Previous Page Next Page 
అభిలాష పేజి 2

    అరుగు మధ్యలో చెక్క తాపడం వున్నది. దాని ప్రక్కనే లేవర్ వుంది. ఖైదీ చెక్క తలుపుమీద నిల్చొనివున్నాడు. అతడి మెడకి ఉరితాడు బిగించబడింది. అంతా నిశ్శాబ్దంగా, మావుకానికల్ గా జరుగుతూంది.
   
    సరీగ్గా ఓంకో అయిదు సెకన్లలో మరణం సంభవించపోతూంది. మొహానికి కప్పివున్న నల్లటి గుడ్డ వెనుకనుంచి చీరంజీవి తండ్రీ బిగ్గరగా అరిచేడు.
   
    "న్యాయస్థానం గుడ్డిది, చట్టం చెవిటిది. ఈ హత్య  నేను చేయలేదు... చేయలేదు."
       
   
                       *    *    *    *   
   
    కెవ్వున కేక పెట్టాడు ఛీరంజీవి. "అత్యిపోయింది బాబాయ్! అయిదయిపోయింది. నాన్నని చంపేస్తున్నారు వాళ్ళు. అమ్మా చచ్చిపోయింది నాన్నా చచ్చిపోతున్నాడు....."

   
    బాబాయ్ ఇక అపుకోలేక "మీ నాన్నా కాదురా మీ అమ్మను చాపింది, నేను !" అని అరిచాడు. బాబు స్థాణువయ్యాడు " అవున్రా, మీ అమ్మా తప్పుచేసిందనీ, పతితురాలనీ జీవితాంతం కుమిలి పోనఖ్ఖర్లేదోరేయ్ నువ్వు! మీ అమ్మ పతివ్రతరా _ మీ అమ్మా పతివ్రత. నేనే ...... నేనే నీచుణ్ణీ. ఒంటరిగా వుండటం చూసి కబళించాలనుకున్నాను."
   
    బాబు దుఃఖం మర్చిపోయాడు. ఊహించలేని ఆ నిజం ఆ పన్నెండేళ్ళ కుర్రవాణ్ణి నిశ్చేష్టుడిని చేసింది. అతడి బాబాయ్ గుండె పట్టుకుని కూలిపోయాడు.
   
    "బతిమాలిందిరా  మీ అమ్మ, కాళ్ళు పట్టుకుని వేడుకుంది. అపరకాళి అయి కత్తిపీత తీసుకుంది. అయినా పశుబలం ముందు ఒడిపోయింది. ఆ ఓటమిలో ప్రాణాలర్పించింది. ఒక్కక్షణం ముందొచ్చిన నాన్న ఇంకోలా   వూహించి  ఆవేశంతో వూగిపోయాడు. ఆ ఆవేశాన్ని నేను ఇంకోలా వుపయోగించుకున్నాను. నేరాన్ని మీ నాన్న  మీదకి తిప్పెను. నీకు తల్లి లేకుండా చేశాను, తండ్రీని లేకుండా చేశాను. కానీ వొరేయ్.... మనిషిని పాపం వెంటాడుతూనే వుంటుందిరా, నిదర్శనం నేనే...." అతడు మేలికలి తితుగుతున్నాడు.... "ఈ క్షోభ నేను భరించలేను, ఇది నన్ను మింగేస్తూంది..... నేను_ నె_ను" ఆ తరువాత గొంతులోంచి మాటలు రాలేదు ఎవరో నొక్కినట్టూ ఆగిపోయాయి. తెరచి వున్న కళ్ళు అలాగే స్థిరమై పోయేయి. గుండెమీద నుంచి చెయ్యి కిందికి జారిపోయింది.
   
                      *    *    *    *   
   
    "మనిషిని చంపే హక్కు సాటి మనిషికి లేదు. బ్రతికితే బైటపడే నిజాన్ని చంపి శాశ్వితంగా పాతిపెడతారు.....  ఈ శిక్ష రద్దుచేయాలి!"
   
    లివర్ కదులుతున్న చప్పుడు.
   
    ఆ చప్పుడుని మింగేస్తూ అతడి కంఠం జైలు గోడలు కంపించేలా ప్రతిద్వనిస్తూంది.
   
    "ఉరిశిక్షని రద్దు చెయ్యాలి. ఉరిని రద్దు చెయ్యాలి."   
   
    లివరువెళ్ళి కాళ్ళకింద తలుపు తాలూకు కొక్కాన్ని రిలీజ్ చెయ్యటంతో దబ్ మన్న శబ్దం తలుపు కిందకి దిగిపోయింది. శరీరం గాలిలో వేలాడగానే మెడకి ఉరి బిగుసుకుంటుంది. సెకండ్, స్ల్పిట్ సెకండ్.           
   
   
    "ఉరిని రద్దు చెయ్యండి. అదే నా ఆఖరి కోరిక. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ మూడొందల రెండుని రద్దుచేయండి. ఇదే నా అఖ....."   
   
   
    టఫ్ మన్న చప్పుడుతో అతడి వెన్నెముక పై బాగం మెడ దగ్గర విరిగిపోయింది. పాంటులో స్పెర్మ్ రిలీ జయింది. ప్రపంచంలో వున్న విధానాల్లో కెల్లా అత్యంత సులభంగా చావుని సంపాదించి పెట్టె విధానం ...... మెడకి ఉరివేసి చంపటం.... తాడు ముడి మేడని విరగకొట్టగానే సెకనులో స్పృహా తప్పిపోతుంది. స్పెర్మ్ రిలీజ్ అవటంతో అది అత్యంత సంతృప్తికరమైన మరణంగా అతడిని పైలోకాలకి తీసుకుపోతుంది.
   
    అతడి శరీరం లోపలికి వెళ్ళిపోగానే అక్కడ ఒక్కసారిగా 'స్' మన్న శబ్దం వచ్చింది. అప్పటివరకూ బిగపట్టిన వూపిరి అంతమందీ ఒక్కసారి వదలటం వలన వచ్చిన శబ్దం అది. ఎంత అనుభవపూర్వకంగా చేసినా ఆఖరి క్షణం వరకూ టెన్షనే. ఆ తరువాత నాలుగైదు రోజుల వరకూ ఆ దృశ్యం కళ్ళముందు కదలాడుతూనే వుంటుంది. ముందే మరణం తెలిసిన మనిషి వృద్ధుడు కాడు. మృత్యువుతో పోరాడటానికి డాక్టరు వుండడు. బేలగా చూస్తూ చుట్టూ బంధువులుండరు. చీకటి గదిలో ఒంటరితనం, నిశ్శబ్దంగా నడుచుకుంటూ ఉరికంబం దగ్గరికి రావటం, అనుభజ్ఞడైన డాక్టర్ ఆపరేషన్ చేసినట్టూ అతడి మెడకి ఉరి బిగించి ప్రాణాలు తీయటం.  
   
    ఎవరిచ్చారు ఆ అధికారం? కళ్ళులేని, చెవులూ సరిగ్గాలేని ఈ న్యాయస్థానానికి _ బ్రతకటం మనిషి హక్కుగా నిర్ణయిస్తూ మనం రాసుకున్న కాన్ స్టిట్యూషన్ వ్యతిరేకంగా  ఉరి తీసేహక్కు !
   
    అతడి శరీరం అరగంటపాటు అలాగే వుంచబడింది. తరువాత డాక్టరు పరీక్షించి మరణాన్ని ధ్రువీకరించాడు. సూపరింటేండెంట్ కాగితాల్లో తన నిర్వర్తించినట్టు వ్రాసుకుని ఫైలు మూసేసేడు. ఉరి స్థంబపు అడుగు లోతుల్లోంచి మాత్రం.... ఒక ఆత్మ _ శరీరంలో కొట్టుకుని కొట్టుకుని అప్పుడే బైటకి పచ్చి __ ఎలుగెత్తి అరుస్తూన్నట్టూ వుంది__
   
    "ఉరిశిక్ష రద్దు చేయండి..... ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ని మార్చండి _" అని__
   
    ఇది జరిగి పన్నెండు సంవత్సరలైంది.
   
                                1
   
    "పాలు తక్కువ వేసి ఒక కాఫీ. పంచదార కూడా తక్కువగానే వుండాలి. అలా అంన్చెప్పి _" చీరంజివి  మాటలు పూర్తీ కాలేకో. "షుగర్ తక్కువ స్ట్రాంగ్ కాఫీ ఓటీ" అని అరిచి సర్వర్ అక్కణ్ణుంచి వెళ్ళిపోయేడు హాడవిడిగా.
   
    చీరంజివి బక్కచిక్కి పోయాడు. తన మాట అతడు పూర్తిగా విననందుకు. అయినా వెళ్ళిపోతున్న సర్వర్ ని ఆరాధనా పూర్వకంగా చూశాడు. ఎంత గట్టిగా అరిచేడు? ఇంతమంది జనం మధ్యలో ఎవర్నీ పట్టించుకోకుండా ఎంత కమేండింగ్  గా___
   
    ఇంతలో వెయిటర్ స్ట్రాంగ్ కాఫీ తెచ్చి బల్లమీద పేట్టి వెళ్ళిపోయాడు.
   
    అప్పుడు కదిలింది ముక్కులో ఏదో. స్థాణువై ___ నిశ్చేష్టుడై __ ఆగిపోయేడు. తనకు తుమ్ము రాబోతూందని అర్ధమైంది.        


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS