Previous Page Next Page 
ఇట్లు నీ చిలుక - 87 పేజి 19

శోభనం మొదలు పెట్టడానికి అంతా సిద్ధమైంది. కానీ పురుహితుడే రాలేదు. పెళ్ళికొడుకు అసహనంగా అటూ ఇటూ తిరగడం కనిపెట్టాను. అంతకు ముందు సరిగా చూడలేదు కానీ ఇప్పుడు మాత్రం పరిశీలనగా చూశాను. గడ్డానికి బదులు సీరియస్ నెస్ ముఖం గంభీరంగా వుంది. ఎప్పుడూ నవ్వు ముఖం ఎరగని వాడిలా అనిపించాడు. అందులోనూ నాకంటే వయసులో బాగా పెద్దవాడిలా అనిపించాడు. నాకంటే దాదాపు పదిపన్నెండేళ్లు పెద్దగా తోచాడు. ఆ కారణం వల్ల కాబోలు నాకు సహచరుడిలా అనిపించలేదు. ఆ కారణం వల్ల కాబోలు నాకు సహచారుడిలా అనిపించలేదు. పైపెచ్చు ఏదో భయంలాంటిది కూడా కలిగింది.

బహుశా అతను క్లోజ్ గా వున్నా నేను తనతో వుండలేనని అనిపించింది. నేను ఇలా ఆలోచిస్తూ వుండగానే పురోహితుడు వచ్చాడు. అప్పటికే నేన రెడీగా వున్నాను. పెళ్ళిలో కలిగిన అలసటనంతటినీ కదిగేసుకున్నట్టనిపించింది. స్నానం చేస్తూనే పలచటి తెల్లటి కాటన్ చీర గరుగ్గా శరీరాన్ని పట్టుకున్నట్టుంది. టైలర్ చిన్నదిగా కుట్టాడో లేకుంటే నా శరీరం పొంగిందో తెలియదు గానీ జాకెట్టు నూలు బట్టలా అనిపించలేదు. గట్టిగా వత్తేస్తున్న ఇనుప కవచంలా వుంది. మెడలోకి వచ్చిన కొత్త మంగళసూత్రాలు అటూ ఇటూ కదులుతూ నేను వివాహితనన్న విషయం గుర్తుచేస్తోంది. బాగా ఆలస్యం కావటం వల్ల చిన్న పిల్లలంతా నిద్రపోయారు. దాంతో ఇంట్లో గలాభా తగ్గింది.

ఇది ఆడవాళ్ళ వ్యవహారం అన్నట్టు మగవాళ్ళు తమకి నచ్చిన కాలక్షేపాలు వెతుక్కున్నారు. పెళ్ళికొడుకు, సులోచన షామియానాలో ఓమూల కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే తీరూ, మధ్య మధ్యలో నవ్వుకోవడాలూ, అభిముఖంగా ఒకరికళ్ళల్లోకి ఒకరు చూసుకోవదాలు బట్టి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అన్న విషయం అర్థమైంది. మరి నా మీద ఆమెకేందుకు అకారణ ద్వేషం? అదే నాకు తెలియడం లేదు.

ఎప్పుడైనా వాళ్ళను నేను చూస్తున్నట్టు అనిపించగానే ఆమె నా వైపు అదో విధముగా చూసేది. అలాంటి సమయాల్లో అతనితో మరింత సాన్నిహిత్యాన్ని ప్రదర్శించేది. పురుహితుడు రమ్మంటూనే నేను వెళ్ళాను. భార్యాభార్తలిద్దర్నీ నిలబెట్టి ఏవో కొన్ని మంత్రాలు చదివి ముగించాడు. ఆ తరువాత అమ్మ నా చేతిలో పాలగ్లాసు పట్టింది. పక్కనున్న మా వదినలు ఏవో జోక్ లు వేస్తూనే వున్నారు. ఎందుకనో తెలియదు గానీ సులోచన ముఖం మాడిపోయింది.

చెప్పలేని దిగులు కళ్ళల్లో మైదానాల్లా పరుచుకుంది. ఏమైంది ఆమెకి? అయితే ఆమె అలా అయిపోవడం మాత్రం నాకు ఆనందాన్ని ఇచ్చింది. నావైపు ద్వేషంతో చూడడం వల్ల కాబోలు నాకూ ఆమె అంత ఇష్టం లేకుండా పోయింది. కాళ్ళు వణికాయి ... కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS