త్వరలో మీకు ఆ కోటి రూపాయలూ మా కార్పొరేషన్ పే చేస్తుంది. థాంక్యూ మేడమ్!" అంటూ పెట్టేశాడు.
రుక్మిణి మరింతగా బిగుసుకుపోయింది.
చిలుక పీకనొక్కటానికీ, తన భర్త మరణానికీ ఏమయినా కారణముందా?!
తన కర్ధంకాని ఈ హైటెక్ ప్రాసెస్ లో తన భర్త ప్రాణాన్ని తనే తీయటం జరిగిందా?!
అర్ధంకాని పరిస్థితుల్లో...ఆమె బ్రెయిన్ లోని నరాలన్నీ చిట్ పట్ మంటూ పేలిపోతుంటే....
ఆమెకు దూరంగా....
సాజిత్ గదిలో....
అతని కెదురుగా పావని....
పులి పంజానుండి బయటపడిన లేడిపిల్లలా వణికిపోతూ కూర్చుంది.
* * * *
"డియర్ పావనీ! ఆ సమయంలో అతని మరణం అనివార్యమయ్యేది. నీవు భయపడిన దారుణం అక్కడ దొర్లేది కాదు."
"అంటే...." పావని అర్ధంకాని ముఖభంగిమల్ని పెట్టి అడిగింది.
"మరేం లేదు. ఒకరోజు జరిగిన విషయం చెప్తాను విను...." అంటూ జరిగింది ఆయన గుర్తుచేసుకున్నాడు.
* * * *
ఆ రోజు నిమ్స్ మొత్తం హడావిడిగా వుంది.
అంబరీషుడు అప్పటికే అమాత్య పదవిలో వున్నాడు. ఆయన తన స్నానాల గదిలో కాలుజారి పడ్డాడు. ముందు పళ్ళు రెండు వూడటమే కాకుండా....గూటిమీద చిన్న గాయమయింది.
గాక్తర్ సాజిత్ డ్యూటీలో వున్నాడు.
పడింది మంత్రిగారు. ఆసుపత్రి గవర్నమెంటు వారిది.
ఆర్డినరీ వార్డులన్నీ అర్జెంటు వార్డులయ్యాయి.
సాజిత్ కు అమెరికానుండి ఇండియాకు రావటంతోనే ఒక ప్లాన్ వుంది. తను నానో టెక్నాలజీలో డిప్లమో తీసుకున్నాడు.
ఆ టెక్నాలజీతో ఎన్ని ప్రయోగాలయినా చేయవచ్చు.
ఆసుపత్రి కొచ్చిన దొంగలకీ, స్మగ్లర్స్ కీ వారి శరీరం గాయాల్లో నానో చిప్స్ అమర్చి...వారి కదలికలమీద నిఘా వేసి వుంచవచ్చు.
పళ్ళూడితే...ఏదో ఒక కృత్రిమ పంటితో ఆ చిప్ అమర్చి ఆయన మాట్లాడేదంతా ఆయనకు దూరంగా టెక్నికల్ చాంబర్స్ లో కంప్యూటర్స్ లో రికార్డు చేయవచ్చు.
దొంగలకీ, స్మగ్లర్స్ కీ ఏమాత్రం మేం తీసిపోం అంటూ కొందరు మంత్రులు నిరూపించుకుంటున్నారు.
నాలుగు లక్షలు కూడా విలువ లేనివాడు మంత్రి పదవినుండి దిగే సమయానికి నాలుగు వందల కోట్ల రూపాయల్ని స్వదేశంలోనూ, నాలుగు వేళ కోట్లు విదేశీ బాంకుల్లోనూ దాస్తున్నారు.
ఒక మంత్రివర్గ నాయకుడు మంచివాడయితే....తన సహచర మంత్రులందరికీ ఒక్కొక్క పన్ను పీకి ఈ నానో చిప్ వున్న పంటిని తగిలిస్తే...అందరి గూడుపుఠానీలూ ఆయన హైటెక్ చాంబర్లో రికార్డు అవుతాయి.
ప్రస్తుతానికి అంత నెట్ వర్క్ సీనులేదు.
ముందుగా....తనముందు గాయం చేసుకొనీ, పళ్ళు రెండూ రాల గొట్టుకునీ మంత్రి అంబరీషుడు పడివున్నాడు. అతనిమీద ఒక ప్రయోగం చేసి....తన గదిలో అతని ఏక్టివిటీస్ ని రికార్డుచేసి ఎప్పటికప్పుడు ప్రెస్ కీ, తన గదిలో అతని జర్నలిస్టులకీ అందించాలని సాజిత్ అనుకున్నాడు.
ఆ తరువాత ఆయన అంబరీషుడికి ట్రీట్ మెంట్ ఇచ్చాడు. భుజం మీది గాయమ్లో ఒక 'నా' నో చిప్' ను వుంచి కుట్టేశాడు. తన హైటెక్ చాంబర్లో తయారయిన నానో చిప్ వున్న పంటిని అంబరీషుడి కమర్చాడు.
సో...ఇప్పుడు అంబరీషుడిమీద తమకు సర్వాధికారాలు వున్నాయి. అతని కదలికలన్నీ అతని భుజంలో అమర్చిన చిప్ ఇచ్చే ట్రాన్స్ మిషన్స్ ని సెంట్రల్ చాంబర్లోని 'స్పెన్సర్స్' అందుకుంటాయి. ఆయన ఎక్కడ వున్నదీ తెలియజేస్తుంది.
పంటిలో అమర్చిన మరో నానో టెక్ పరికరం ఆయన ఎవరితో ఏం మాట్లాడుతుందీ రిసీవ్ చేసుకుని ....సెంట్రల్ చాంబర్ లోకి ఫీడ్ చేస్తుంది. ఎప్పుడయినా వినటానికి అవి అందులో రెడీగా వుంటాయి. టైమ్ తో సహా మంత్రిగారి మాటలు రికార్డు అవుతాయి.
తనకు 'నిమ్స్' లో చికిత్స జరిగిందనే అభిప్రాయంలో అంబరీషుడు వున్నాడు.
అతనికి తెలీకుండా అతని శరీరాంతర్భాగాలలో నానో టెక్ పరికరాలు అమర్చబడటం అతనికి తెలీదు.
తరువాత సాజిత్ అంబరీషుడి భుజంలో అమర్చిన నానో టెక్ పరికరం రిమోట్ కంట్రోలింగ్ ను ఒక మిషన్ లో అమర్చి ఆ మొత్తాన్ని చిలుక గొంతులో పెట్టి- నేరుగా అది అంబరీషుడి ఇంటిముందు దిగేఏర్పాటు చేశాడు.
ఇప్పుడు చిలుక గొంతు నొక్కే అవసరం రుక్మిణికి మాత్రమే వుంది. విద్యాయజ్ఞంలో ఆమె మహారాణి ....ఋషి తిరుమలరావుగారు.
ఆ యజ్ఞంలో తనకు తెలీకుండా సమిధగా మారింది మాత్రం అంబరీషుడే!
ఈ మహాయజ్ఞంలో ఒక ఎథికల్ వాల్యూ మాత్రం ఎవరికీ తెలీకుండా కాపాడబడింది.
అంబరీషుడికి పావని స్వయంగా చెల్లి అవుతుంది. ఆసుపత్రిలోని నర్స్ చర్యవల్ల ఆ రహస్యం ప్రపంచానికి తెలీకుండా వుండిపోయింది.
పావనిముందు సాజిత్ విచిత్రమైన సమస్యల నుంచాడు. సైన్స్ కీ, ఎథికల్ వాల్యూస్ కీ జరుగుతున్న సంఘర్షణ అందులో వుంది.
సాజిత్ ఫైల్స్ నుండి తెలుసుకుని.....పావని చివర్లో వాటిమీద తన అభిప్రాయాల్ని వ్రాసింది.
"శాస్త్ర విజ్ఞానం ఎంతగానైనా పెరగవచ్చు. మనిషి ప్రయాణం అతి సూక్ష్మమయిన నానో టెక్ రంగంనుండి అనంతమైన స్పేస్ టెక్నాలజీ వరకూ సాగవచ్చు. అతని జీవితం నైతిక విలువల చట్రం నుండి బయటకు మాత్రం రాకూడదు.
యుగాల వైజ్ఞానిక ప్రయాణంలో సాగిన అతని అడుగులు తిరిగి వెనక్కి తిరగకూడదు.
అతని మేధోసంన్నమైన తల పాలపుంతల సైంటిఫిక్ వెలుతురు కిరణాల్లో....సూర్యుడికంటే గొప్పగా ప్రకాశిస్తున్నప్పుడు, అతని పాదాలు నైతిక విలువలు తెలీని అంధయుగం బురదలో కూతురుని ఆటవికమైన అడుగులు వేయకూడదు.
