Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 26

 

    పక్షులు తమ రెక్కలతో ఆకాశాన్ని కప్పాయి. అరుపులతో దిక్కుల్ని నింపాయి. జరగబోయే మారణయజ్ఞం గుర్తించాయి గావును తమ పూర్వనుభవం వల్ల. ఆ అరుపుల అర్ధమేమిటో? ప్రియులు ఒకరితో ఒకరు గుడ్ బై చెప్పుకోడమా? గూళ్ళ లోంచి తలలెత్తి చూసే పిల్లలకి కడపటి సలహాలా? ఏడుపులా?
    చాలాసార్లు అసలు పిట్టల అరుపులకి అర్ధముందా అని యోచిస్తాను. కోతులు తప్ప మృగాలు అంత గోల చెయ్యవు. రాత్రంతా కప్పలూ, కీచురాళ్ళు విసుగులేకుండా గోలపెడతాయి. చీకట్లో ఒకటి యెక్కడ వుందో రెండో దానికి తెలియచెయ్యడానికేమో అనుకున్నాను; మిణుగురు పురుగుల దీపాలవలె. కాని యీ పిట్టలు! పామర్రు బంగళాలో నిదానంగా అనేక రకం పిట్టల కూతల్ని గమనించాను. కొండవీటి బంగళా లో పొద్దున్నే లేస్తే యీ పిట్టల ధ్వనులతో కొండలు మారు మోగుతాయి. కవులు, సరే యివన్నీ పాటలన్నారు, హర్షధ్వనులన్నారు, ధన్యవాదాలన్నారు. శ్రీ బ్రహ్మసమాజం వారు ప్రార్ధనలన్నారు. సోమనాధరావుగారు -------
    "పిట్ట లేవనిని పాడుచుండునో ప్రీతి సాగరు నాతని" అన్నారు.
    కాని బహుశా ఆ "పాడుచుండునో' అనే దాంటో నిజమైన భావం పక్షి భాషలో-
    "ఈమూల లావాటి పురుగు పోతోంది. నువ్వా వేపునించి రా నేనీవేపునుంచి వస్తాను" అని మగపిట్ట ఆడదానితో చెప్పడం  అయివుంటుంది. అయన శాకాహార హృదయం ఏమౌతుందో! ఆ అర్ధమే ఆయనకి అర్ధమైతే!
    పిచ్చికలు , గోరింకలు ఎన్నోరకాల అరుపులు అరుస్తాయి. ఒక కొమ్మమీద కూచుని ఒక అరుపు యింకో కొమ్మ మీదికి గంతేసి యింకో అరుపు . గదుల్లో గూళ్ళు కట్టే పిచ్చికల అరుపుల్ని ఒక సంవత్సరం అదేపనిగా వింటే పచ్చిక భాష diotionary వ్రాయవచ్చు ననుకుంటాను.
    తుపాకీ పేలింది. మెల్లిగా అకాశాన్నించి రాలే నల్లని కన్నీటి చుక్కలవలె దీనంగా నీళ్ళ మీద రాలాయి పక్షులు. నీళ్ళ మీద నించి మళ్ళీ గాలిలోకి లేవాలని చూసే ఆ నిర్భాగ్యుల్ని పట్టుకుని లాక్కొచ్చి పడేశారు పడవలో. కన్నీళ్ళతో నావోల్లోకి తీసుకున్నాడు. యింకా వెచ్చగా కదులుతున్న కళేబరాన్ని . ఆ యికల అందం, ఆ మెడల తిప్పు , ఆ రొమ్ము సౌష్టవం, రెక్కల వొంపు అంటా చివరికి యిందుకా? దువ్వాను. పొరలు కమ్మే కళ్ళలోకి చూశాను. రొమ్ముకు అద్దుకున్నాను. నా చేతుల్లో చల్లబడ్డాయి.
    ఈ చిన్న పిట్టల్లో చంపడానికి వచ్చినపుడు తప్ప మనిషి కంటబడని పిట్టల్లో యీ అందలేమిటి యీ తళుకు , యీ నునుపు; పైగా తమ అనందం కోసం యీ సృష్టి జరిగిందని కులుకుతున్నారు ప్రపంచంలో సగం మంది. ఎవరు చూడడానికి? ఒకపిట్ట యింకో పిట్ట అందాన్ని చూడగలదా? దేవతలు చూస్తారా? యింత అందాన్ని యిట్లా నాశనం చేస్తోవుంటే చూస్తూ వూరుకున్నారా, దేవతలూ, రుషులూ, దిక్పాలకులూ? యిట్లా నాశనం కావడానికా యింత శ్రమ? అందమైన పిల్ల పుట్టగానే చచ్చిపోతో వుంటే యీ సృష్టి విధానాన్ని నడిపేవాడు వుంటే , ఇంత నిస్సహాయంగా, తాను నిర్మించిన సౌందర్యాన్ని , తానే నాశనం చేస్తాడా అనుకుంటాను -
    అందమనేది వుందా? నా కంటో గాక బైట వుందో, దేవుడికి కనబడుతుందా? దేవుడే లేకపోతే ఏదో పక్షులు రావొచ్చు గాని, అందం ఎట్లా వొచ్చింది? నా మనసులో సౌందర్యభావానికీ , పిట్టల రెక్కల నునుపుకీ సంబంధం ఎట్లా కలిగింది?
    దేవుడు వుంటే , సౌందర్యం మీద వుపెక్షా , నిరసనా,  ద్వేషమా అతనికి? ఇన్నేళ్ళూ వాటి అందం ఎవరు చూసి సంతోషిస్తున్నారు! చివరి నిమిషంలో చంపబోయేప్పుడు ఒక్క నిమిషం నాకళ్ళు చెదరకొట్టేందుకా , అన్ని యుగాల ప్రయత్నం evolutuion!పక్షి అందాన్ని కల్పించేందుకు, నేనూ , నా సౌందర్యదృష్టి అంత ముఖ్యమా! ప్రపంచంలో.....నేను - ఒక్క చిన్న దెబ్బతో - అంతా ముగిసేనేను- పురుగుకన్న నాజూకు ప్రాణంగ అనెను - నేనే అంత విలువా దేవుడికి? తక్కినవాళ్ళూ! నదుల్లో , పిల్లలల్లో , పిట్టలలో ఏ సౌందర్యం చూడని వాళ్లు, కంది పచ్చడిలో,చీకటి మంచాలమధ్యతప్ప; మురుగు వాసనల్లో, నంగిమాటల్లో తప్పఅందం కనపడి యీ "children of god" సంగతేమిటి!
    ఏం జరిగింది? ఏమిటి ఆగింది? ప్రాణం పోయిందా? ప్రాణం వుందా పోవడానికి? ప్రాణం ఆ శరీరం నించి వేరా? ఆ శరీరంలో నివసించిందా? ఇప్పుడు వేరై యింకా ప్రత్యేకంగా యింకో ఆత్మగా exhist అవుతోందా? ఎక్కడో యీ ఆకాశంలో? ఆత్మ అనేది వుందా? పిట్టలకి కూడానా? ఇట్లానే వాదించా, పంగనామాల పందికొక్కు హెడ్మాష్టరుతో ఒకసారి. ఆత్మ పురుగులకి, దోమలకి , యింకా సూక్ష్మజీవులకి , భూత అద్దంకింద కనబడే జల జీవులకి , క్షయ జీవులకీ , మన రక్తంలో యేర్రని కణాలకి, మన శరీరంలోని ప్రతి cell సెల్ కి , గడ్డకి, ప్రతి గడ్డి మొక్కకి, గడ్డిమీద ఆకుపచ్చత నాన్నిచ్చే అణువులకి, క్లోరఫిల్ కి , protoplasm కి , రాళ్ళకి, రాళ్ళలోని రజానికి? జబాబు చెప్పమను? ఎక్కడ గీత గీస్తావు ఆత్మవున్నా వొస్తువు, లేని వస్తువు అని? మనకి ఆత్మ వుంది. మన శరీరంలో cells కి వేరే జీవం వుంది. అది అందరికీ తెలుసు? వాటికీ వేరే ఆత్మలా? ఏదీ నా ఆత్మ నా శరీరంలోని కోట్ల కొలది జీవరాసుల్లో! అంతా ఒకటే పరమాత్మ స్వరూపమని తప్పించుకుంటారు వేదాంతులు. సులభం కాని వాదించమనండి. సరేకాని కొన్ని  జీవాత్మలున్నాయిగా! అవి వేటికి? మనుషులకెనా? అంతేనంటారు క్రిష్టియనులూ మహమ్మదీయులూ! ఐతే కొండమనుషులకి? మనుషులవంటి కోతులకి? ఇంకా దిగిపోతుంది స్కేల్! ఇదంతా ఎవడికీ అర్ధం గాని విషయం. అర్ధమౌతుందన్న వాణ్ణి , తనకి తెలుసునన్న వాణ్ణల్లా ప్రశ్నలడిగి నోరు మూయించి మొహాన వుమ్మేసి , యీ మతాలగర్వం అణిస్తే బాగుపడుతుంది లోకం.
    మిత్రుడు వైకుంఠరావు "ఏమిటి మనుషులకా ఆత్మ? అసలు వాళ్ళకే లేదు. ఏమిటి? ఈ మనుషు అందరికీ ఆత్మలున్నాయంటావా? చచ్చింతరవాత ఏమన్నా మిగులుతుందంటావా? ఏమీ భయం లేదు, బూడిద తప్ప యింకేమీ లేదు" అన్నాడు ఒకసారి ఇప్పుడేమంతున్నాడో! ఆత్మలసంగతి మాట్లాడిన పంగనామాల పందికొక్కుకి వుందా ఆత్మ!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS