Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 22


    
    "నాకసలు సినిమాలు చూసే అలవాటులేదు. కాని... మీతో పరిచయమయ్యాక మీ సినిమా క్యాసెట్స్ తెప్పించి చూశాను. వాటిల్లో మిమ్మల్ని చూశాను."
    
    వారిద్దరి మధ్య సంభాషణ అలా నడుస్తుండగా మాస్టర్ బెడ్ ప్రక్కనున్న రెడ్ లైటు వెలిగింది. "వా... రెడ్ లైటు" అన్నాడు మాస్టర్ అనాలోచితంగా.
    
    "యూ నాటీ!" అంది మృదుల ఆవేపునుంచి క్రింది పెదవిని నొక్కిపడుతూ.
    
    రెడ్ లైటు అంటే.... యూ నాటీ అందేమిటి మృదుల? మాస్టర్ విస్తుపోయాడు.
    
    "నాకర్ధం కాలేదు" అన్నాడు మాస్టర్.
    
    "ఇప్పటివరకు ఎందరమ్మాయిలతో ఐక్యమయిపోయారు?"
    
    "మోస్ట్ ఇన్ స్క్రూటబుల్ మీరు మాట్లాడేది నాకర్ధం కాదు."
    
    "సమాధానం కావాలి."
    
    "చాలామంది అమ్మాయిలు."
    
    "నో హిపోక్రసీ ఐ లైకిట్ యూ రియల్లీ ఎంజాయ్ విత్ దెమ్?" ఆమె కంఠంలో జెలసీ లేదు.
    
    "జస్ట్ బయోలాజికల్."
    
    "విత్ మీ?"
    
    "బోత్... మెంటల్ అండ్..." మాస్టర్ మాటలు మధ్యలోనే ఆగి పోయాయి.
    
    రెడ్ లైటు అంటే... యూ నాటీ అందేమిటి మృదుల? మాస్టర్ విస్తుపోయాడు.
    
    "నాకర్ధం కాలేదు" అన్నాడు మాస్టర్.
    
    "ఇప్పటివరకు ఎందరమ్మాయిలతో ఐక్యమయిపోయారు?"
    
    "మోస్ట్ ఇన్ స్క్రూటబుల్ మీరు మాట్లాడేది నాకర్ధం కాదు."
    
    "సమాధానం కావాలి."
    
    "చాలామంది అమ్మాయిలు."
    
    "నో హిపోక్రసీ ఐ లైకిట్ యూ రియల్లీ ఎంజాయ్ విత్ దెమ్?" ఆమె కంఠంలో జెలసీ లేదు.
    
    "జస్ట్ బయోలాజికల్."
    
    "విత్ మీ?"
    
    "బోత్... మెంటల్ అండ్..." మాస్టర్ మాటలు మధ్యలోనే ఆగిపోయాయి.
    
    రెడ్ లైటు వెలిగి ఆరిపోవటం మొదలయింది.
    
    "తరువాత కలుద్దాం."
    
    "ఏం?"
    
    "ఇప్పుడు నేను జుహూలోని ఇస్కాన్ కి వెళ్ళాలి."
    
    "మీకు దేవుడంటే నమ్మకముందా?"
    
    "తరువాత చెబుతాను. "బై" మాస్టర్ ఫోన్ ని డిస్కనెక్టు చేసి డ్రస్ చేసుకోవటం మొదలెట్టాడు.
    
                                                    *    *    *    *    *
    
    సరిగ్గా ఆరుగంటలకు మిల్లర్ ట్రెక్కర్ మాస్టర్ బంగ్లా మెయిన్ గేటు ముందాగింది.
    
    సెక్యూరిటీ గార్డ్స్ సెల్యూట్ చేసి గేటుని ఓపెన్ చేశారు.
    
    ట్రెక్కర్ ఒక్క జర్క్ తో లోపలకు దూసుకుపోయింది. మిల్లర్ ఎస్టేటులోకి ప్రవేశించినట్లు సెక్యూరిటీ స్టాప్ కి క్షణాలలో తెలిసిపోయింది.
    
    అందరూ క్షణాల్లో అలర్ట్ అయిపోయి ఎవరి పొజిషన్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
    
    మిల్లర్ ని చూస్తే కమెండోస్ భయంతో చమటలు పట్టేస్తాయనటం అతిశయోక్తికాదు.
    
    మిల్లర్ ట్రెక్కర్ దిగి బంగ్లాకేసి నడకసాగించాడు.
    
    ట్రెక్కర్ వెనుక నెమ్మదిగా ఫాలో అయింది.

    లోపల టై కట్టుకుంటున్న మాస్టర్ మెరూన్ కలర్ బల్బు వెలగటం చూసి ఉలిక్కిపడ్డాడు.
    
    మిల్లర్ వచ్చేశాడన్న మాట.
    
    క్షణాల్లో డ్రస్ చేసుకోవటం పూర్తి చేసి మెయిన్ హాల్లోకి వచ్చాడు.
    
    అప్పటికే అక్కడికి మిల్లర్ వచ్చేశాడు. మాస్టర్ మిల్లర్ కి వినయంగా సెల్యూట్ చేశాడు. మిల్లర్ ముఖం గంభీరంగా వుంది.
    
    "మీ మదర్ తో ఒకసారి మాట్లాడాలి. ఇప్పుడు కాదు తరువాత...ఒక్కక్షణం" అంటూ మిల్లర్ మాస్టర్ బెడ్ రూమ్ కేసి దారితీశాడు.
    
    మిల్లర్ వెనుకే బయలుదేరాడు మాస్టర్.
    
                                                       *    *    *    *    *
    

      6-05 పి.యమ్.
    
    జోహ్రా సూట్ కేసుతో దేవానంద్ ఇంట్లోకి ప్రవేశించగానే జోహ్రా దగ్గర పదివేలు తీసుకున్న గేట్ మెన్ గేటుకి యధావిధిగా తాళం వేశాడు.
    
    ఇంటి ఆవరణ నిశ్శబ్దంగా వుంది.
    
    జోహ్రా అడుగు పడ్డప్పుడల్లా ఎండుటాకులు నలిగిన శబ్దం వినిపిస్తోంది.
    
    నియంత్రించిన రోబోట్ లా నడుచుకుంటూ వెళ్ళి సూట్ కేస్ ని మామిడిచెట్టు మొదట్లో వుంచి, దాన్ని ఓపెన్ చేసి ప్లాస్టిక్ రోప్ ని, గ్రీజ్ టిన్ ని బయటకు తీసి దాన్ని యధావిధిగా మూసివేసి, అరచేతులకు మట్టి రాసుకొని జరజరా చెట్టుపైకి పాకేశాడు జోహ్రా.
    
    గేటు దగ్గరున్న వాచ్ మెన్ కి అప్పటికే చెమటలు పట్టేశాయి.
    
    ఏదో ప్రమాదం జరగబోతోంది.
    
    అది జరిగి రేపు పోలీసులు వచ్చి తనను నిలదీస్తే...?
    
    కేవలం డబ్బుకోసమే ఆ వాచ్ మెన్ జోహ్రాకి లొంగలేదు. జోహ్రా ఆకారాన్ని అతని కళ్ళల్లో తొంగిచూసిన క్రౌర్యాన్ని చూసి వణికిపోయి గేటు తెరిచాడు.
    
    అతను భయం భయంగా బల్లిలా చెట్టుపైకి పాకుతున్న జోహ్రాని చూస్తూ స్థాణువైపోయాడు.
    
    జోహ్రా తనకు అనువైన స్థలం కోసం రెండు నిమిషాలు శోధించి చివరకు ఒక కొమ్మను ఎన్నుకున్నాడు.
    
    వెంటనే దానికి ప్లాస్టిక్ రోప్ ని కట్టి కిందకు జారవిడిచాడు.
    
    దాని రెండో చివర వెళ్ళి నేలను తాకింది.
    
    దాన్ని చూసి సంతృప్తి పడిన జోహ్రా దాన్ని బిరబిరా పైకి లాగేసుకొని గ్రీజ్ టిన్ ని ఓపెన్ చేసి గ్రీజ్ ని ఆ రోప్ కి పామేశాడు.
    
    చెట్ల ఆకుల సందుల్లోంచి రూట్ నెంబర్ టూని, విక్టరీ కోర్టు అపార్టుమెంట్సుని, చందనా థియేటర్ ని చూసుకున్నాడు.    
    
    ఆ వెంటనే రెండు గుప్పిళ్ళతో రోప్ ని పట్టుకుని ఊపిరితిత్తుల నిండా గాలిని నింపుకొని శరీరాన్ని క్రిందకు జారవిడిచాడు.
    
    కేవలం కొద్ది క్షణాల్లో క్రిందకు జారిపోయాడు.
    
    "ఓన్లీ... ఫోర్ సెకండ్స్" అని తనలోతానే అనుకొని చేతులకి అంటిన గ్రీజ్ ను మానుకి రాసేసి తిరిగి సూట్ కేసుని ఓపెన్ చేశాడు.
    
                                                           *    *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS