Next Page 
నారి నారి నడుమ మురారి పేజి 1

నారి నారి నడుమ మురారి

జీవితంలో ఒక్కోసారి కొన్ని తమాషాలు ఎదురవుతుంటాయి.
ఎప్పుడో మన మనస్సులో దాగిన కొన్నిమధుర జ్ఞాపకాలు మన జీవితాంతం తోడుండేట్లు చేస్తాయి.
మనం ఎంత గిరి గీసుకుని ఉన్నా, పద్ధతుల పరిమితుల్లో పరిధుల నతిక్రమించకుండా మనల్ని మనం కాపాడుకుంటున్నా, మనం నమ్ముకున్న విలువల్ని నిరంతరం జాగరూకతతో పాటిస్తున్నా కొన్ని సార్లు విధి తన పని తను చేస్తూ మనం మనసులో అనుకునేవి, మనం కావాలని కోరుకునేవి, ఏ విలువలని అతిక్రమించకుండా, ఎలాంటి మానవ తప్పిదాలు జరగకుండా, తెలిసి మనం తప్పులు చేయకుండా అద్భుతంగా మనకు అనుకూలంగా మన మనసులలో అనుకున్నవి అనుకున్నట్లు చేసి విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది.
విధి అప్పుడప్పుడు మన జీవితాలతో సరదాగా ఆడుకుంటూ కొన్ని చిలిపి పనులు చేస్తూ తన ముచ్చట తీర్చుకుంటుంటుంది.
అలాంటి విధి చేసిన ఓ వింత తమాషాకు ఈ కథ ఓ నిజరూప తార్కాణం. 
ఓ నిస్సందేహ నిదర్శనం. ఓ అల్లరి భాగోతం. 
ఇక కథలోకి వస్తే .................................


అదో ప్రాంతీయ చిన్న సైజు జాతీయ బ్యాంకు. 
బదిలీ మీద ఆరోజే ఆ  జాతీయ బ్యాంకు లో  హైదరాబాద్ బ్రాంచ్ కి హెడ్ గా జాయిన్ అయ్యాడు కృష్ణ కుమార్.
తాను కోరుకున్నట్లు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది. 
తన ఫామిలీ ని వదిలి ముంబై కి ప్రమోషన్ మీద వెళ్లి మూడేళ్లయింది. 
కొడుకు చదువు కోసం ఫామిలీని హైదరాబాద్ లోనే ఉంచి నెల నెలా వస్తూ పోతూ ఉండేవాడు. 
ఇక హ్యాపీ. అమ్మయ్య హైదరాబాద్ చేరుకున్నాను అనుకున్నాడు. 
రోజూ ఇంటి భోజనం, కుటుంబంతో ఆనందంగా గడపొచ్చు అని ఆనందపడ్డాడు.
 బ్రాంచ్ లో అడుగుపెట్టగానే అందరూ సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. 
బ్రాంచ్ లో తనకి తెలిసిన వాళ్ళెవరూ కనపడలేదు. 
ఏ జి యం బ్రాంచ్ కాబట్టి ముప్పై మంది స్టాఫ్ ఉన్నారు. 
తన కేబిన్ లోకి వెళ్లి అటెండన్స్ రిజిస్టర్ తెప్పించుకున్నాడు. 
ఇవాళ ముగ్గురు సెలవులో ఉన్నారు.
సెలవులో ఉన్న వాళ్ళ పేర్లు చూసాడు కృష్ణ కుమార్. 
విద్యావతి అన్న పేరు అతన్ని ఆకర్షించింది. ఈవిడ ఆవిడ కాదు కదా అనుకున్నాడు. 
తమ బ్యాంకు లో విద్యావతి అన్న పేరు ఒక్కరికే ఉందనుకునేవాడు ఎప్పుడూ. పేరుకు తగ్గట్టే ఆమెలో ఎదో వింత ఆకర్షణ, హృదయాన్ని గిలిగింతలు పెట్టే శక్తి ఉంది .   
పదేళ్ల క్రితం కృష్ణ కుమార్ హైదరాబాద్ లో హిమాయత్ నగర్ బ్రాంచ్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ విద్యావతిని మొదటిసారి చూసాడు. 
అప్పుడు తాను ఇన్స్పెక్టర్ అఫ్ బ్రాంచెస్ గా వర్క్ చేసేవాడు. 
ఆ బ్రాంచ్ కి పది రోజులు ఇన్స్పెక్షన్ కి వచ్చాడు. 
విద్యావతి ని ఫైల్స్, అకౌంట్స్ చూపించేందుకు తనకు అట్టాచ్  చేశారు బ్రాంచ్ మేనేజర్. 
అప్పుడు ఆమె వయసు నలభై ఉండెదనుకుంటా. 
సౌందర్యాన్నంతా ఒక మూసలో పోస్తే అది విద్యావతిలా ఉంటుందనిపిస్తుంది. తల వెంట్రుకల ముంగురులు ముందుకు జారినప్పుడు మబ్బుల చాటున చంద్రునిలా ఉంటుంది.
జుట్టు వెనుకవైపుకు జారినప్పుడు సూర్యుడిలా వెలిగిపోతుంటుంది.  
రోజూ విద్యావతిని చూస్తే ఎదో ఒక పరిమళం తన మనసు చుట్టూ తిరుగుతుండేది.  
మంచి పొడవు, పల్చటి శరీరం, అందమైన ముఖం, పచ్చని మేని ఛాయ, అన్నిటికంటే మించి ఆమె జుట్టు ఎంతో అందంగా ఉండేది.  
రోజూ ఆ జడకు మల్లెలు తురిమేది. 
ఆ మల్లెల గుబాళింపు కలల లోకంలో విహరింప చేసేది. 
విద్యావతి మాట తీరు ఎంతో చక్కగా ఉండేది. 
నవ్వితే ముత్యాలు రాలెట్లు ఎంతో హుందాగా ముచ్చటగా ఉండేది. 
కామర్స్  లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ అయినా ఒద్దికగా తన తెలివినంతా బ్యాంకు వర్క్ చెయ్యడంలో ప్రతిబింబించేది. 
ఎంతో రెస్పెక్టుఫుల్ గా ఉండేది.
ఆమె ఆకర్షణలో అసలు రహస్యం పొడవు జుట్టును చక్కటి జడ వేసుకుని, ఆ జడలో కూడా పైన రెండు వైపుల నుంచి కొన్ని వెంట్రుకలు తీసి ఒక స్మాల్ టెయిల్  వేసి ఆ స్మాల్ టెయిల్ ని పెద్ద జడలో కలిపేది అందంగా. రోజూ ఆ స్మాల్ టైల్ పై గుప్పెడు మల్లెలు గుబాళిస్తూ ఉండేవి సమ్మోహితం చేస్తూ.
ఆ పొడవాటి వాలుజడ పిరుదులపై అటూ ఇటూ ఊగుతుంటే అది చూసి కృష్ణ కుమార్  గుండె గోడ గడియారంలో పెండ్యులం లా ఊగేది.  
అలా ఆ బ్రాంచ్ ఇన్స్పెక్షన్ పది రోజులు విద్యావతి ని చూస్తూ రాత్రులు నిద్రపట్టక సతమతమవుతూ ఉండేవాడు. 
పక్కనే భార్య ఉన్నా, కళ్లెదుటా, కలలో కూడా విద్యావతి, ఆమె స్మాల్ టెయిల్, గుప్పెడు మల్లెలు కనిపిస్తుండేవి. 
నిద్రలో ఆమె పేరు కలవరిస్తానేమోనని భయంగ ఉండేది కూడా.   
ఇన్నిరోజులు తరువాత మళ్ళీ ఆ పేరు అటెండన్స్ లో చూసాడు. 
అందులోనూ తన బ్రాంచ్ లో స్టాఫ్ విద్యావతి. 
ఇంకేముంది రోజూ ఆమె స్మాల్ టెయిల్ చూస్తూ ఉండొచ్చు. 
ఎలా ఉందొ విద్యావతి. అలానే ఉందా లేక తనలో వయసు వల్ల మార్పు ఏమైనా వచ్చిందా. 
ఆమె గురించి ఎన్నో ఆలోచనలు ఆశగా మనసు చుట్టూ తిరుగుతున్నాయి. ఏదో తెలియని ఆనందం గుండె లోతుల్లో సుళ్ళు తిరుగుతోంది. 
సబ్ మేనేజర్ ని పిలిచి అడిగాడు ఇవాళ  ముగ్గురు  లీవ్ లో ఉన్నట్లు కనపడుతోంది.  ఎప్పుడు వస్తారు వాళ్ళు, ఎంతవరకు లీవ్ పెట్టారు అని. విద్యావతి పేరు ఒక్కటే అడగకుండా లీవ్ లో ఉన్న  వాళ్ళందరి గురించి జనరల్ గా అడిగినట్లు అడిగాడు అనుమానం రాకుండా.  
రాజలక్ష్మి  మేడం మెటర్నిటీ లీవ్ సర్. రాజారావు ఈ వీక్ ఎండ్ వరకు లీవ్ అని చెప్పాడు. విద్యావతి మేడం రేపు వస్తుంది సర్.
సబ్ మేనేజర్ ని కూర్చోమని ఒక్కొక్కరి గురించి అడిగాడు. బ్రాంచ్ లో ఎవరు బాగా వర్క్ చేస్తారు. ఎవరు కస్టమర్ సర్వీస్ బాగా చేస్తారు, ఇలా అందరిగురించి చెప్పమన్నాడు.
ఒకరిద్దరు తప్పితే అందరూ బాగా వర్క్ చేసే వాళ్ళే సర్. అందర్లోకి విద్యావతి మేడం చాలా బాగా వర్క్ చేస్తుంది. తన పని తను చూసుకుని వెళుతుంటుంది అని చెప్పాడు. అందుకే ఆమెకు లోన్స్ మానిటరింగ్ అప్పచేప్పాము. అందరినుంచి బకాయిలు చక్కగా వసూలు చేస్తుంది. మన బ్రాంచ్ కి ఎక్కువ యెన్ పీ ఏ లు లేకుండా చేస్తోంది ఆమె. మన బ్రాంచ్ లో ఉన్న అతి పెద్ద లోన్ విరాజ్ స్పిన్ టెక్స్ మానిటరింగ్ కూడా ఆవిడే చూస్తుంది. లోన్స్ కి సంబంధించి అలెర్ట్ గా ఫాలో అప్ చెయ్యడం, కట్టని వాయిదాలకు నోటీసులు ఇవ్వడం చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. 
మరి ఇంత కష్టపడుతోంది తాను ప్రమోషన్ తీసుకోలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా ?
లేదు సర్. తనకు ఇంటరెస్ట్ లేదు. హైదరాబాద్ లోనే ఉండాలి అని తన కోరిక. హస్బెండ్ జాతీయ బాంకు లో చీఫ్ మేనేజర్.    సీనియర్ మేనేజర్ప్రమోషన్ మీద కరీంనగర్ కి నెల క్రితం ట్రాన్స్ఫర్ అయ్యాడు.  ఆమెకి ఇద్దరు పిల్లలు. పిల్లల చదువు కోసం హైదరాబాద్ లోనే ఉంది .  ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అబ్బాయి ముంబై లో జాబ్ చేస్తున్నాడు.  అమ్మాయి పై చదువులకు అమెరికా వెళ్ళింది అంటూ చెపుతున్నాడు. ఇంతలో ఎవరో పిలిస్తే కేబిన్ నుంచి వెళ్ళాడు సబ్ మేనేజర్.
అతని మాటలు విన్నంతనే విద్యావతిని వెంటనే చూడాలనిపించింది. అబ్బా రేపటి వరకు ఆగాలి అని ఫీల్ అయ్యాడు కృష్ణ కుమార్. 
కృష్ణ కుమార్ వయసు యాభై రెండు ఉంటాయి. కానీ పొడవుగా, అందంగా, స్మార్ట్ గా ఉంటాడు. జుట్టు రాలలేదు. కొంచెం నెరిసింది కాబట్టి వారం వారం కలర్ వేస్తాడు. అతడికి ఒకడే అబ్బాయి. బి టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు హైద్రాబాద్లో. 
****
మొదటి రోజు బ్రాంచ్ లో బిజీ బిజీ గా గడిచింది కృష్ణ కుమార్ కి.
అందులోనూ అది కోటి మెయిన్ బ్రాంచ్. హెవీ బిజినెస్ బ్రాంచ్ అది. 
ఎంతో మంది కస్టమర్స్ ఉన్నారు ఆ బ్రాంచ్ కి. వందేళ్ల క్రితం పెట్టిన బ్రాంచ్ కాబట్టి రోజూ చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు.  లోన్స్ చాలా ఇచ్చారు ఆ బ్రాంచ్ లో.
లోన్స్ డిపార్ట్మెంట్ లోనే పది మంది స్టాఫ్ అన్నారు. విద్యావతి లోన్ మానిటరింగ్ చూస్తుంది. అంటే వాయిదాలు క్రమం తప్పకుండా కట్టించడం అన్నమాట.
ఈ మధ్య కాలంలో రుణాల బకాయిలు బాగా ఎక్కువయ్యాయి. అందుకే బ్యాంకు స్టాఫ్ లోన్ కస్టమర్స్ వెంటపడుతూ ఉండాలి బకాయిలు వసూలు చేసేందుకు. అప్పుడే వాళ్ళు తప్పించుకోకుండా  కడుతుంటారు. 
చిన్న లోన్ కస్టమర్స్ చాలా బుద్ధిగా కడుతుంటారు. 
లోన్ క్లోజ్ కాగానే మళ్ళీ బ్యాంకు వారు లోన్ రెన్యువల్  చేస్తారు కాబట్టి. వారితో ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. 
ఇబ్బందల్లా పెద్ద లోన్ కస్టమర్స్ తోనే. వారితో చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. ఈ మధ్య కాలంలో పెద్ద లోన్స్ లో ఎక్కువ భాగం నిరుపయోగమైనవి గా మారడంవల్ల బ్యాంకు లు చాలా నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. 
అందుకు అసలు కారణం బ్యాంకు సిబ్బంది లోని పై అధికారులు కొందరు లంచాలకు అలవాటుపడి ఇష్టమొచ్చినట్లు రుణాలు మంజూరు చెయ్యడం వల్లనే. 
అన్ని జాతీయ బ్యాంకు లకు అది పెద్ద తలనొప్పిగా మారింది. అటువంటి వాళ్ళ వల్ల కొంతమంది బ్రాంచ్ మేనేజర్ లు కూడా డిస్మిస్ అయ్యి ఇళ్లకు వెళ్లారు. కొందరు సి బి ఐ కేసులతో బాధపడుతున్నారు. 
ఆ అవమానం భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. 
కొంతమంది బ్రాంచ్ మేనేజర్ లు పై అధికారులు, జోనల్ మేనేజర్ లు చెప్పిన రెకమెండేషన్స్ తో రుణాలు మంజూరు చేస్తారు. అసలు ఆ రుణాలు ఇవ్వొచ్చో ఇవ్వకూడధో కూడా ఆలోచించరు. 
మేనేజర్స్ చాలా మందికి ప్రమోషన్స్ మీద మోజు ఉంటుంది. అందుకోసం తమ ఉద్యోగాలను, జీవితాలను కూడా పణంగా పెడతారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని జోనల్ మేనేజర్లు మేనేజర్ల చేత అవకతవక

 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS