ఉహూ! నేనే దొరికాను.
ముఖ్యమంత్రిగారేమో అందరూ హరిశ్చంద్రులన్నట్టు వాళ్ళందరినీ వదిలి నన్ను పట్టుకున్నాడు.
తాడో-పేడో ఈ రాత్రికి తేలిపోవాలి.
ఎంతమంది కావాలో అందరినీ తీసుకెళ్ళు.... "అంబరీషుడు ఆగ్రహంగా అన్నాడు.
అందుకు అనంత్ చిన్నగా నవ్వి....
"చూడండి సర్! పిచ్చుకమీద బ్రహ్మాస్త్రంలా....చిన్న పాముకు పెద్ద కర్రలా.....జనం ఎవరూ లేకుండానే దాన్ని ఈ రాత్రికే తమ కాళ్ళముందు పడేస్తారు.
వ్యాన్ లో జనాన్ని తీసుకుపోతే....రియాక్షన్స్ వెంటనే మొదలవుతాయి. కొన్ని నెగటివ్ శక్తుల్ని పాజిటివ్ గా దేబ్బతీయాలి. పావని ఆడది. పైగా దాని బాబు పేరున్న లెక్చరర్! ఆ పిల్ల మన ట్రాక్ లో వుందని తెలీగూడదు. తెలిస్తే....ఈ హైటెక్ ఇంటర్ నెట్ వర్క్ లో మరుక్షణం ముఖ్యమంత్రిగారికి తెలుస్తుంది. దానికి ఏ కబురు చెపితే బయల్దేరి బైటికి వచ్చి మనం పన్నిన ఐరన్ నెట్ లో అమాయక కుందేలులా పడుతుందో తమరే చూస్తారు" అనంత్ అన్నాడు.
"అదే జరగాలి. దానిచేత కొన్ని నిజాల్ని మనం ఈ గెస్ట్ హౌస్ లో కక్కించాలి" అంబరీషుడు అనగానే__
"నో సర్! అందుకు ఈ గెస్ట్ హౌస్ పనికిరాదు. కాకులు దూరని కరదవులూ-చీమలు దూరని చిట్టడువులూ అంటారు చూడండి...అలాంటి ఖాకీలు కనిపెట్టలేని సి.ఐ.డి.లు చూడలేని ఒక కారు చీకట్ల కాజిల్ వుంది. దాన్ని అందులో పడేస్తాను. సెక్యూరిటీ చింతకాయ లేకుండా మనం మాత్రమే దాన్ని చిత్రహింసలకు గురిచేసి ఇద్దరు-ముగ్గురు పర్సనల్ గూండాల్ని వేసుకుని వెళదాం.
అక్కడ పలికే ప్రతిమాట దానికి లైఫ్ అండ్ డెత్ అవుతుంది. చావు బ్రతుకుల చట్రంలో దాన్నిరికించి నిజాన్ని పసరు కక్కించినట్టు కక్కిస్తాను. మీరు ఏం ఆందోళన పడకండి. రేపు ఈ బసంతితో ఆ న్యూస్ ఏజన్స్ మీద పరువు నష్టం కేసు వేయిద్దాం.
ఒక పట్టు ఆ పేపరు వాళ్ళను కూడా పట్టమంటే పడతాను. ఆధారాలు ఏం చూసి ఆ వార్తను ప్రచురించారో చెప్పమందాం. వారి ద్వారా కూడా మనకు కొంత సమాచారము వస్తుంది. ఏ ఆధారాలూ లేకుండా వాళ్ళు ఇలాంటివి ప్రచురించరు. అందులోనూ మనమీదకు దండయాత్రంటే ఆషా మాషేకాదు. ఆధారం చూపకపోతే...ప్రెస్ ని ఎలా సప్రెస్ చేస్తానో తిరిగి తమరే చూస్తారు.
ఈ అనంత్ అనంతకోటి ఉపాయాలూ-లీలలూ వారన్నంతగా రుచి చూపిస్తాను."
"ప్రెస్ జోలికిప్పుడుకాదు. మరలా వీళ్ళంతా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ దిగజారిపోయిందనీ కేకలు వేస్తారు. ముఖ్యమంత్రి మరలా నన్ను పిలిపిస్తాడు. ఆరోపణల్ని అబద్దాలని రుజువుచేయాలిగాని.....ఇలా ప్రెస్ జోలికి పోతే నేను సహించనంటాడు. ఆ పత్రిక ఎడిటర్ సామాన్యుడు కాడు. మన ఆధారాలు ఆయనముందు పెట్టాడంటే అది మరింత పరువు తక్కువవుతుంది.
ఇంకేంవద్దు ఆ పిల్ల పట్టుకుపద...." అంబరీషుడు ఆగ్రహంగా అన్నాడు.
* * * *
అది సిటీకి దూరంగా ఉన్న ఒక ఘాట్ రోడ్ లోని గెస్ట్ హౌస్.
ఫారెస్ట్ కాంట్రాక్టర్ సాంబశివుడిది.
అనంతానికి అతడు తెలుసు.
మంత్రిగారు ఒకరోజు బస చేస్తారని చెప్పడంతో 'మహాభాగ్యం' అంటూ సాంబశివుడు అనంతానికి తన గెస్ట్ హౌస్ ని అప్పగించాడు.
ఇప్పుడా గెస్ట్ హౌస్ లో....
అంబరీషుడి ఎదురుగా పావని వుంది.
"ఏమే! ఆఫ్టరాల్ ఒక ఆడదానివి. చెప్పుక్రింద రాయిలాంటిదానివి. నేర్పుగా చెప్పులోకి దూరి పాధంక్రింద బాధపెట్టినట్టు విపరీతమయిన బాధపెట్టావు.
గాలిలో ఎగిరే నలుసులాంటిదానివి. అయినా నాకంటిలోపడి.....అసౌకర్యానికి గురిచేశావు. నలుపుకుంటే కళ్ళు ఎర్రబడేట్టు చేశావు.
నేలమీద పాకే చీమలాంటి దానివి నలిపితే చచ్చి వూరుకుంటావు. కానీ శార్తులోకి దూరి.....శరీరమంతా కుట్టి బొబ్బలు పడేట్టు చేశావ్! ఇప్పటికి చేతికి దొరికావు.
నాకు సంబంధించిన పర్సనల్ రహస్యాలు నీకిన్ని ఎలా లభించాయే? వివరంగా చెప్పు.....లేకుంటే ఈ గెస్ట్ హౌస్ లో నిన్ను మరో బసంతిని చేస్తాను.
యస్! ఒకటి పాజిటివ్ బసంతి. తానుగా వచ్చి నన్ను చుట్టుకుపోయింది. నా పడక గదిలోకి కూడా నీ ఇన్వెస్టిగేటింగ్ లో నిన్ను మరో బసంతిని చేస్తాను.
యస్! ఒకటి పాజిటివ్ బసంతి. తానుగా వచ్చి నన్ను చుట్టుకుపోయింది. నా పడక గదిలోకి కూడా నీ ఇన్వెస్టిగేటింగ్ 'ఐ' పడిందంటే నా బసంతితో నా రొమాన్స్ గురించి నేను వేరుగా చెప్పనక్కర్లేదు.
ఇక నీ విషయానికొస్తున్నా!
ఈ క్షణం నుండి నీవో నెగటివ్ బసంతివి! అంటే-నిన్నే నేను బలవంతంగా చుట్టుకుపోతా!
అంటే రేప్!
అదెప్పుడు జరిగిందీ-ఎట్లా జరిగిందీ మొత్తంగా నీవు రేపు పేపర్లో వ్రాయి. అప్పుడు ఎలా ఫీలైందీ వ్రాయి. ప్రతిదీ పబ్లిక్ చేయటమేకదా నీ లక్ష్యం!
అదికూడా చదివి జనం ఆనందిస్తారు.
"ఆ నెగటివ్ పరిస్థితి నీ జీవితంలోకి తెచ్చుకోకుండా జరిగిందంతా మర్యాదగా చెప్పు. నాకు సంబంధించిన విషయాలన్నీ నీకెలా చేరాయో చెప్పు?..."
అంబరీషుడి మాటలకు పావని కొద్దిగా భయపడిపోయింది.
తనను నేర్పుగా ఇంటిలోంచి బయటకు తీశారు.
ఒక కంట్రాక్టరు కోడలు కట్నాల వేధింపులకు గురయిందనీ, ఆమెను చంపి ఆత్మహత్యకు మలిచే ప్రయత్నంలో వున్నారనీ, ఆమెకింకా ఊపిరి వుందనీ-మీరుగా వచ్చి నిజా నిజాల్ని ఆమె నోటినుండి విని, మరో దురంతాన్ని బయటికిలాగి....వారికి శిక్ష పడేట్టు చేయాలనీ, తాము హ్యూమన్ రైట్స్ ఆఫీసునుంచి వస్తున్నామనీ, వారు మిమ్మల్ని కూడా ఆసుపత్రికి తీసుకురమ్మంటే బయలుదేరి వచ్చామని అంటే....తను ఏమాత్రం ఆలస్యం లేకుండా వారి జీప్ ఎక్కింది. ఆ తరువాత వారు తనకు ఏదో మత్తు కలుగ జేసినట్టు గుర్తు!
తీరా స్పృహవచ్చే సమయానికి ఎదురుగా మంత్రి అంబరీషుడున్నాడు. భవంతిచుట్టూ చెట్లు తప్ప ఏంలేవు. వాహనాలు తిరుగుతున్న ధ్వనులు కూడా ఏం వినిపించలేదు. అంటే తనను కావాలనే ప్లాన్డ్ గా సిటీ సబర్టన్ ఏరియాకు తరలించారు.
పావని మనసులో అనుకుని....
"చూడండి అంబరీషుడుగారూ! మీకు సంబంధించిన రహస్యాలన్నీ మీ మనుష్యులనుండే నాకు చేరాయి. మీ ప్రతిమాటా టేప్ రికార్డ్ అయ్యింది. అవన్నీ మా దగ్గర భద్రంగా వున్నాయి. మీలో ఒక మనిషి వున్నాడు. అతన్ని మా దగ్గర భద్రంగా వున్నాయి. మీలో ఒక మనిషి వున్నాడు. అతన్ని మీరు గమనించలేకపోయారు. ఇందులో నా తప్పేంలేదు. ఒక ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ గా నా పని నేను చేశాను" అంది.
ఆ మాటలతో అంబరీషుడికి మరింతగా కోపం వచ్చింది.
"సరే! నీవు చెప్పినదానికీ అంగీకరిస్తాను. ఇప్పుడు నిన్ను ఈ గెస్ట్ హౌస్ లో 'రేప్' చేసి ఒక వారంపాటు వుంచుతాను. మనకు సంబంధించిన మేటరు ప్రెస్ కెళితే మాత్రం నీవు చెప్పింది నమ్ముతాను.
సో....మైడియర్ పావనీ-ఒక 'ఫ్యూఫ్' ఖరీదు ఒక 'రేప్'! ఇది దారుణమండీ అంటావ్. మరి నా పర్సనల్ ఫైల్ మొత్తం దారుణాలేకదా?! అందులో ఒక రేప్ చాప్టరే లేదు. దాన్ని నీతో పూర్తిచేస్తాను. చాలాఅందంగా కూడా వున్నావ్" అంటూ అతడు తన పాశవిక పంజాను తెరచి ఆమెకు దగ్గరగా జరిగాడు.
పావని భయపడిపోయింది.
తను అరిచినా ఆదుకోవడానికి ఎవరూ లేరు.
భవంతి చుట్టూ అతని మనుషులే.
దగ్గరవుతున్న అతనిబారినుండి తనను తాను ఎట్లా రక్షించుకోవాలా అని లోలోపల ఘర్షణ పడుతున్న క్షణాలకు....
* * * *
