Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 4

 

    ఒక నిమిషం అలోచించి ఆ ఇంటిని చుట్టి వెనుక వైపుకు వెళ్ళాడు. నాలుగు అడుగులు మాత్రమే వున్న పిట్టగోడను దాటి దొడ్డి తలుపును సమీపించాడు.
    రెండు రెక్కల మధ్యన ఉన్న ఖాళీలో సన్నటి పుల్లను లోపలకు దూర్చి చెక్క గడియను యీతడంలో తలుపులు తెరచుకున్నాయి.
    చప్పుడు కాకుండా తలుపును దగ్గరకు లాగి లోపల గదివైపు నడిచాడు. ఆ గది కిటికీ లో గుండా అవతల గదిలో జరుగుతున్నాడు స్పష్టంగా కనిపిస్తుంది.
    సుందరం రెప్పవేయడం కూడా మర్చిపోయి చూడసాగాడు.
    బ్లూ బెడ్ లైట్ కాంతిలో రెండు శరీరాలు ఏకమై - బెడ్ పై ఒకరి నొకరు అలుముకుపోయి వున్న దృశ్యం అది.
    కోరికలతో రగిలిపోతున్న ఆ యువతి స్వప్న.
    ఆమె కౌగిలిలో ఒదిగిపోయి వున్న వ్యక్తీ ఎవరో స్పష్టంగా కనిపించడం లేదు.
    పరువంతో పిటపిట లాడుతున్న శరీరాన్ని తన్మయత్వంతో అతనికి అర్పించుకుంటున్న శృంగార దృశ్యం అది.
    సుందరం చివ్వున వెనుదిరిగాడు.
    ఎలా వచ్చాడో అలానే రోడ్ మీదకు వచ్చి అడుగులు వేస్తున్నాడు. అన్నమాటే గానీ, అతని కన్నుల ముందు ఆ దృశ్యమే మెదులుతున్నది.
    పున్నమిరోజు పరిసరాలను మరచిపోయిన నాగుపాములు రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ పెనవేసుకుపోయి ఎలా పొర్లి గింతలు పెడుతుంటాయో. అలా ఇద్దరూ ఒకే శయ్యపై సుఖ భోగాలను అనుభవిస్తున్నారు.
    ఆ దృశ్యం జ్ఞప్తికి రావడంతో సుందరం మనస్సు అంతా అదోలా అయిపొయింది.
    తన స్నేహితుని భార్య స్వప్న చాటుమాటు వ్యవహారం చేస్తున్నదని వినడమే తప్ప ఎప్పుడూ కంట పడలేదు.
    ఆమె భర్త వచ్చి ఇంటి తలుపు తట్టి .....లోపల దృశ్యం చూడడం జరిగితే అతని రియాక్షన్ ఎలా వుంటుందో ....ఏం చేస్తాడో వూహిస్తూ అడుగులు వేస్తున్నాడు సుందరం.
    ఎదురుగా పోలీస్ స్టేషన్....
    డ్యూటీకి వెళ్ళవలసిన టైం కావడంతో అంతటితో ఆలోచనలకు బ్రేక్ వేసి రైల్వే పోలీస్ స్టేషన్ వైపు నడిచాడు కానిస్టేబుల్ సుందరం.
    

                                                    *    *    *

    "గొనె పట్టాలో శవం .....గురించి.
    అప్పటి గత నాలుగు రోజులుగా న్యూస్ పేపర్లలో ప్రకటన ఇస్తూనే వుంది ఇన్ స్పెక్టర్ ధీరజ.
    ఆ శవాన్ని గుర్తుపట్టి వివరాలు చెప్తే ఏ ఒక్క మనిషి దొరికినా తన పరిశోధన ప్రారంభించవచ్చునని ఆతురతతో ఎదురు చూస్తున్నది ఇన్ స్పెక్టర్ ధీరజ.
    హతునికి చెందిన వివరాలు పరిశీలిస్తున్నది ఆమె.
    ఆ శవాన్ని గొనె పట్టాలో చుట్టి పీపాలో పెట్టి మూత బిగించి రైలు బోగీలోని లావెట్రీలో చేర్చారు.
    ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు, నలుపు ఛామన ఛాయ,  గుండ్రని ముఖం. క్రాపు చేయబడిన నల్లని వెంట్రుకలు. నున్నగా చేసుకున్న షేవింగ్. సన్నటి మీస కట్టు, కుడితోడ వెనుక భాగం పిర్రల క్రింద ఒకేచోట పెద్ద పెద్ద మూడు పుట్టుమచ్చలు. రెండు పాదములకు గిలక కింద నుండి చిటికెన వెలి మధ్యలో ఎక్కువగా కుర్చుని ఉన్నందువలన ఏర్పడిన నల్లటి పెద్ద మచ్చలు. రెండు పేటల ఎర్రని మొలతాడు.....
    పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం పొట్టలో కత్తితో పొడవడం వల్లనూ, మెడ కోయడం వల్లనూ మరణం సంభవించిందని తెలుస్తుంది.
    హత్య జరిగి వారం రోజుల పైనే అయి ఉంటుందని దర్యాప్తులో నిర్ధారణ అయింది.
    విశాఖపట్నం నుండి విజయవాడ వచ్చే 428 పాసింజర్ రైలుతో పాటు ఈ డామేజ్ అయిన బోగీ కూడా వైజాగ్ నుంచి విజయవాడ వచ్చింది.
    కావాలనే ఎవరో అతనిని హత్య చేసి ఆధారాలు దొరకకుండా వుండడం కోసం శరీరం మీద బట్టలు తీసి శవాన్ని డ్రమ్ములో కుక్కి విశాఖపట్నం - విజయవాడ మధ్యన ఏదో ఒక స్టేషన్ లో ఆ డ్రమ్ముని టాయ్ లేట్ లోకి చేర్చి వుండాలి.
    అందుకని ఇన్ స్పెక్టర్ ధీరజ విజయవాడ, వైజాగ్ ల మధ్యన వున్న జిల్లాల ఎడిషన్స్ లో న్యూస్ వేయించింది.
    హతుడి శవం బాగా కుళ్ళిపోవడం వలన ఆనవాలు పట్టడానికి వీలు లేకుండా ఉంది.
    అయితే ముందు హతుడికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటే తప్ప ఈ కేసులోని మిస్టరీని , హత్యకు గల కారణాన్ని చేధించడానికి వీలవుతుంది-----
    ఆమె ఊహించినట్టుగానే వైజాగ్ నుంచి ధీరజకు ఎస్. టి..డి కాల్ వచ్చింది.
    "మేడమ్ ....పేపర్ లో వచ్చిన వార్త చూశాను. మా అన్నయ్య వినోద్ వారం రోజుల నుండి కనిపించడం లేదు."
    "వన్ మినిట్ వెయిట్ ప్లీజ్-----
    కాగితం కలం తీసుకున్న ధీరజ ఎలర్టయింది.
    "ఇప్పుడు చెప్పండి మీ అడ్రస్ ఏమిటి? వినోద్ ఎవరు? ఎక్కడ వుంటాడు? అతని పోలికలు గుర్తులు అన్నీ వివరంగా చెప్పండి..."
    అవతల వైపు వ్యక్తీ చెప్పింది నోట్ చేసుకున్నది?
    "ఇట్స్ ఒకే....మీరు కొంచెం సేపు ఆగి మళ్ళీ చేయండి" అన్నది ధీరజ.
    సి.డి. ఫైలు లోని వివరాలను చూస్తుంటే ఫోన్ లో చెప్పిన వ్యక్తీ పోలికలు దరిదాపులుగా ఒక్కలాగే అనిపించడంతో హెడ్ కానిస్టేబుల్ వీరాచారిని పిలిచింది ఇన్ స్పెక్టర్ ధీరజ.
    చనిపోయిన వ్యక్తీ గురించిన వివరాలను తెలుసుకోవడానికి అతన్ని వెంటనే వైజాగ్ బయలుదేరమని ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చింది ధీరజ.
    8-30 పాసింజర్ లో హెడ్ కానిస్టేబుల్ వీరాచారి వైజాగ్ బయలుదేరాడు.


                                                    *    *    *

    ఇన్ స్పెక్టర్ ధీరజ జీప్ దిగి ఆ ఇంటి నంబరును మరొకసారి పరిశీలనగా చూసింది.
    ఎస్.....తనకు కావలసిన ఇల్లు అదే....
    చుట్టుపక్కల వాళ్ళు లేడీ ఇన్ స్పెక్టర్ రావడాన్ని వింతగా గమనిస్తుండి పోయారు.
    ధీరజ కాలింగ్ బెల్ ను ప్రెస్ చేసింది....
    నుదుట బొట్టు లేని ముప్పయ్ ఐదేళ్ళ యువతి తలుపు తీసింది.
    ఎదురుగా వున్న పోలీస్ ఆకారాన్ని చూడగానే ఖంగారు పడిపోయింది.
    "మీ పేరు లలితేనా....?"
    అవునన్నట్టు తల ఊపింది.
    లోనకు నడచి వెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న సోఫాలో కూర్చున్నది.
    ఇన్ స్పెక్టర్ అంత చొరవగా వచ్చి కూర్చోవడంతో అనుమానంగా ఆమె కేసి చూసింది.
    "ఏం పని మీద వచ్చారు....?"
    "ఖంగారు పడకండి .....వేరే పని మీద వెళుతూ ఒక చిన్న ఇన్ ఫర్ మేషన్ కావలసి వచ్చి వచ్చాను...." అన్నది ధీరజ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS