Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 17

 

    తండ్రి తల్లిని తిడుతున్నాడు--"నీ తెలివితక్కువ వల్ల రెండు లక్షల రూపాయలకు పైగా నష్టం. అదీకాక వ్యాపారంలో చెడ్డ పేరు. ఆ పెట్టె ఇలా పోయిందంటే నా భాగస్వాములేవ్వరు నమ్మరు..."
    "ఊరికే నోరు పారేసుకోకండి ...రెండు లక్షలేగా . మా నాన్నగారికి రాసి తెప్పిస్తాను . చాలా!" అంది రామం తల్లి.
    "ఈ గర్వమే నిన్ను పాడు చేస్తోంది. అన్ని ప్రమాదాలూ డబ్బుతో దాటలేము. ముఖ్యంగా వ్యాపారంలో కావలసింది నమ్మకం. ఈ పెట్టి నన్ను చాలా ఇబ్బందుల్లో పెడుతుంది. నీ డబ్బు నన్ను కాపాడలేదు-" రామం తండ్రి ఆవేశంగానే అన్నాడు.
    "బాగుందండీ - అలాంటప్పుడా పెట్టి కుర్రాడి పేరున పంపడ మెందుకూ? అదే మన కొంప ముంచింది. మీ పేరున వచ్చి ఉంటె మేమెవ్వరం దాని జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. తప్పంతా మీ మిత్రుడిది!" అంది రామం తల్లి.
    "బాగుంది, నేను తీరిక సమయాల్లో వీణ నేర్చుకుంటున్నానంటే ఏం బాగుంటుంది-- ఎవరు నమ్ముతారు?" అనాయన ఇంకా ఏదో అనబోతుండగా వాచ్ మెన్ అక్కడ అడుగు పెట్టి -- "బాబూ -- ఓ రిక్షా వచ్చింది. అందులో వీణ పెట్టి వున్నది. రిక్షా వాడది ఇంట్లో పెట్టాలంటున్నాడు --'అన్నాడు.
    రామం తండ్రి మాటలు ఆగిపోయాయి. వెంటనే ఇద్దరూ పనివాళ్ళు బయటకు వెళ్ళారు.
    వాళ్ళంతా ఆలోచిస్తున్నారు . పక్కింట్లో పెట్టినదిప్పుడు మళ్ళీ రిక్షాలోకి ఎలా వచ్చింది?

                                  6

    పనివాళ్ళ ఇద్దరు వీణ పెట్టెను మోసుకుని వచ్చారు. వాళ్ళ ముందు దింపారు. రామం తండ్రి వాళ్ళను పొమ్మన్నాడు.
    రామం పెట్టెను పరిశీలించి చూస్తూ కంగారుపడి -- "ఇది ఇందాకటి పెట్టి కాదు, మరొకటి --' అన్నాడు. అతడి కంగారుకు కారణం వేరు. ఆ పెట్టిని కొద్ది సేపటి క్రితం అతడు సునంద యింట్లో చూశాడు. అంటే అందులో....
    "దీనికీ తాళం వేసి వుంది--" అంది రామం తల్లి.
    "తాళం చెవి నా దగ్గరుంటుంది--" అంటూ రామం తండ్రి జేబులు తడిమి ఓ చెవి బయటకు తీశాడు.
    రామానికి భయం వేసింది -- "ఇది మీరనుకునే పెట్టి కాదు. దాన్ని తెరవవద్దు. ఇది నిజంగా నా కోసం పంపబడిన పెట్టి-"
    తండ్రి అతడి వంక ఆశ్చర్యంగా చూసి -- 'అయితే నువ్వు ఇలాంటి వ్యాపారంలో దిగావా? సరేలే -- ఈ పెట్టి ఎవరి కోసమో -- ఈ తాళమే తెలుస్తుంది...." అంటూ అయన తన దగ్గరున్న చెవిని తాళం కప్పాలో పెట్టి తిప్పగానే తాళం విడిపోయింది. అప్పుడాయన కొడుకు వంకా గర్వంగా చూసి -- "చూశావా? ఇది నా కోసమే!" అన్నాడు.
    భార్య క్కూడా అయన అసలు సంగతి విచారించాడు. వ్యాపారంలో ఎన్నో రహస్యాలుంటాయట. అందుకని భాగస్వాములంతా ఈ ఏర్పాటు చేసుకున్నారట. ఈ చెవికి వచ్చే తాళం కప్పలు మొత్తం డజను వున్నాయట. తాళం చెవులు భాగస్వాములందరి వద్దా ఉన్నాయట. పనై పోగానే తాళం కప్ప ఒకతనికిచ్చేయాలిట. అతడి పేరు భార్యకు కూడా చెప్పకూడదు.
    "తాళమెలా వచ్చిందో తెలియదు కానీ ఈ పెట్టి మాత్రం నా కోసమేనని కచ్చితంగా చెప్పగలను..... అన్నాడు రామం గొణుగుతున్నట్లు. ఇప్పుడు తండ్రి పెట్టిలోని శవాన్ని చూస్తె ఏమవుతుంది? తనేం చెప్పాలి? ఒక ఆడపిల్ల గురించి మతి పోగొట్టుకుని వెధవ గొడవలో ఇరుక్కున్నానని తిడతాడా?"
    తండ్రి పెట్టి మూత తెరిచాడు. అంతే -- పెట్టెలోంచి చటుక్కున ఓ మనిషి బైటికి గెంతడం జరిగింది.
    రామం కళ్ళు తేలేశాడు. తండ్రి ఉలిక్కిపడి వెనక్కు తప్పుకున్నాడు. రామం తల్లి కెవ్వుమని కేకేసింది.
    అయితే పెట్టెలోంచి దూకింది భయంకర పిశాచం కాదు.
    అందాల బొమ్మ.
    ఆమెకు పద్దెనిమిదేళ్ళ కంటే ఉండవేమో! కవ్వించే నాట్యానికి పనికొచ్చేటంత ధారామైన అవయవ సంపద, మెరిసిపోయే రంగు వళ్ళు, చూడగానే అందమైనదనిపించే కళ్ళు.
    ఆమె రిబ్బన్ లాంటి బ్రా వేసుకుంది. గోచీ వంటి అండర్ వేర్ ధరించింది. అప్పటికామే శరీరం మగాడికి కనులవిందు....
    ఆమె రామం తండ్రినీ, రామాన్ని పరీక్షగా చూసింది. "మీ ఇద్దరిలో ఎవరి కోసం నేను వచ్చాను?" అనడిగింది.
    కంఠం తియ్యగానూ, మత్తుగానూ ఉన్నది.
    రాము తల్లి కళ్ళు విస్పులింగాలయ్యాయి-"నువ్వెవరి కోసం వచ్చావు?"
    "ఈ ప్రశ్న ఎదురవుతుందని నేననుకోలేదు. మూత తెరవగానే కనిపించిన మగవాడికి కానుకగా వచ్చాను నేను. కానీ ఇద్దరు కనిపోస్తారని నేననుకోలేదు...."
    "ఈమె నాకోసం కాదు...." అన్నాడు రామం.
    "నాకోసమూ కాదు...." అన్నాడు రామం తండ్రి.
    "ఈ ఇంట్లో ఇంకెవరైనా మగవాళ్ళున్నారా?" అందా యువతి.
    "లేరు..."
    "అయితే నేను మీ ఇద్దరిలో ఒకరి కోసం...."
    "అసలీ పెట్టి వాదికోసమే నని వాడన్నాడు...."
    'అలాగైతే తాళం నాన్న దగ్గరెందుకుంటుంది?"
    ఇద్దరూ వాదోపవాదాలు చేసుకుంటుంటే ఆ యువతి నవ్వుతూ రామం తల్లి వంక చూసి "మీరేదురుగా ఉండడం వల్ల ఇద్దరూ ప్లేట్లు మార్చేశారు. లేకపోతె నాకోసమంటే నాకోసమని దేబ్బలాడుకునే వారు. ఇలా ఇంట్లో ఆడవాళ్ళకు తెలియకుండా ఆడపిల్లల్ని రప్పించుకోవడం ఇద్దరికీ అలవాటే! ఈరోజు దురదృష్టం కొద్ది వ్యవహారం బైట పడిపోయింది ...." అంది.
    "ఇందులో ఆడపిల్ల ఉన్నదని తెలిస్తే నీ ముందుగా ఎందుకు తీస్తానే .... ఇదంతా రామం గాడి వ్యవహారమే ...." అన్నాడు రామం తండ్రి.
    'అలా దాటేయకండి. గదిలో ఎవరు లేరనుకుని నేను పెట్టిలోంచి గెంతేయడం పోరపాటై పోయింది . నేనలా చేస్తానని మీరూ అనుకుని ఉండరు...."అందామె.
    ఆ యువతీ రామం తల్లికి అటు భర్త మీదా, ఇటు కొడుకు మీదా కూడా అనుమానం వచ్చేలా మాట్లాడి -- "ఈ ఇంట్లో మగాళ్ళే లేరు. ఇక్కడుండి నేనేం చేస్తాను? ఓ చీర ఇప్పిస్తే కట్టుకుని వెళ్ళిపోతాను...."అంది.
    "నువ్వు చీర కూడా కట్టుకుంటావా తల్లీ !" అంది రామం తల్లి వెటకారంగా.
    "అయ్యో-- ఆడవాళ్ళ ముందు నాకు మహా సిగ్గు -- " అందా యువతి. అలాగన్నప్పుడామే రామాన్నీ, అతడి తండ్రిని మాత్రమే చూసింది.

                                     7

    వీణ వెళ్ళిపోయింది.
    ఆమె పేరు ఏమైనప్పటికీ వీణ పెట్టెలోంచి వచ్చింది కాబట్టి రామం తల్లి ఆమెకు వీణ అని పేరు పెట్టింది.
    ఆమెను ఎవ్వరూ వారించలేదు. ఆమె ఎక్కణ్ణించి వచ్చిందో ఎలా వచ్చిందో వివరాలు తెలుసుకుందుకు కూడా ప్రయత్నించలేదు. ఆమెను చూడగానే మగాళ్ళకు మతులు పోతున్నాయి. రామం తల్లికి వళ్ళు మండిపోతోంది.
    ఆమె మగాళ్ళఇద్దర్నీ చడమడ తిట్టింది. ఇద్దరూ నోరెత్తకుండా ఆమె తిట్లు భరించారు.
    ఇది సునంద పనేనని రామానికి అనుమానం వుంది. తల్లి చేత తిట్లు తిని అతను కార్లో సునంద ఇంటికి వెళ్ళాడు.
    తలుపు మరెవరో తీశారు.
    "సునందతో మాట్లాడాలి!' అన్నాడు రామం.
    సునంద రావడానికి అయిదు నిమిషాలు పట్టింది. రామం అసహనంగా ఎదురు చూస్తున్నాడు.
    "హలో -- నువ్వా!" అంది సునంద.
    "యూ ఆర్ ప్లేయింగ్ ఏ గెమ్ ...." అన్నాడు రామం.
    "ఏదో ఒకటి ....నువ్వోస్తావన్న ఆశ నాకుంది. అది నిజం చేశావు. చాలా సంతోషం. వీణ రిపేరీకిస్తానని అబద్దం చెప్పనా-- ఓసారి పెట్టి కావాలన్నావని చెప్పనా -- ఉపాయం నువ్వే చెప్పి అది తీసుకుని పో!"అంది సునంద.
    "ఓసారి వచ్చి చూస్తాను ...." అన్నాడు రామం.
    ":నిరభ్యంతరంగా !" అందామె.
    ఇద్దరూ కలిసి ఆ గదిలోకి వెళ్ళారు. సునంద అతడికి పెట్టి తెరిచి చూపించి మూసేసింది. అందులో సుందరం శవముంది.
    "బాప్ రే -- మరి నా దగ్గరకు వచ్చిన పెట్టి సంగతేమిటి?"
    సునంద అతణ్ణి ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు -- "నువ్వేదో కధలు చెప్పి పారిపోయే బాబతనీ నా కెలాగూ తెలుసు. కానీ శవమింక వాసనేస్తుందేమోనని అనుమానం. ఎంత కాలమని ఇంట్లో పెట్టుకూర్చుంటాను?" అంది.
    "అది నీ యిష్టం ...."
    "ఇష్టం కాదు.... నీవల్ల వచ్చిన కష్టం...."అంది సునంద.
    రామం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు.
    జరుగుతున్న నాటకం ఏమిటి? ఎవరో తనతో ఎందుకాడుకుంటున్నారు? ఇందులో సునంద పాత్ర ఏమిటి?
    అతడింటికి రాగానే తల్లి అడిగింది -- "ఏరా-- ఇంట్లో  సాగలేదని ఏకంగా దానింటికే పోయోచ్చావా?"
    "అసలాదెవరో నాకు తెలిసి ఏడిస్తే కాదమ్మా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS