ప్రసాద్ కళ్ళు మెరిశాయి. "నీ మాటలకు మేమంగీకరిస్తూన్నాం." అన్నాడతను.
విశ్వనాధం తన బ్రీఫ్ కేసు తెరిచాడు. "ఇందులో డబ్బు ఉంది. ఫిల్ము వుంది. ఫోటోలూ, నేగేటివ్స్ నాకు చేరగానే, ఆ రెండూ మీ స్వంత మవుతాయి పదండి!"అన్నాడు.
* * * *
ప్రసాద్ గదిలో ఎనిమిది మిల్లీమీటర్ల సినీ ప్రొజెక్టరు ఆరెంజి చేసి "మీరు ఫోర్న్ ను కాస్త చూపిస్తేనే కానీ మీ మాటలు నమ్మం" అన్నాడు.
విశ్వనాధం రీలు తీశాడు - ప్రొజెక్టరు కు తగిలించాడు.
క్షణం లో సినిమా ఆరంభమైంది.తెర మీద - అడ, మగ బట్టలు లేకుండా శృంగార విహారాలు చేస్తున్నారు. రెండు నిముషాలు రన్ కానిచ్చి ప్రొజెక్టరు ఆఫ్ చేశాడు విశ్వనాధం.
'మీరిప్పుడు నాకా నేగేటివ్స్ తెచ్చి యివ్వాల్సుంది"" అన్నాడు విశ్వనాధం.
రాము కత్తి తీశాడు. "మర్యాదగా అన్నీ వదిలి ఇక్కణ్ణించి వెళ్ళు...."
విశ్వనాధం నవ్వాడు. "సరే - మిమ్మల్ని గురించి నేను కాస్త తక్కువ అంచనా వేసుకున్నాను. మీరు ఎంతకైనా తెగించేవారని ఊహించలేదు. నెగెటివ్ లివ్వరన్నమాట!"
"ఇవ్వను, మరోసారడిగితే నీ ప్రాణాలు తీస్తాం" అన్నాడు ప్రసాద్.
విశ్వనాధం వెనక్కు తిరిగి గుమ్మం లోంచి బయటకు వచ్చాడు. అతని వెనుకనే తలుపులు మూసుకున్నాయి. మెరుపు వేగంతో విశ్వనాధం వెనక్కు తిరిగి తలుపులు తోసుకుని లోపలకు వెళ్ళాడు. తలుపులు వేస్తున్న రాము వెల్లకిలా పడ్డాడు. క్షణాల్లో విశ్వనాధం చేతిలోకి రివాల్వర్ వచ్చింది "చేతులెత్తి మర్యాదగా నిలబడండి. ప్రాణాలు తీయదానిక్కూడా సందేహించను...." అన్నాడతను.
రాము, ప్రసాద్ ఇద్దరూ చేతులెత్తి నిలబడ్డారు.
"ఇప్పుడు చెప్పండి. నేగేటివ్స్ ఇస్తారా?' అన్నాడు విశ్వనాధం.
3
"ఎవరమ్మా మీరు?" అన్నాడు రామారావు.
"రాధ కోసం వచ్చానండీ --" అంది సుధ.
రామారావు గారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి-- "లక్ష్మీ ఈ అమ్మాయెవరో రాధ కోసం వచ్చిందిట --" అన్న అయన కంఠం పెగల్లేదు.
"ఎవరూ -- రాధ కోసమా?" అంటూ ఓ నడి వయస్కురాలు వరండాలోకి వచ్చింది. బహుశా ఆవిడే లక్ష్మీ అయుండాలని సుధ అనుకుంది.
"అవునండీ -- ఆమెతో ఒక ముఖ్యవిషయం మాట్లాడాలి-" అంది సుధ.
'ఊళ్ళో లేదమ్మా రాధ -- మరీ ముఖ్య విషయమైతే నాకు చెప్పి వెళ్ళు...." అందావిడ.
"ఊరి కెప్పుడు వెళ్ళిం దండి-- మళ్ళీ ఎప్పుడు వస్తుంది?" అనడిగింది సుధ.
"వెళ్ళి వారం రోజులయింది. బహుశా ఇంకో వారం రోజుల్లో వస్తుందేమో!"ఆవిడ గొంతు చాలా తడిగా ఉంది. అర్ధం కాలేదు.
రెండ్రోజుల క్రితం రాధ, సుధనీ ఊళ్లోనే కలుసుకుంది. వారం రోజుల క్రితం ఊరొదిలి వెళ్ళిందని వీళ్ళంటున్నారు. ఆమె పేరు తల్చుకుంటూనే దుఃఖిస్తూన్నారు. కారణమేమిటో సుధకు తెలియలేదు. సరేలెండి మళ్ళీ వస్తానని చెప్పి అక్కణ్ణించి బయటపడింది సుధ.
* * * *
వారం రోజులుగా మనోరమా ఏజన్సీస్ కు కూడా రాధ రావడం లేదని తెలిసింది.
సుధకు ఏమీ అంతుపట్టకుండా ఉంది. ఆమె కంగారుగా తన బసకు చేరుకునేసరికి అక్కడ భర్తతో మాట్లాడుతున్న రాధ కనబడింది. రాధ ముఖం తృప్తి గా వెలిగింది.
"మీ గురించి నేను మీ ఇంట్లోనూ, ఆఫీసులోనూ వెతుకుతున్నాను. మీరు తిన్నగా నా బసకే వచ్చారు. మిస్ రాధా!" అంది సుధ.
"ఆమె రాధ కాదు ---" అన్నాడు విశ్వనాధం గంబీరంగా.
సుధ త్రుళ్ళి పడి --' అయితే ఎవరు?" అంది.
"నాపేరు రేఖ -- "అందామె. "రాధ నా స్నేహితురాలు . ఆమెకు జరుగకూడని అన్యాయం జరిగేక జీవితం మీద విరక్తి చెంది ఇల్లు వదిలి పోతున్నట్లుగా ఒక ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి నాదగ్గరకు వచ్చింది. ఆత్మహత్యా ప్రయత్నంలో నా సహాయం కోరింది. నేను విషం పేరిట మత్తు మందు బిళ్ళలిచ్చానామెకు. ఆమెకు స్పృహ తప్పగానే ఆమెను మా ఇంట్లో బందీని చేశాను. చావు సమస్యలకు అంతం కాదనీ -- బ్రతికుండగానే వాటిని చక్కదిద్దుకోవాలనీ ఆమెకు నచ్చజెప్పి -- రెండు వారాల గడువడిగాను. ఈ గడువులో నేనామె జీవితాన్ని చక్క దిద్దక పొతే -- నిజంగా విషమిస్తానని వాగ్దానం చేశాను. ఆమె తలిదండ్రులకు రాధ ఏమయిందో తెలియదు. రహస్యంగా అన్వేషిస్తున్నారు. మీదగ్గరకు రాధ పేరుతొ నేను వచ్చాను. మీరు నేను కోరినది సాధించారు--"
'అయితే అన్నీ అయన చెప్పెశారన్న మాట మీకు...." అంది సుధ బాధగా.
"బాధపడకు సుధా -- నేను వేసే ప్రతి అడుగు వెనుకా నీ ఆలోచనా ఉన్నదని అందరికీ నేను చెబుతాను గదా" అన్నాడు విశ్వనాధం.
"బ్లాక్ మేయిలర్స్ ని మీరు చాకచక్యంతోనూ, ధైర్యసాహసాలతో నూ ఎదిరించారు...." అంది రేఖ అభినందక పూర్వకంగా.
"అందుకోకే ఒక్క కారణముంది. నేను బ్లాక్ మేయిలర్స్ ని కలుసుకోబోయే ముందు శర్మతో మాట్లాడి విషయాలన్నీ వివరంగా చెప్పాను. ముందు షాక్ తిన్నప్పటికీ తర్వాత అతను విశాల హృదయంతో ఒక్క మాటన్నాడు. "మనినపడ్డం అనే మాట అర్ధం లేనిది. ఆమె మాలిన పడి రెండు వారాలయిందంటున్నారు. పది రోజుల క్రితం ఆమెను చూశాను. మనిషి దిగులుగా ఉంది. కానీ -- మాలిన్యం ఆమె ముఖంలో కనబడలేదు. కులతత్వం లాగే ఈ మాలిన్యమన్న పదం కూడా అర్ధం లేనిది --"
అతనన్న అ ఒక్కమాటా కొండంత ధైర్యాన్నిచ్చింది. రహస్యం బయటపడ్డా కూడా ఒక స్త్రీ జీవితం నాశనం కాదన్న ధైర్యంతో ముందడుగు వేశాను.
శీలానికి పెడర్ధాలు తీయకుండా, శర్మలా ప్రేమించే మనసు గల వారుంటే దేశంలో నేరాల సంఖ్య సగానికి సగం తగ్గుతుంది...."అన్నాడు విశ్వనాధం.
***
