట్ వర్రీ...." చాలా కూల్ గా ఉందా గొంతుకానే ఆ గొంతులోని భీకరత్వాన్ని పసికట్టింది త్రిభువనేశ్వరీదేవి.
"ఎవర్నువ్వు..." ఎందుకో ఆమె మైండ్ ప్రమాదాన్ని శంకిస్తోంది. ఆమె హేండ్ బేగ్ వేపు చూసింది. అందులో ఫిస్టలుంది. ఆ బేగ్ ఆఫీసు టేబిల్ మీద ఉందన్న విషయం గుర్తుకొచ్చింది త్రిభువనేశ్వరీదేవి.
"నేనా.... కూర్చొని చెప్పమంటారా, నిలబడి చెప్పమంటారా..." అలా అంటూనే ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాడా వ్యక్తి.
"హు ఆర్యూ..." గబుక్కున లేవబోయింది సి.ఎమ్.
ఆ వ్యక్తి సీరియస్ గా సి.ఎం.వేపు చూసి కుడి చెయ్యెత్తి-
"కూర్చోండి మేడమ్...ఎందుకంత కంగారు....మీరిప్పుడు కేకలేసి పిలిచినా మీ సెక్యూరిటీ స్టాఫ్ ఎవరూ ఇక్కడికి రారు...ఎందుకో తెలుసా....నేనిక్కడకు రావడం చూసారు గనక..."
పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ నీ, కమెండోల్నీ దాటుకొని, సెక్రటేరియట్లోని తన రెస్ట్ రూంకి నిర్భయంగా వచ్చాడంటే-
ఎవరీ వ్యక్తి? రకరకాలుగా ఆలోచిస్తోంది త్రిభువనేశ్వరీదేవి మైండ్.
"ఎవర్నువ్వు...ఎందుకొచ్చావ్?"
"అదీ.... అలా అడగండి....చెప్తాను....ఎవర్నువ్వు అన్నదానికి జవాబు వెళ్ళేలోపుగా మీకే తెలుస్తుంది కాబట్టి ఎందుకొచ్చావ్ అన్న దానికి మాత్రమే జవాబు చెప్తాను. ఎందుకొచ్చానంటే సి.ఎమ్. గారూ.... నా భాష కొంచెం మొరటుగా, మొండిగా వుంటుంది. క్షమించాలి....మీరు.... పది కాలాలపాటు పదవిలో ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పడానికొచ్చాను. నేను.... మీ వెల్ విషర్ నన్నమాట..." అని ప్లేట్లోని బిస్కట్ ని అందుకుని ఆ బిస్కట్ మీదున్న పేరుని త్రిభువనేశ్వరీదేవికి చూపెడుతూ-
