Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 20


    3-30 పి.యమ్.
    
    సిగ్నల్ మెన్ తన కవసరమయిన వస్తువులతో విక్టరీ కోర్టు అపార్టుమెంట్స్ కేసి బయలుదేరాడు. అతనప్పుడు ఓవర్ హెడ్ వాటరు ట్యాంక్ బాగుచేసే డ్రస్ లో ఉన్నాడు.
    
                                                 *    *    *    *    *
    
    3.45 పి.యమ్.
    
    కేరళ నెంబర్ ప్లేట్సు బిగించి ఉన్న రెండు అంబాసిడర్ కార్లు పెట్రోలు నింపుకొని, జుహూ చందనా థియేటరు కేసి సాగిపోయాయి.
    
                                                 *    *    *    *    *
    
    మృదుల....
    
    ముఫ్ఫైఆరు సంవత్సరాల ముద్దుగుమ్మ....హిందీ చలనచిత్ర రంగాన్ని, ప్రేక్షక ప్రపంచాన్ని తన అనితర సాధ్యమైన హావభావాలతో అనూహ్యమైన ప్రభావానికి గురిచేసిన అత్యద్భుతమైన నటీమణి.
    
    ఆమెకు తల్లి ఉంది.
    
    తండ్రీ ఉన్నాడు.
    
    కాని నాన్న అని పిలవటానికి అతనికి చట్టపరమైన తండ్రి హోదా లేదు.
    
    ఫలానా వ్యక్తి తన తండ్రి అనే భావాన్ని ఆసరా చేసుకొని, తను మిడ్ నైట్ చైల్డ్ కాదని..... తను తన తల్లికి అక్రమంగా పుట్టలేదనే ఆత్మవంచనను తన అంతరాత్మకు కవచంగా తొడుక్కుని, కసిగా ఏదో సాధించాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలనే ఓవర్ ఏంబిషియన్ తో పైకి వచ్చిన అందాల నటి మృదుల.
    
    ఆమె నల్లగా ఉంటుంది.
    
    అందంగా ఉంటుంది.
    
    అవయవ సంపద తీర్చి దిద్దినట్లుంటుంది. 5 అడుగుల ఆరంగుళాల ఎత్తులో పోత పోసిన చిత్తరువులా ఉంటుంది. ఆమె కళ్ళలో ప్రేమ ఎప్పుడూ తొణికిసలాడుతూ వుంటుంది.
    
    కాంక్ష ఎప్పుడూ తొంగి చూస్తుంటుంది. అమృతాన్ని ఆలపింపజేసే అనురాగ ఝరి. ఆమె కళ్ళ అంచుల్లో, కనురెప్పల మాటున పొంగి పొరలుతుంటుంది.
    
    ప్రపంచంలో ఎప్పటికీ చెరగనిది, చేదు ఎరుగనిది, అలసిపోనిది, అనుక్షణం తలపింపజేసేది, అనూహ్యమైన స్పందనను పుట్టించేది ప్రేమ ఒక్కటే అనుకొని, దానికోసమే బ్రతుకుతున్నట్లుగా కనిపిస్తుంది.
    
    ఆమె పంచ ప్రాణాలు వేరు...
    
    ఒకటి తను... తనలోని ఆత్మవిశ్వాసం....
    
    రెండు.... తను ఏదైనా సాధించగలననే స్థయిర్యం.
    
    మూడు ప్రేమ.... ఎప్పుడూ ప్రేమిస్తూ ప్రేమకు మాత్రమే స్పందించటం....
    
    నాలుగు.... తన అందాన్ని, యవ్వనాన్ని కాపాడుకోవటం....
    
    ఐదు.... ఈ ప్రపంచంలో ఏ మగాడైనా తనంతగా ప్రేమించగలడా అనే అన్వేషణ...
    
    కోలమొహం.... కారుమేఘం లాంటి, కమ్మని కలల్ని సృష్టించగల చిక్కని, చక్కని చీకటిలాంటి పొడవైన జుత్తు...
    
    అమాయకత్వం, మంకుతనం, మృదుత్వం, పరిపూర్ణత్వం, అమెచ్యూరిటీ, ఎప్పుడూ దేనికోసమో అన్వేషిస్తున్నట్లు, దానికోసమే పరితపిస్తున్నట్లుగా కనిపించే చంచలమైన, లోతైన చూపులు.... బ్రీత్ టేకింగ్ బ్యూటీ.... మోస్ట్ బ్యూటీఫుల్ వుమెన్ ఆఫ్ ది ఫిల్మ్ వరల్డ్...
    
    ఆమె గురించి కలలు కానని మేల్ ఆర్టిస్టు (ఫిల్మ్) లేడు- ఆమెను పెళ్ళి చేసుకోవాలనో, ప్రేమించాలనో ఆలోచనలు లేని ప్రేక్షకుడు లేడు.
    
    ఆమెకోసం... కేవలం ఆమెకోసం ఆమె నటించిన పరమచెత్త సినిమానయినా చూసేందుకు కోట్లాది అభిమానులు సిద్దంగా ఉంటారు.
    
    ఆమె కళ్ళు ఎప్పుడూ, బాహ్య ప్రపంచంలోనయినా....నిశ్చలన ఛాయా చిత్రంలోనైనా నిజమైన ప్రేమికుడి కోసం గ్లాన్స్ చేస్తుంటాయి. ఆ చూపులకు తాము చిక్కితే బావుండనే డ్రీమర్స్ ఎందరో....
    
    షి వన్ ది సెంటర్ ఆఫ్ సోమెనీస్ డ్రీమ్ వరల్డ్...
    
    స్కూళ్ళలో, కాలేజీలో చదివే నూనూగు మీసాల యువకుల ఎడోల్ సెంట్ ప్రపంచానికి, పూర్తి యౌవనంలోకి అడుగిడిన యువకుల సెక్సువల్ ఫేంటసీలకి ఆమె కేంద్ర బిందువు.
    
    లొకేషన్స్ లో సినిమా యూనిట్ సభ్యులు ఆమెకు దగ్గరగా గడపటం కోసం, ఆమెను ప్రత్యక్షంగా చూడటం కోసం తమ వృత్తి మీదనే ప్రేమను పెంచుకొంటారు.
    
    ఆమెను మూగగా, మౌనంగా ప్రేమించి, ఆరాధించే పిరికి ప్రేమికుల్లో ఆమె సమక్షాన్ని ఆశించి ఆమెతో సినిమాలు నిర్మించిన వారున్నారు.
    
    అందం, ఆకర్షణ, తెలివితేటలు, మెచ్యూరిటీ, ఉరకలు వేసే యవ్వనం, ఉత్తుంగ తరంగాలకు ఓనమాలు నేర్పేలా కనిపించే ఆమె కళ్ళు... వెరసి ఎందరి యువకుల కలల్ని వెట్ నెస్ కి గురిచేసిందో చెప్పటం కష్టం.
    
    నటనలో తన సహచరుల్ని సునాయాసంగా డామినేట్ చేస్తుంది.
    
    మరీ ప్రేమ సన్నివేశాల్లో- ఆమె కనబరిచే ఫెర్ ఫార్మెన్స్ కి మైమరచి పోతుంటారు ఎవరైనా.
    
    ఆమె లాంటి ప్రియురాలు, భార్యగా దొరికితే తన జన్మ ధన్యమవుతుందని ఎంతమందో భావిస్తుంటారు.
    
    ఆమె ఫలానా అనే గుర్తింపును ఆమె తన ఇరవైయేళ్ళ వయసులోనే తెచ్చుకొన్నది.
    
    అప్పటికి- ఇప్పటికి పదహారేళ్ళ వయస్సు తేడా ఉన్నా కాలం ఆమెలో శారీరకంగా ఏ మార్పులు తేలేక ఓడిపోయింది.
    
    మానసికంగా అయితే ఆమె కాలాన్ని ఎప్పుడో వెనక్కి నెట్టేసింది.
    
    ఆమె సరసన సూపర్ స్టార్స్, ఎవర్ గ్రీన్ హీరోస్, ఏజ్డ్ హీరోస్, యంగ్ హీరోస్ ఎందరో నటించారు.
    
    ఆ అందరికి ఆమె ఓ ఎనిగ్మా... ఆమె వెనుక ఇప్పుడు కోట్లు ఉన్నాయి.
    
    నగలున్నాయి వజ్రవైఢూర్యాలున్నాయి. బొంబాయి మహానగరంలో అత్యంత విలాసవంతమైన బంగ్లా ఉంది. ఆ బంగ్లాకి ఎప్పుడు అరడజను మంది సెక్యూరిటీ గార్డ్స్ కాపలా కాస్తుంటారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS