Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 19


    
    పెదవులపై పెదవులు ఆన్చి - "గృహప్రవేశం ముందు ద్వారానికి కట్టిన మామిడాకు తోరణంలాంటిది ముద్దు" అని కిందకు దిగి, ఎదపై ముఖాన్ని అదిమి, "కొబ్బరికాయలు కొట్టడంలాంటిది ఇది" అని మరింత కిందకు దిగి బొడ్డుపై నాలుకను తిప్పి-
    
    'వెలిగించిన కర్పూరం' అని ఇంకాస్త కిందకు దిగి ఏదో అనబోతుంటే చివుక్కున కిందకు వంగి పెదవుల్ని నోట్లోకి తీసుకున్నాను.
    
    జల్లు కొట్టటం వల్ల కిందంతా చెమ్మగా వుందన్న విషయం కూర్చున్న మా ఇద్దరికీ స్ఫురణకు రాలేదు.
    
    బాగా తడిసిన పైటకొంగు కిందికి జారింది.
    
    అప్పుడే మెరుపు మెరిసింది.
    
    'వెండికొండలు?' అన్నాడు.
    
    మరో మెరుపు అతని చూపులు నడుంమీద పడి, బొడ్డుమీదకు దొర్లాయి. 'మానస సరోవరంలో విరిసిన బంగారు పుష్పం' అన్నాడు.
    
    మరో మెరుపు అతని కళ్ళు ఎక్కడ కూరుకుపోయాయో తెలుస్తోంది.

    'పగిలిన దానిమ్మపండు' అన్నాడు.
    
    సిగ్గుతోనో, చలితోనో ముడుచుకుపోయను. అతను చేతుల్లో నెగళ్ళు పట్టుకుని ఒక్కో అవయవాన్ని వెలిగిస్తున్నట్లు వెచ్చటి ఆవిర్లు ప్రారంభమయ్యాయి.
    
    గంధర్వుడికి ఆహ్వానము చెబుతూ వెలిగించిన ప్రమిదలై పోయాయి నా కళ్ళు. పూర్ణకుంభాలతో స్వాగతం చెబుతున్నట్లు బరువెక్కాయి నా పాలిండ్లు. ఒంటరి ధ్వజస్తంభంలా వున్న నా నడుం కింద హారతి పళ్ళెంలా అయిపోయింది నా బొడ్డు.
    
    ఇక మిగిలింది కొబ్బరికాయ కొట్టడమే.        
    
    అమాంతంగా అతను నామీదకు వంగాడు. మొత్తం అతని బరువంతా నామీద పడడంతో సుఖం కోసం నా శరీరాన్ని వత్తేస్తున్నట్లుంది.
    
    వర్షపుజల్లు మామీద పూలజల్లులా పడుతోంది.
    
    ఎన్నాళ్ళ కోరికో తెలియదుగానీ అతని చేతుల్లో నా శరీరం ముద్దలా అయిపోతోంది. శ్వాసవేడికి అవయవాలన్నీ కరిగిపోతున్నట్లుంది.
    
    మెరుపు వెలుగు పడినచోట్ల అతని నాలుక చీకటై కప్పేస్తోంది. అందుకే ఒక్క దగ్గర వెలుగుపడకూడదని మొక్కుకున్నాను. అదే జరిగితే సిగ్గుతో నా ఒళ్ళు పేలిపోతుందేమోనన్న అనుమానం కానీ ఎక్కడో ఏమూలో అది జరగాలని కూడా వుంది.
    
    అతని ఆవేశం ఎంత ఉధృతంగా వుందో తెలుస్తోంది. వర్షంవల్లో, అతని నోటి చెమ్మవల్లో గుర్తించలేదు కానీ మొత్తం తడిసిపోయాను.
    
    తమాషా ఏమిటంటే ఒళ్ళు తడిసిపోయినా అతను నా బంధాలన్నీ విప్పుతున్నాడు చలి అంతా తీయని మంటలా తోస్తోంది. విచిత్రం ఏమిటంటే అతను మల్లెపూవంత బరువుగా కూడా అనిపించలేదు. గమ్మత్తు ఏమిటంటే అతను పరాయివాడిలా అనిపించక అత్యంత ఆప్తుడిలా కనిపిస్తున్నాడు.
    
    చిత్రమైన సంగతి ఏమిటంటే అంతకుముందు మౌనంగా వుండే అవయవాలన్నీ ఇప్పుడు మొదటిసారి కొత్త కొత్త రాగాల్ని ఆలపిస్తున్నాయి.
    
    నిజమైన విషయం ఏమిటంటే నేనే ఓకొత్త మనిషినై తొలిసారి మగస్పర్సను పొందుతున్నట్లుంది.
    
    అతను పూర్తిగా ఆక్రమించుకుంటున్నప్పుడు కుడిచేయి అడ్డం పెట్టి ఆపాను.
    
    "చిన్న కోరిక" అన్నాను.
    
    "ఇక మాటలన్నీ బంద్. సినిమా మొదలయ్యే ముందు నిశ్శబ్దం అనే స్లెయిడ్ వేస్తారు చూడు అలా వున్న నీ బొడ్డుపై ముద్దు పెట్టేసుకుంటాను. ఇక అంతా నిశ్శబ్దం" అని నడుం దగ్గరికి ముఖం తీసుకొచ్చాడు.
    
    "సినిమా ప్రారంభానికి ముందు న్యూస్ రీల్ వుంటుందికదా. అలాంటిదన్న మాట ఇది నా కోరిక వినవూ?" అన్నాను గారాబాలు పోతూ.
    
    'ఏమిటో చెప్పు'
    
    'మన సంబంధం ఎప్పటికీ ఇలానే కొనసాగాలి'
    
    'ఊఁ తప్పకుండా నిన్ను వదులుకోను'
    
    'కానీ అదంతా తేలికకాదు, ఇలాంటివి ఎక్కువ రోజులు సాగవు. ఎవరో ఒకరు పసికడతారు. ఇక ఆవిషయం ఊరంతా విషపు తీగలాగ అల్లుకుంటుంది. ఎవరికీ అనుమానం రాకుండా వుండాలంటే నువ్వు ఒక పని చేయాలి. చేస్తావా?'
    
    'నీ మాట కాదనడమే'
    
    అయితే మా మధుమతిని నీ తమ్ముడు హరికిచ్చి పెళ్ళి జరిపించు. అప్పుడు మనిద్దరం బంధువులవుతాం. మీ ఇంటికి నేను రావచ్చు మా ఇంటికి నువ్వు రావచ్చు. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా చూసినా పెద్ద అనుమానం రాదు. మరీ దగ్గర బంధువులం కనుక ఆ మాత్రం దగ్గిరతనం సహజమనుకుంటారు గాని మన గురించి పట్టించుకోరు. జీవితాంతం మనం సంబంధం ఇలానే కొనసాగుతుంది'
    
    'అలానే నువ్వు చెప్పాక కాదంటానా' త్వర త్వరగా అని అతను నామీదకు పూర్తిగా ఒరిగాడు.
    
    ఆ సంఘటన జరిగిన మరో మూడునెలలకి మధుమతి, హరిల పెళ్ళి జరిగిపోయింది.
    
    మరి ఇదంతా మధుమతికి పెళ్ళి చేయడం కోసమే చేశానా? లేక అతనిమీద మనసు పడ్డాక ఈ ఐడియా వచ్చిందా అని అడిగితే సమాధానం నా దగ్గరలేదు. అలా నిజానిజాలు తెలుసుకోవడానికి మనసును చీల్చుకుంటూ పోతే చాలా ఆనందాలకు దూరమైపోతాం."
    
    మహిత చెప్పడం పూర్తిచేసి కుర్చీ వెనక్కి వాలింది.
        
    దూరంగా చంద్రవంక వెన్నెల బరువుకి కాబోలు మరింతగా భూమి మీదకు వంగింది.
                
                                              7
    
    ఆ రోజు పౌర్ణమి. చంద్రుడు గుండ్రటి సబ్బుపెట్టెలా వున్నాడు. సబ్బు నురుగులా వెన్నెల తనచుట్టూ పొందుతున్నట్లే వుంది సూర్యాదేవికి.
    
    బాల్కనీలో దీపాలన్నిటినీ ఆర్పేసింది.
    
    ఓ మూల నున్న నైట్ క్వీన్స్ పక్కన తెల్లటి ఫేము కుర్చీ వేసుకుని కూర్చుంది. ఆకాసంలో ఎవరో దేవకన్య కప్పుకున్న మేలిముసుగు గాలికి కొట్టుకొచ్చి అక్కడ పడ్డట్టు వెన్నెల తేలుతోంది.
    
    ఆమెకి ఠక్కున అడివి బాపిరాజు గుర్తుకొచ్చాడు. పౌర్ణమిరోజున డాబామీద తెల్లటి పట్టువస్త్రాలు కట్టుకుని వెండిపళ్ళెంలో పెరుగన్నం తినలనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు కంఠతా పెట్టిన పద్యం గుండె పొరల్లో కదిలింది..... 'ఓయీ సుధాకరా! నిలువు మొక్క నిమేషము, నీ మహోదచ్చాయలు సోకి నా ఎడద సాగరమట్టుల పొంగుచున్నది.....' ఆ తరువాత పాదము ఏమిటో గుర్తురాలేదామెకు వెన్నెల ఇంత ఎగ్జయిటింగ్ గా వుంటుంది కాబట్టే ప్రబంధకవులు విధిగా చంద్రోదయ వర్ణన చేసేవాళ్ళు, ఈ వెన్నెల్లో ఏదో ఒకటి చేయాలనిపించింది ఆమెకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS