Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 9

    రాత్రి ఎనిమిది గంటలకు విశాఖపట్నం బస్సు కాంప్లెక్సులో జనార్ధనంతోపాటు బస్సు దిగింది అర్చన.
    ఆమె బస్సు  ఎక్కడం అదే మొదటిసారి. పరిసరాలను వింతగా చూడసాగింది. తన గ్రామం అంత బస్ స్టాండ్ ని అక్కడా హడావుడిగా తిరుగుతున్న జనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అటువంటి ప్రదేశం ఒకటి ఉంటుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. సంచి గుండెలకు హత్తుకుని బెదురు కళ్ళతో చూడసాగింది. ఆ జనంలో తను తప్పిపోతాననే భయంతో గబ గబా వెంట నడుస్తోంది.
    ఇద్దరూ రిక్షాలో ఒక మేడ దగ్గరకు చేరుకున్నారు. జనార్దనం లోపలకు వెళ్ళి మాట్లాడి వచ్చాడు. అర్చనని తీసుకుని మేడపైకి నడిచాడు కొంతమంది మగవాళ్ళు తనవంక అదోలా చూడటం ఆమె గమనించింది. జనార్దనం ఒక గదిలోకి ఆమెను తీసుకువెళ్ళాడు. ఆ గదిలో రెండు మంచాలు ఉన్నాయి. వాటిపైన లావుపాటి పరుపులు, దానిపైన తెల్లటి దుప్పటి పరచి ఉంది. పైన ఫ్యాన్ తిరుగుతోంది.
    జనార్దనం ఆ గదిలోనే ఉన్న ఓ గది తలుపు తెరుచుకొని లోపలకు వెళ్ళాడు. పది నిమిషాల తరువాత మొహం కడుక్కుని వచ్చాడు. తనతో తెచ్చిన బ్యాగ్ తెరిచి టవల్ తీసుకుని టవల్ తీసుకుని మొహం తుడుచుకున్నాడు. ఒక పొట్లం తీసి అర్చనకిచ్చి చెప్పాడు.
    "ఇందులో రొట్టె ఉంది. నేను పనిమీద బయటకు వెళుతున్నాను. లోపలకు ఎవరూ రాకుండా బయట తాళం పెడతాను...."
    ఆమె సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు.
    చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయింది అర్చన. అటువంటి చోట తను ఉండగలదా? ఆ నగరం ఓ మాయా ప్రపంచంలా కనిపిస్తుంది. తన ప్రయాణం గురించి తలుచుకుంటూ జనార్దనం కోసం ఎదురు చూసింది. అతనిచ్చిన పొట్లం విప్పి అందులోని రొట్టె తింది. నీళ్ళు త్రాగి మంచంపైన నడుం వాల్చింది. జనార్దనం వచ్చేవరకూ మేలుకుని ఉండాలనుకుంది. కాని వెంటనే నిద్రలోకి జారిపోయింది.
    తను ఖరీదైన బట్టలు తొడుక్కుని పెద్ద భవనంలో ఉంది. ఎప్పుడూ చూడని కొత్త మనుషులు తనని ఎంతో ప్రేమగా చూస్తున్నారు. జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నట్టు కల.
    హఠాత్తుగా కల చెదిరింది. గాలి కరువైనట్టు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. ఎవరో, తన శరీరంలో ఎక్కడో ఏదో చస్తున్నారు. ఎన్నడూ అనుభవించని ఓ వింత స్పర్శ. ఏం జరుగుతోంది? అతి కష్టమ్మీద కళ్ళు తెరిచి చూసింది. చీకటిగా ఉండటం వాళ్ళ ఏం కనిపించలేదు. తన మీద ఏదో వస్తువు ఉన్నట్టు శరీరం బరువుగా ఉంది. అంతే కాదు తన శరీరం మొత్తం లయబద్దంగా కదులుతోంది. కాళ్ళు రెండూ దగ్గరకు చేర్చడానికి ప్రయత్నించింది. స్వాదీనం కాలేదు.
    గొంతు పెగుల్చుకొని బిగ్గరగా అరవబోయింది. హఠాత్తుగా ముక్కు దగ్గర సారావాసన వచ్చింది. మరుక్షణం ఆమె నోటికి ఏదో అడ్డం పడింది. ఏం జరుగుతున్నదో స్పష్టంగా అర్ధమయింది అర్చనకి. ఇప్పుడు అరిచినా, గొడవచేసినా ప్రయోజనం లేదు. జరగాల్సిన దారుణం జరిగిపోయింది.
    కొన్ని నిమిషాల తరువాత పైనున్న ఆకారం ప్రక్కకు దొర్లి ఆయాసం తీర్చుకోసాగింది.
    అర్చన కళ్ళ నుండి కన్నీటి చుక్కలు జారి దుప్పటి మీదపడ్డాయి. శరీరంపైన చీమ ప్రాకినా మేలుకునే తను ఒక మగవాడు తన శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకునేవరకూ నిద్ర లేవకపోవడమేమిటో ఆమెకు అర్ధం కాలేదు. అతని చెయ్యి ఆమె చాతి మీద పడింది. ఆ చేతిని విసిరికొట్టింది. ఒక కత్తి అందుబాటులో వుంటే ఆ చేతిని నిస్సందేహంగా నరికి ఉండేది.
    మరునాడు ఉదయం ఏమీ జరగనట్టు మాట్లాడటానికి ప్రయత్నించాడు జనార్దనం. పది గంటలకు ఒక యింటికి తీసుకెళ్ళాడు. అది వ్యభిచార గృహమని, జనార్దనం తనని అమ్మేశాడని సాయంకాలానికి గాని అర్ధం కాలేదు.
    అది రాజమ్మ కంపెనీ.
        *    *    *    *
    కాలాన్ని జయించాలని మనిషి ప్రయత్నిస్తుంటే, కాలం మాత్రం ఎప్పుడూ తన ఆధిక్యాన్ని నిలుపుకుంటోంది. వెలిగిపోతూన్న ఆటగాడు కళాకారుడు కాలప్రభావంచేత చరిత్రలో కలిసిపోతాడు. మనిషి అంతా అయిపోయిందనుకున్నప్పుడే కీలకమైన జీవితం ప్రారంభం కావచ్చు. అసలైన జీవితం మొదలైనప్పుడే అంతా అయిపోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి మనిషి ప్రయత్నిస్తాడు. జీవితం నిండా ఎన్నో విచిత్రాలు, ఎంతో వైవిధ్యం.
    జీవితాన్ని శాసించడం చాలా కష్టం.
    జీవితంలో విలువయిన భాగాన్ని నష్టపోయిన తరువాత అర్చన చాలా విషయాలు తెలుసుకుంది.
    తన అక్రమ సంబంధాన్ని అర్చన చూసిందని గ్రహించిన కాంతం ఒక పథకం ప్రకారం జనార్ధనంతో పంపింది. కాంతం ఇచ్చిన రొట్టెలో జనార్దనం మత్తుమందు కలిపాడు. అది తిని వొళ్ళు తెలియకుండా నిద్రపోతున్న తనని అతను అనుభవించాడు. అంతేకాదు, ఆ రోజు తను కంగారులో గమనించలేదని కాంతంతో పడుకున్న వ్యక్తి జనార్ధనమేనని కూడా తెలుసుకుంది. తను ఎంతదారుణంగా మోసపోయిందీ తెలుసుకునే సరికి సమయం మించిపోయింది.
    రాజమ్మ కంపెనీకి వచ్చిన తరువాత మూడు రోజులపాటు తీవ్రంగా ప్రతిఘటించింది. గాయబడి నాలుగు రోజులపాటు కదల్లేక పోయింది. ఎదురుతిరిగిన ఆడదాన్ని లొంగదీసుకోవడానికి మగవాడు ఉత్సాహం ప్రదర్శిస్తాడని అప్పుడే తెలుసుకుంది. ఆ తరువాత ప్రతి ఘటించడం మానుకుంది. జీవితం పైన  విరక్తికలిగి తను బ్రతకడం అనవసరమనే నిర్ణయానికొచ్చింది.
    తన నిర్ణయాన్ని అమలు చెయ్యడానికి కూడా ఆమెకు కాలం కలిసి రాలేదు. ప్లగ్ లో వ్రేళ్ళు ఉంచింది. షాక్ తగిలి ఫ్యూజ్ పోయింది. షాక్ వల్ల కలిగిన నీరసం తగ్గడానికి రెండు రోజులు పట్టింది. తిరిగి అదే ప్రయత్నం చెయ్యడానికి మనసు అంగీకరించలేదు. ఆమెపైన నిఘా ఎక్కువయింది. దూకి ప్రాణం తీసుకోవడానికి నుయ్యి లేదు. ట్రైన్ క్రింద పడటానికి బయటకు వెళ్ళనివ్వరు. విషంతో తేలిగ్గా చావొచ్చు. అయితే విషం ఎలా దొరుకుతుంది.
    చివరికి ఉరిపోసుకుని చావాలని అనుకుంది. దానికి తాడు కావాలి' చీరని తాడుగా ఉపయోగించవచ్చునని గ్రహించి ఆవకాశం కోసం ఎదురుచూడసాగింది.
    అప్పుడే అర్ధమయింది జీవితం విచిత్రమైనదని.
    ఓకే సమయంలో ఓకే దారిలో ప్రయాణం చేస్తున్న ఇద్దరూ బాటసారులు స్నేహితులు కావడం సహజం. చాలా మామూలుగా ప్రవేశించాడో వ్యక్తి, చావడానికి ముహూర్తం పెట్టుకున్న సమయంలో అర్చన జీవితంలోకి.
    అతను అవినాష్.
                                                                *    *    *    *    
    పదోసారి వాచీ చూశాడు అవినాష్.
    అక్కడ నుంచి బయలుదేరడానికి అరగంటపైనే ఉంది సమయం. అసహనంగా కదిలాడు. ఎదురుగా సముద్ర జలాల్లో ఉయ్యాల మాదిరిగా కదులుతున్న బోట్ పైన అతని దృష్టి నిలిచింది. ఎప్పుడూ స్నేహితునిలా కనిపించే ఆ బోట్ ఇప్పుడు శత్రువులా కనిపిస్తోంది. అతని మనస్సులో అటువంటి భావం కలగడానికి కారణం, నైట్ పెట్రోలింగ్ పార్టీ ఇన్ చార్జ్ గా ఆ బోట్ లోనే వెళ్ళి ఉదయం తిరిగొస్తాడు. అలా వెళ్ళడం అతనికి ఎంతమాత్రం ఇష్టంలేదు.
    అతనికి ఇరవై రోజుల క్రితం వివాహమయింది. ఉదయం శెలవు నుండి వచ్చి రిపోర్టు చేశాడు. నైట్ పెట్రోలింగ్ కి రమ్మని చెప్పారు. శెలవు నుండి వచ్చిన వాళ్ళకి అలా డ్యూటీ చెప్పడం సహజమే. భార్యని క్వార్టర్ లో వదలి డ్యూటీకి రావడం అతని మనసు స్వాధీనం తప్పడానికి కారణం.
    అతని భార్య పేరు శిల్ప. ఆ పేరుకి తగ్గట్టు ఆమె అజంతా శిల్పంలా ఉంటుంది. ఆమెతో పరిచయం అతనికి కాకతాళీయంగా జరిగింది. స్నేహితుని బలవంతం మీద ఒక పార్టీకి వెళ్ళాడతను. దేశంలో అతిపెద్ద స్మగ్లింగ్ ముఠా రవాణా చేస్తున్న వస్తువులు పట్టుకోవడం ద్వారా కస్టమ్స్ శాఖలోనూ, నావల్ డిపార్ట్ మెంట్ లోను అతని పేరు మారుమ్రోగింది. అందుకే పార్టీ ఏర్పాటుచేసిన నావికాదళ ఉద్యోగి అతని రాకకి సంతోషించాడు.
    అతను తన ప్రక్కనే నిలబడ్డ కూతుర్ని పరిచయం చేశాడు. అవినాష్ ని చూసిన మరుక్షణం ఆమె కళ్ళు మెరవడం అతను గమనించాడు. ఆమె నవ్వుతూ అవినాష్ ని విష్ చేసింది.
    కొన్ని క్షణాలపాటు అవినాష్ మెదడ్ని చీకటి ఆవరించింది. అతి కష్టంపైన ఆ స్థితి నుండి తేరుకున్నాడు. ఇంతలో ఎవరో అతిథులు రావడం వల్ల వాళ్ళ దృష్టి అటు మళ్ళింది. అవినాష్ కి ఆమెతో మాట్లాడే ఆవకాశం రాssలేదు. పార్టీలో ఎక్కడున్నా అతని కళ్ళు మాత్రం ఆమెనే గమనించసాగేయి. పార్టీ పూర్తయ్యేసరికి ఆమె చుట్టూ తన ఆలోచనలు తిరుగుతుండగా ఇంటికి చేరాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS