జీవితమంటేనే Struggle ప్రతి పదార్ధమూ ఉన్నత దశని పొందాలని పెనుగూలాదుతో వుంటుంది. అణువు దగ్గిర్నించి గడ్డినించి అన్ని జీవులూ క్రమంగా ఇంద్రియాలలో బుద్దిలో పరిణామాల్ని పొందుతున్నాయి. మానవ జాతిలో కూడా అడివి మనిషి నుంచి వృద్ది పొంది బలం బుద్ది కర్మా వికసింపచేసుకోడానికని నిరంతర ప్రయత్నంలో వున్నారు. ఈ inner propulsion వల్లనే మానవులు ధనం మీద, స్త్రీల మీద, కళల మీద ఆశపడి తృప్తి పొందాలని చూస్తారు. ఎవరిలో యీ బాధ యీ Struggle ఆగిపోతుందో వారు నిర్జీవులు. ఈ ప్రయత్నబలం యెక్కువగా కలవారిలో కొందరు తమ అనుభవాన్ని కళారూపాన్ని వెలువరిస్తారు. పాడాలనే ప్రోద్భలం వొక్కటి analyeeచేసి చూచుకున్నా అర్ధమౌతుంది యీ విషయం. కనక వున్నతమైన కళ యెప్పుడూ మానవుడూ ఔన్నత్యాన్ని అందుకోవాలని చేసే ప్రయత్నాన్ని ప్రతి ఫలిస్తుంది. అందువల్లనే జీవితంలో సంబంధం కలిగి వుంటుంది. ఎప్పుడూ మార్పును సూచిస్తుంది. ఎందుకంటె జీవితమంటే ప్రవాహం, ఎప్పుడూ మారే స్వభావం కలది గనక. జీవన శక్తి అదే. సృష్టిశక్తి, యెక్కువగా వున్నవాడు గాని ఇతరుడు గొప్ప కళాశక్తి గలవాడు కాలేడు. అందువల్లనేనేమో స్త్రీ శక్తి యెప్పుడూ ప్రోత్సహించే శక్తిగానే వుంటుంది. acheive చేసేది పురుష శక్తి ఇంతవరకు తమ స్వార్ధంగా కాక యితరంగా ఏదో ఒక cause ('కాజ్') తనదిగా చేసుకొని ప్రయత్నించనివాడు వ్రాయవచ్చు. గంపెడు పుస్తకాలు- కాని కళా వాతావరణంలో వాటికి చాలా తక్కువ విలువ వుంటుంది. తమ జీవితాల్ని అంటక, కళకి ఏదో విషయం కావాలి కదా అని తెచ్చి పెట్టుకుని వ్రాసేవారు చాలా మంది. ఆ కారణం వల్లనే సుఖమైన పెళ్ళి, చక్కని వుద్యోగం, మర్యాదా, అధికారమూ -- చాలామంది ఆంధ్రకళాశాలులకి ఆత్మ హత్యా కారణాలవుతున్నాయి.
ఈ సూత్రాల్ని పట్టే ఏదో విధంగా వున్న పరిస్తితులకి యేదురీదని వాడు, ఎక్కడో సంఘంతోనో, ప్రజలతోనో విరోధం కల్పించుకొనివాడు గోప్పకళ సృష్టించేవాళ్ళు యిదివరకు ప్రచారంలో ఉన్న అభిప్రాయల్నే మళ్ళీ యేకరవు పెడుతో వుంటారు. మన ప్రబంధకవులూ , ఇంకా యీ నాడు మళ్ళీ భారతాలూ, రామాయణాలు, వ్రాసేవారు ఉదాహరణలు. అసలు లోకంలో మెళకువ చాలామందికి రాదు. వాళ్ళకి వృద్ది క్షయాలు లేవు. వాళ్ళ కళా అంతే. ఒక సున్నాలో చెప్పిందే చెప్పిందిగా ఒక భావం యిటూ అటూ తిప్పుతో వుంటారు.
రోమెయిన్ రోలెండు క్రిష్టఫర్ లో ఏం రాశాడంటే------
So manay men - they have no opinions ex
cept in so far as they disapprove of all enthusiastic opinion . But if a man is to be independent, he has to stand alone, and how many men are there , who are capable of that?
How many men are there even amongest the clear - sighted who will dare to break free of the bondage of certain prejudces, certain postulates which cramp and fetter all the men of the same generation? That would mean setting up a walla between themselves and othes; on the one hand freedom in the wildeness, on the other mankind. They do not hesitate. They choose mankaind, the herd. The herd is evil - smelling. but it gives warmth. Then those who have chosen pretend to think, what they do not in fact think. It is not very difficult for them. They know so little what they think! "Know thy - self" How could they, those men, who have hardly a me to know. In every collective belief, religious or social. Very rare are the men who believe, besause very rare are the men who are men. Faith is a heroic force, its fire has kindled but very few human hearts.
ఉత్సాహం గలవాళ్ళ అభిప్రాయాలు తప్పనడం తప్ప యింకో అభిప్రాయలుండవు, చాలామంది మనుషులకి స్వతంత్రంగా యోచించి అనుష్తించాలంటే ఏకాకి ఐ నుంచోవలసి వస్తుంది. ఆ శక్తి యెంత మందికి వుంది/ బాగా జ్ఞానం కలవారు కూడా ఆచారాల్ని, సామాన్య అభిప్రాయాల్ని యినాటి సంఘాల్ని సంకెళ్ళు వేసి బిగదీసే అబద్దాలని ఎదిరించగలవా రెందరున్నారు? ఎదిరించారా లోకానికి తమకి మధ్య గోడ కట్టుకుంటున్నారాన్నమాటే. ఒకవేపు ఎదారిలో స్వేచ్చ, రెండో వేపు మనుష్యజాతి ఏమో సంకోచించరు. మనుష్యజాతితో గుంపుతో చేరిపోతారు. గుంపులో చెడువాసనలు- కాని వెచ్చగా సురక్షితంగా వుంటుంది. ఇట్లా మనుషుల్లో కలిసిపోయి ఏదో గొప్పగా ఆలోచిస్తున్నట్టు సమర్ధించుకుంటో నటిస్తారు. నిజం అసలు ఆలోచనా శక్తి గాని ధైర్యం గాని లేదు, ఉన్నట్టు నటించడం సునాయాసం వారికి. వారేమాలోచిస్తున్నారో వారికే తెలీదు. "నిన్ను నువ్వు తెలుసుకో!" ఎట్లా తెలుసుకుంటారు? తెలుసుకోడానికి వాళ్ళకి ఒక నేను అనేది ఉంటేగా! ఏ ఆచారం లోనైనా , మతంలో గాని సాంఘికంగా గాని అసలు విశ్వాసం కల వారు తక్కువ. ఎందుకంటె అసలు మనుషులన తగ్గవారే తక్కువ గనక. విశ్వాసం చాలా తీవ్రమైన శక్తి. దాని అగ్ని చాలా కొద్ది మనుష్య హృదయాల్నే రగిల్చింది.
