కడుపుతో వున్నప్పుడు తలనోప్పి తీవ్రంగా రావచ్చు కొందరికి..  

కొడుకును పెంచాల్సింది ఇలాగే!   రోజులు మారిపోయాయి, ఆడా మగా తేడాలు పోయాయి అని నాగరికులు ఎంత చెబుతున్నా... ఎక్కడో ఒకచోట ఆ భేదభావం కనిపిస్తూనే ఉంటుంది. నువ్విలా చేయలేవు అనో, ఇలా చేయడం నీవల్ల కాదు అనో, నువ్విలా చేయకూడదు అనో ఏదో ఒక సమయంలో మగవాళ్లు ఆడవాళ్లను అంటూనే ఉంటున్నారు. దానికి కారణం మగవాళ్ల యాటిట్యూడ్ అనేది పెద్దల వాదన. మరి మీ అబ్బాయి యాటిట్యూడ్ ఎలా ఉందో ఎప్పుడైనా గమనించారా? మీకు కనుక కొడుకు ఉంటే... తనకి మీరు కొన్ని విషయాలు చిన్నతనం నుంచే చెప్పండి, నేర్పండి. రేపు పెద్దయ్యాక తను ఆదర్శవంతుడవ్వాలంటే ఇది తప్పనిసరి. - ఏడవొద్దు అని మీ అబ్బాయికి ఎప్పుడూ చెప్పకండి. చాలామంది అంటుంటారు.. మగపిల్లలు ఏడవకూడదు అని. అంటే ఆడపిల్లలే ఏడవాలి అని పరోక్షంగా చెబుతున్నట్టే కదా. ఆడవాళ్లు ఏడుస్తూనే ఉంటారులే అనే యాటిట్యూడ్ తనలో పెరిగిపోదూ! - ఆడపిల్లలను తప్ప మగపిల్లలను తల్లులు వంట పనిలో సాయమడగరు. అదీ తప్పే. వంట ఆడవాళ్లే చేయాలని లేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న చెఫ్స్ లో అత్యధికులు పురుషులే. అలా అని కెరీర్ కోసం వంట కాదు. ఇప్పుడు అలవాటు చేస్తే రేపు పెద్దయ్యాక భార్యకు సాయపడే అలవాటు వస్తుంది. ఇల్లు తుడవడం, గిన్నెలు కడగడం వంటివి మగపిల్లలు చేయకూడని పనులేవీ కాదని తప్పకుండా చెప్పండి. - ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఉంటే వాళ్లని ఎప్పుడూ సమానంగానే చూడండి. ఏ విషయంలోనూ అబ్బాయికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అమ్మాయిని తక్కువ చేయకండి.     - మగపిల్లలు మరీ సౌమ్యంగానో, సుకుమారంగానో ఉంటే ఏంటి ఆడపిల్లలాగా అంటుంటారు. దాంతో మగాడు రఫ్ గా ఉండాలి అన్న భావన పేరుకుపోతుంది. తర్వాత ఏమవుతుందో మీకు వేరే చెప్పాలా? - ఆడపిల్లలతో గౌరవంగా మాట్లాడటం నేర్పించండి. చెల్లెలయినా సరే కొట్టడం, తిట్టడం చేయనీయకండి. - ఆడపిల్లల విలువేంటో తెలియజేయండి. చరిత్రలో గొప్ప గొప్ప మహిళల కథనాలు చెప్పండి. ఆడపిల్లలు కూడా చాలా సాధించగలరు అన్న నమ్మకం చిన్ననాటే ఏర్పడితే... ఆడవాళ్లను తక్కువగా చూసే అలవాటు రాదు. - పిల్లలు టీవీ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్లను బలహీనంగా చూపించేవి, తప్పుగా చూపించే వాటిని చూడనివ్వకండి. కొన్నిసార్లు వాళ్ల చిన్ని బుర్రలకి అవి తప్పుగా అర్థమైతే తర్వాత వాళ్ల ఆలోచనాధోరణిపై, వ్యక్తిత్వంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. చిన్నతనంలోనే ఇంత అవసరమా అనుకోకండి. మొక్కై వంగనిది మానై వంగదు. చిన్నప్పుడు నేర్పలేనిది పెద్దయ్యాక నేర్పలేరు. పిల్లల మనసులు తెల్ల కాగితాలు. వాటిపై మొదటే మంచి అక్షరాలు రాయండి. వాటినే జీవితాంతం చదువుకుంటూ ఉంటారు. పాటిస్తూ ఉంటారు. ఆదర్శంగా నిలబడతారు. - Sameera  

  హాలీడేస్.. కేవలం జాలీ డేస్ కాదు!     దాదాపు పిల్లలందరికీ పరీక్షలు అయిపోయినట్టే. కొందరికి ఆల్రెడీ సెలవులు ఇచ్చేశారు. మిగతావాళ్లకి ఇంకో వారంలో ఇచ్చేస్తారు. మరి మీ పిల్లల హాలీడేస్ ని మీరెలా ప్లాన్ చేస్తున్నారు? హాలీడేస్ ప్లాన్ చేయడానికేముంటుంది అనుకుంటున్నారు కదా! అదే పొరపాటు. పిల్లల చదువులే కాదు... వాళ్ల సెలవుల్ని కూడా ప్లాన్ చేయడమే గుడ్ పేరెంటింగ్. సెలవులంటే ఆడిపాడటానికి, సరదాగా ఎంజాయ్ చేయడానికి, విశ్రాంతి తీసుకోడానికి అన్న భావనే మనందరిలోనూ ఉంది. అది తప్పు కూడా కాదు. అయితే సెలవుల్ని వాటికి మాత్రమే కేటాయించడం మాత్రం కరెక్ట్ కాదు. హాలీడేస్ ని జాలీగా ఎంజాయ్ చేయడంతో పాటు కొన్ని మంచి అలవాట్లను పెంచుకోడానికి, అభిరుచుల్ని అలవర్చుకోడానికి, ఆల్రెడీ తమలో ఉన్న ప్రతిభకు మరింత మెరుగు దిద్దుకోడానికి ఉపయోగించుకోడాలన్న విషయాన్ని మీ పిల్లలకు ఈసారి తెలియజేయండి. అలా చేయాలంటే ముందు మీరు వాళ్ల హాలీడేస్ ని ప్లాన్ చేయండి. - బడి ఉండదు కాబట్టి పొద్దున్నే లేవాల్సిన పని లేదు అనుకుంటారు పిల్లలు. మనం కూడా పోనీలే అని వదిలేస్తాం. మొదటి వారం రోజులు మాత్రమే అలా వదిలేయండి. సెలవులన్నాళ్లూ వదిలేశారో... అదే అలవాటైపోతుంది. స్కూలు మొదలయ్యాక సతాయిస్తారు. కాబట్టి మరీ పొద్దున్నే కాకపోయినా కాస్త త్వరగా లేపేయండి. అలాగే ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రేపు మీరు ఇలా గడపాలి, ఈ పనులు చేయాలి అంటూ ఓ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. దానివల్ల వాళ్లకి రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుస్తుంది. - మీ పిల్లలకి ఏమంటే ఇష్టమో తెలుసుకోండి. మ్యూజిక్, డ్యాన్స్, స్విమ్మింగ్, పెయింటింగ్.. వాళ్ల అభిరుచి ఏదైనా సరే... అందులో శిక్షణ తీసుకోడానికి సెలవుల్ని మించిన సమయం మరొకటి దొరకదు. కాబట్టి వెంటనే చేర్పించండి. అయితే అది వాళ్ల ఇష్టమై ఉండాలి. ఇష్టం లేనిది చేయమని మాత్రం బలవంతపెట్టకండి. మీ అభిరుచుల్ని వాళ్లపై రుద్దకండి. - మీరు రోజూ ఏదో ఒక సమయంలో ఒక గంటపాటు వేరే ఏ పనీ పెట్టుకోకుండా పిల్లలతో గడపండి. ఆ సమయంలో వాళ్లకి మంచి విషయాలు చెప్పండి. దేశం కోసం పోరాడిన యోధుల చరిత్రలు, గొప్ప గొప్ప పనులు చేసిన మహానుభావుల జీవితాల గురించి చెప్పండి. వాళ్లు ఎలా ఆ స్థాయికి చేరుకున్నారో తెలియజేయండి. మీ పిల్లల వ్యక్తిత్వ రూపుకల్పనలో ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే మనీ సేవింగ్ వంటి ఉపయోగకరమైన విషయాల గురించి కూడా వివరించండి. - చాలామంది పిల్లలకి ఎక్కువ పని చెప్పరు. రోజంతా స్కూల్లో అలసిపోతారు కదా అనుకుంటారు. ఒక్కోసారి చెప్పినా పిల్లలు చేయరు. హోమ్ వర్క్ ఉందనో ఆడుకోవాలనో చెప్పి తప్పించుకుంటారు. వాళ్లని దారిలో పెట్టడానికి ఇదే సరైన సమయం. సెలవుల్లో పిల్లలకి అడపా దడపా ఏదో ఒక పని చెప్పండి. మీ ఇంటి పనిలో వంట పనిలో సాయం చేయమనండి. ఇల్లు సర్దమనండి. మొక్కలకు నీళ్లు పోయమనండి. పెంపుడు జంతువులు ఉంటే వాటికి స్నానం చేయించమనండి. దానివల్ల బాధ్యతలు పంచుకోవడం మెల్లగా అలవాటవుతుంది. - సెలవులన్నాళ్లూ పిల్లల పనులు మీరేమీ చేయకండి. లేచిన తర్వాత పక్క సర్దుకోవడం దగ్గర్నుంచి పడుకునేముందు బ్రష్ చేసుకోవడం వరకూ ప్రతి పనీ వాళ్లే చేయాలి. ఏ పనిలోనూ మీరు కల్పించుకోవద్దు. అలా చేస్తే వాళ్లకి ఓ క్రమశిక్షణ అలవాటవుతుంది. దాంతో బడి తెరిచిన తర్వాత కూడా అలవాటు ప్రకారం వాళ్ల పనులు వాళ్లు చేసేసుకుంటారు. మీకు శ్రమ తగ్గుతుంది. - వారానికి రెండు రోజులు, కుదరకపోతే కనీసం ఒక్కరోజు వాళ్లని బైటికి తీసుకెళ్లండి. బైటికంటే సినిమాకో షాపింగుకో కాదు. వాటికీ తీసుకెళ్లాలి. అయితే వాటితో పాటు ఏ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో, శారీరక మానసిక వైకల్యం ఉన్న పిల్లల దగ్గరకో తీసుకెళ్లండి. వాళ్లతో గడపమనండి. మీరు తీసుకెళ్లిన పండో ఫలమో వాళ్లకి ఇప్పించండి. దీనివల్ల మీ పిల్లలు చాలా నేర్చుకుంటారు. ఇవ్వడంలోని ఆనందం వాళ్లకి తెలుస్తుంది. తమ దగ్గర ఉన్న సంతోషం చాలామంది దగ్గర లేదని తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో అత్యాశలకు పోకుండా, తమకంటే గొప్పవారితో పోల్చుకుని అసంతృప్తి చెందకుండా ఉన్నదానితో తృప్తిగా బతకడం ఎలాగో అర్థమవుతుంది. - సెలవుల్లో ఏదైనా ఊరు వెళ్లాలనుకుంటే... ఏదైనా చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లండి. సరదాగా గడపడంతో పాటు విజ్ఞానం కూడా కూడా పెరుగుతుంది. ఈసారి పిల్లల హాలీడేస్ ని ఇలా ప్లాన్ చేసి చూడండి. కచ్చితంగా మీ పిల్లల్లో మీకు తెలియని మార్పు కనిపిస్తుంది. మీక్కూడా మీ  బుజ్జాయిల భవిష్యత్తు అందంగా కనిపిస్తుంది. - Sameera  

  జీవితం లో కాంపిటీషన్  ఉండటం యెంత సహజమో , తమ పిల్లలు అందులో నెగ్గాలని తల్లిదండ్రులు కోరుకోవడం అంతే సహజం. పిల్లలు కిందపడినపుడల్లా వాళ్ళని వెన్నుతట్టి లేపాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అయినపుడు , పిల్లలు ఓటమి ని ఎదుర్కొన్నప్పుడు పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ అందివ్వాలి? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా?  కెరటాన్ని చూస్తే, అది "లేచి పడుతుందని" కాదు, "పడినా  లేస్తుందనే" విషయాన్ని తెలియజేయాలి. ఆ క్వాలిటీ ప్రతి మనిషి ,  ముఖ్యంగా పిల్లలు  నేర్చుకోవాలని అంటారు "స్వామి వివేకానంద".   సక్సెస్ స్టోరీస్ తో బాటుగా, అపజయాల తో ముడిపడి వున్న కథల్ని కూడా పిల్లలకు చెబుతూ ఉండాలి. ఓడిపోవడం చిన్నతనం కాదు అది ధైర్యవంతుల లక్షణం అని అందరూ తెలుసుకోవాలి. ఫెయిల్యూర్ నుంచి బయటికి రావాలంటే ముందు ఆ ఓటమి ని ఒప్పుకోవాలి. అందులోని తప్పు-ఒప్పు లని విశ్లేషించుకోవాలి. గెలుపు కారణం మనమే అని చెప్పినపుడు, మన ఓటమికి కూడా కారణం మనమే అన్న జవాబుదారీతనం పిల్లల్లో కలిగేలా పెద్దవాళ్ళు శిక్షణ ఇవ్వాలి.   ఒక గెలుపు వెనుక పది ఓటమిలు వున్న గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో మంది, మన చుట్టూ వున్నారు. ఈ విషయాలు, పిల్లలతో చర్చిస్తూ ఉండాలి.  గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవటం పిల్లలకు అలవాటు చేయాలి. దీని వల్ల పిల్లలకు గెలుపు పట్ల ఆసక్తి కలగటమే కాక ఓటమి ఎదురైనపుడు కూడా సానుకూల దృక్పథం కలిగివుండటం ఎలాగో తెలుస్తుంది. -Bhavana  

లంచ్ బాక్స్ మీదే పిల్లల ఆరోగ్యం ఆధారపడి వుంటుంది..   ఎదిగే పిల్లల ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వారి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఉంటే బతిమాలో..బామాలో ఏదో రకంగా తినిపించవచ్చు. మరి స్కూళ్లకి వెళ్లే పిల్లల సంగతేంటి. లంచ్ బాక్స్ మీదే పిల్లల ఆరోగ్యం ఆధారపడి వుంటుంది..తినే పిల్లలయితే ఓకే.. కానీ తినని పిల్లలయితే కష్టం. అలాంటి వారి విషయంలో కాస్త జాగ్రత్తగా బాక్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మరి వారికి లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... అనే విషయంలో డాక్టర్ జానకి శ్రీనాథ్ ఈ వీడియో ద్వారా కొన్ని సలహాలు చెబుతున్నారు. అవెంటో మీరూ తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=82CsdQjBnug  

మీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జాం కి ప్రిపేర్ అవుతున్నారా..?   Dr. Purnima Nagaraja Health Videos. Purnima Nagaraja about Children’s competitive exams preparation. From The Heart With Purnima Nagaraja, To know more watch the video. 

పరిక్షల సమయంలో మీ పిల్లలు ఫిట్ గా ఉండాలంటే ఇవి పెట్టండి..   పరిక్షల సమయంలో మీ పిల్లలు ఫిట్ గా ఉండాలంటే ఇవి పెట్టండి.. Health tips for children's in Exam Time..

మీ పిల్లలు బరువు పెరుగుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు   Everyone likes those kids who are chubby and cute. But is it correct for kids to be so chubby? Is it the reason for all the health issues in them? To know in detail about all this watch the video.  

Parents Should have Knowledge about Computers       Are you the parent of a child or a teenager who uses the internet? If so, you may have some concerns. Yes, it is typically safe for your child to use the internet to do research for school projects, but did you also know that children and teens are now using it to communicate with their friends or other internet users? Using the internet at a young age can become a problem. A good understanding of computer and internet use can better enable you to protect your child. Do you know that Internet Explorer, the browser that comes standard, has a free parental control option that just needs to be activated? A few easy steps and you can have certain websites blocked from your child. Unfortunately, you won't know this if you don't know all that you can know about the computer or the internet. Speaking of the internet, additional online safety tools for parents can be purchased online as well. Here we list five reasons why internet use can be dangerous for children and teenagers:    Fake Identities Are Easy to Create: Making new friends online is easy, but it is much different than doing so in person. Why? Because you can’t see who is at the other end of the computer. The internet makes it easy for someone to be anybody else. For example, if your child is using social networking websites online, they have to enter in their age. They could easily lie themselves or they could be talking to someone else who is.   Internet Predators: As the internet makes it easy to create a new, false identity. Often times, the individuals who lie about their ages are internet predators. They are the ones who target children, like yours. Unfortunately, many children, teenagers, and their parents cannot discover an internet predator until it is too late, like when the predators try to approach your child or contact them in person.   So Many Websites To Choose From: What is nice about the internet is that you have so many websites to choose from. In fact, that is why it is a good way to research school projects. But, having so many websites to choose from can be dangerous. Your child can gain access to social networking websites, adult chat rooms, pornographic websites, and websites that are violent in nature. Unless you have parental controls set up, your child can easily access any type of website with a standard internet search.   Not All Information Is Private: Unfortunately, many individuals, including both children and parents, do not know that the information that is posted online isn’t always private. For starters, most teens have their MySpace profiles set to public, as opposed to private. This means that anyone can view it. There are also online message boards that are indexed by the search engines. This means that others can view the conversations that were discussed, even years down the road.  Keep them in your Control: When your child uses the internet, they are the ones who are in control. This can be fine if your child is older and mature, but you honestly never know. You may ask your child not to communicate with strangers online, give out their phone numbers, or share pictures with strangers, but that doesn’t mean that they will follow your rules. For that reason, if you do let your child use the internet, be sure to monitor their use.   Discuss the facts about internet: One problem that many parents face is checking up on their children online. It is no secret that most children know their way around a computer nowadays. Sometimes being strict also can create a problem, they can delete the history, they can lie with you, these all things slowly create the distance between you and your children, so it's better to spending the time on computer along with your kid, and making them understand the facts about internet may keep your kid safe.

  Guidance for New Parents     If you recently had your first child, there are a few things you must know. There are some common mistakes that new parents make. Discover what they are and make sure you avoid those mistakes. Let’s start with understanding the baby’s communication. Every time your baby cries, its not a sign of discomfort. It is the only way of communication the baby knows. If you notice fever, vomiting or other abnormalities, consult a paediatrician. But, when you see no particular reason for the crying don’t panic. Just try to comfort your baby. It a general belief among new mom’s that breast milk is not thick enough to keep the baby’s stomach full through the night. This is the reason why many mothers wake their babies up to breastfeed them. Paediatricians generally advice against this. New moms must know that continuous and undisturbed sleep is very crucial for them and their babies in the initial few months. All new parents must know the difference between their baby’s spit up and vomit. Baby spit is lighter in consistency and can fly across the room. This does not happen with vomit. Knowing the difference is important as it will prevent you from panicking unnecessarily. In the enthusiasm and excitement of taking care of their baby, most new parents neglect their marriage. While it is important to give time to your little one, you must not forget to spend time with your spouse. Remember to avoid isolating yourself when the baby is not around. Enjoy parenting experience with your new born. - KRUTI BEESAM      

Tips for Bathing Babies     Tips Bathing Babies, Safety Tips Bathing Babies, Bathing Baby Safely: Children who start crawling and walking need daily baths and more frequent washings because they can easily mess themselves up. Here are some tips for bathing babies while both you and your baby have fun. * Bathe the baby in a room, which is warm and draft-free. * Keep a basin of water nearby and a thick towel on which you can place the baby immediately after you have bathed her. * While giving sponge bath to the baby, if your baby cries too much on being undressed, you may wash one body part at a time and * keep some part of her body covered at all times. * Always test the temperature of the water on your wrist. It should neither be too hot nor too cold. * Slowly, ease your infant into the water in a good baby bathtub or the kitchen sink. * If you feel that your hands get too slippery on the skin once you have scrubbed her with the soap, then you may try wearing a pair of old cotton gloves. * Put a towel on the bottom of the sink or tub to prevent the baby from slipping. * Use mild soaps only for baby’s tender skin and wash the body gently. * Do not use soap on baby’s face as it can hurt her eyes. * If your baby doesn’t like being alone in the water, you can climb into the bathtub with the baby and bathe with her. It gives you great skin-to-skin contact time. If your baby is breastfeeding, you baby may even want to nurse in the tub. * Bath toys such as classic rubber ducks can attract older children bathtubs. * If your child is afraid of bathtubs, you may try taking shower with your baby.  

  అల్లరి పిల్లలకోసం ఫస్ట్ ఎయిడ్..     పూర్వంతో పోలిస్తే ఈతరం పిల్లలు ఎంతో చురుగ్గా,ఉత్సాహంగా ఉంటున్నారు. ఇది కాలానుగుణంగా వచ్చే మార్పు. వాళ్ళ తెలివి, ఐ.క్యూ. చూసి ముచ్చట పడతాం. వాళ్ళ ఉల్లాసం, ఉత్సాహం చూసి మురిసిపోతాం. అంతా బాగానే ఉంది. అయితే ఈ చురుకైన చిచ్చర పిడుగులతో కొంచెం ప్రమాదమూ ఉంది. వాళ్ళ దుందుడుకు చేష్టలు ఒక్కోసారి భయాందోళనలకు గురిచేసే మాట నిజం. అవును, ఉత్సాహంగా పరుగులు పెట్టే బుడతలు ఒక్కోసారి కాలు జారి పడిపోతుంటారు. ఇంకోసారి ఏ బ్లేడుతోనో చేతులు తెగ్గోసుకుంటారు. మరోసారి కాలో, చేతులో కాల్చుకుంటారు. ఇంకోసారి ఇంకేదో ఆపదను కొనితెచ్చుకుంటారు. ఇలా మోచేతులు, మోకాళ్ళు గాయపడి రక్తం కారడం, మొనదేలిన వస్తువులతో ఆడటంవల్ల, కోసుకోవడం, వేడినీళ్ళు మీద పోసుకుని లేదా స్టవ్ అంటించుకుని శరీరం కాల్చుకోవడం లాంటివి పరిపాటి. అలాగే పిల్లలకు తరచూ ఏదో ఒక అనారోగ్యం కలగడమూ సహజమే. తిండిలో తేడా వచ్చినా, వాతావరణంలో మార్పు వచ్చినా పిల్లల్లో త్వరగా తేడా కనిపిస్తుంది. అందుకే చిన్నారులు ఉన్న ఇంట్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ ఉండితీరాలి. అకస్మాత్తుగా జరిగే ఇలాంటి అనర్ధాల నుండి రక్షించుకునేందుకు టింక్చర్ (tincture), దూది, పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్, బర్నాల్, బాండ్ ఎయిడ్ లాంటి అత్యవసర చికిత్సా సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి. జలుబు, జ్వరము, కడుపునొప్పి, మోషన్సు లాంటి సాధారణ అనారోగ్యాలకు సంబంధించిన మెడిసిన్లను ఇంట్లో తప్పకుండా ఉంచుకోవాలి. అవి ఎక్స్పైర్ అయితే పడేసి వేరేవి తెచ్చిపెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలతో బాటు పిల్లల వైద్యుడి ఫోన్ నంబర్ రెడీగా ఉంచుకోవాలి. 

ప్రేమించడం తప్పు కాదు... పిల్లలని అర్ధం చేసుకోండి..!   మీరు పిల్లలకు ప్రేమించడం ఎలాగో నేర్పిస్తున్నారా..? ప్రేమించడం నేర్పించాలా...? అదేంటి వెరైటీగా ఉంది కదా క్వశ్చన్.. దీనికి ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?time_continue=11&v=NLIqSnPIFs8  

పిల్లల మానసిక ఒత్తిడిని అర్ధంచేసుకోండి...?   మన పిల్లలు జీవితంలో నెగ్గుతూ ఉంటే ఆ ఆనందమే వేరు. వాస్తవానికి పిల్లలు గెలిచేలాగా మనం ప్రోత్సహిస్తాం, వాళ్ళని అందుకు అనుగుణంగా తయారు చేస్తాం. ఒక వేళ మన పిల్లలు 90 % మార్కులు వచ్చాయి అంటే, లేదు నీ కెపాసిటీ కి 100 % సులభంగా తెచ్చుకోగలవు అని ఎంకరేజ్ చేస్తాం. ఈ మధ్య పిల్లల్లో ఆత్మహత్యలుపెరుగుతున్నాయి. హత్య కూడా చేసే ధైర్యం చేస్తున్నారు. మరి వీటన్నింటికి గల కారణం ఏంటి? పిల్లల్లో మానసిక వత్తిడిని తెలుసుకోవడం ఎలా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=I9FOliy2LQU  

పిల్లలు చిన్నప్పుడు సరిగ్గా నిద్ర పోకపోతే పెద్దయ్యాక ఒత్తిడికి గురౌతారు..   మీ చిన్నారులు నిద్రలేమితో బాధపడుతున్నారా..? ఇప్పుడే మేల్కొండి.. లేదంటే వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసా.. https://www.youtube.com/watch?v=D5BuR8l-iBw    

ఏకాగ్రతే పిల్లలకి చక్కటి మెడిటేషన్   బాల్యం అంటేనే ఒకలాంటి చాపల్యాని స్ఫురింపజేస్తుంది. కన్పించే వాటన్నింటి అంతు చూడాలన్న ఆత్రుత కుతూహలం వారిని ఒక విషయంపై దృష్టి కేంద్రీకరించనీయవు. కానీ స్కూల్లో చేరి, పాఠాలు చదువుకోవడం మొదలెట్టినా పిల్లలు ఏకాగ్రతను అలవరచుకోక పోవడం పెద్దలను బాధిస్తూనే ఉంటుంది. ఆరేడేళ్ళ పిల్లల గురించి పాఠశాలలో టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు తరచూ చేసే ఫిర్యాదు ఎక్కడా క్షణం కుదురుగా కూర్చోడు, పది నిముషాలైన పుస్తకం పట్టుకొని చదవడు అని...   * ఏకాగ్రతతో దృష్టిని నిలపడం నిజానికి పిల్లలకు చాలా కష్టమైన పనే. కొంతమందికి స్వతహాగా ఉంటే, కొంతమందికి పెద్దల భయంతో బలవంతాన అలవర్చుకుంటారు. అలా కాకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా వారికీ అలవాటయ్యేలా చెయ్యాలంటే పెద్దలు కాస్త శ్రమపడాల్సి ఉంటుంది. * బాబు గానీ, పాపా కానీ ఏదైనా ఒక పనిలో లీనమవడం పెద్దలు గమనిస్తే వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా కొనసాగనివ్వాలి. * వారి ధ్యాస మళ్లించే ప్రయత్నాలేవీ చేయకూడదు. * వాళ్ళు చెప్పిన పనిని మెచ్చుకుంటూ దానిని ఇంకా కొనసాగించేలా ప్రోత్సహించాలి. * వాళ్ళ పక్కనే మీరూ నిలబడి సహాయపడటమో, మరో పని చేస్తూనో వారిని గమనిస్తుండాలి. మధ్య మధ్యలో ప్రశంసలు, చిన్న సూచనలు ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల మీరున్నంతసేపో అ పని చేసి ఒక పనిపై ఎక్కువ సమయం గడిపినవరవుతారు. పిల్లలకు ఇదే క్రమేపి ఏకాగ్రత పెరగడానికి దోహదం చేస్తుంది. * పిల్లలు చేయాల్సిన పనులను వారికి ఆసక్తికరంగా ఉండేలా మార్చండి. ఈ రోజు ఇంగ్లీష్ పాఠం పూర్తిగా రెండు సార్లు చదివితే కథ చెప్తానని, తెలుగు హోం వర్క్ నీట్ గా రాస్తే పాట నేర్పుతానని- ఇలా వర్క్ ఆసక్తి కలిగే విషయాలను చెప్పాలి. పాఠమంతా చదివాక ఫలానా పదం ఎన్నో లైనులో ఉందో చూసి చెప్పు. ఈ పదం స్పెల్లింగ్ నేను చెప్తాను కరేక్టేనేమో నువ్వు చూడు... ఇలా చిన్న చిన్న ఆటలు, మాటలతో వారు ఎక్కువసేపు ఇక పనిలో కొనసాగేలా చేయవచ్చు. అయితే రోజూ కొంచెం చొప్పున సమయం పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకే రోజు గంటసేపు కుర్చోబెట్టకూడదు. * పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కార్టూన్ ఛానల్ చూడడం. వారిని రోజులో కొంత సమయం వారికి నచ్చిన ఛానల్ ని చూడనివ్వడం.దాని వాళ్ళ పిల్లలో కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. * హాలిడేస్ లో వారికీ నచ్చిన ప్రదేశానికి, ఆట స్థలాల్ని తీసుకెళ్ళాలి. * మొత్తం చదువుపైననే కాకుండా వారికీ అన్ని ఆటలు నేర్పించాలి. * పిల్లలకి పెట్టే ఆహారపదార్థాల విషయంలో చాలా జాగ్రతాలు తీసుకోవాలి. వారికి ఇష్టంలేని పదార్థాలు లంచ్ బాక్స్ లో పెట్టడం వల్ల పిల్లలు సరిగా తినరు. ఖాళీ కడుపుతో ఉంటే టీచర్లు చెప్పే పాఠాలు బుర్రకెక్కవు. * పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మెచ్చుకోవడం తక్కువ మార్కులు వచ్చినప్పుడు తిట్టడం లాంటివి చేయకూడదు. తక్కువ మార్కులు వచ్చినప్పుడు వారికి చదువుపై శ్రద్ధ పెరిగే విధంగా మసలుకోవాలి. నమ్రతగా వారికి నచ్చ చెప్పాలి. * ఇలా పిల్లల్లో ఏకాగ్రత పెరిగే విధంగా తల్లిదండ్రులు చిన్న చిన్న సూచనలు పాటిస్తే సరిపోతుంది. అదే వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి బాట వేస్తుంది. పిల్లల్లో ఏకాగ్రత పెంచితే చాలు అదే మంచి మెడిటేషన్.

Toothpaste Can Be Harmful for Children   Supermarkets have sweet and fun toothpaste flavors like orange, peach, strawberry and tutti-frutti targeted at children. But a clueless parent may be taken in by obscure or absent label warnings about toxic chemical contents.Teeth cleaner sweet toothpaste has now become an integral part of Lifestyle. But the chemicals often found in it may have adverse impact on health. This amount is dangerous for little kids. Due to this, process of mouth enzymes is disrupted and gum cells become weak. Some toothpaste surfactant & foaming agent is also present. Surfactant is originally a detergent. These two agents help in removing the dirt of mouth. In foaming agent, sodium lauryl sulfate is present which damage the liver. Young children are expected to follow brushing motions, spit out the foam from the mouth, rinse and gargle, all while taking care not to swallow toothpaste. But what usually happens is that the children end up swallowing some amounts of toothpaste. We are need to consider how to protect our children from fluoride-overdose. Some manufacturers display the fluoride content in their products in ppm (parts per million). Others specify percentages and there are still others who display nothing about fluoride content of their products. Some steps that you as a parent can take to protect children aged less than 7 years from fluoride exposure. 1. Choose to use no-fluoride or low-fluoride children's toothpastes. 2. The amount of toothpaste used one time should only be the size of a pea. 3. Minimize the risk of swallowing of toothpaste, supervise your child's brushing. 4. Educate and motivate your children to spit out the toothpaste and not to swallow it. 5. Unless recommended by a medical professional, avoid using fluoride supplements like drops, tablets or pills for young children. 6. Only usy no-fluoride or low-fluoride dental floss and mouthwashes for kids.

పిల్లల ఎదుగుదలను తెలుసుకోవడం ఎలా?   తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలలో మార్పులను చూసి చాలా బెంగపెట్టుకుంటుంటారు. వారి హైట్‌లో మార్పులు రావడంలేదని తెగబాధపడుతుంటారు. ఇక్కడ మేము చెప్పే క్యాలిక్యులేషన్‌లతో మీరు మీ పిల్లల్లో ఎదుగుదలను మీరు గమనించగలరు. పిల్లల ఎదుగుదల ఎలాగుర్తించడం ? * తల్లిదండ్రుల హైట్ ఎలా వుంటే పిల్లల్లో కూడా హైట్ అలాగే ఉంటుందని, దీనిని ఎవరు కూడా నియంత్రించలేరని వైద్యులు తెలిపారు. పిల్లల హైట్ దాదాపు 90శాతం తల్లిదండ్రుల హైట్‌తో సంబంధం ఉంటుంది. తల్లిదండ్రులిరువురు మంచి హైట్ ఉంటే పిల్లల్లోకూడా ఎదుగుదల బాగుంటుంది. * పిల్లలు పుట్టినప్పుడు సహజంగా వారి పొడవు 50 సెంటీమీటర్లుంటుంది. ఒక ఏడాది తర్వాత 75 సెంటీమీటర్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు. ఇలా పిల్లలు కిశోరావస్థకు చేరుకునేవరకు పెరుగుదల జరుగుతుంటుంది.  * కిశోరావస్థలో పెరుగుదల చాలా వేగంగా పెరుగుతుంది. అమ్మాయిలలోనైతే 10 సంవత్సరాలు, అబ్బాయిలలోనైతే 12సంవత్సరాల తర్వాత పెరుగుదల ప్రారంభమౌతుంది. * పుష్టికరమైన ఆహారంతోబాటు మంచిగా వ్యాయామం చేస్తే మీ పిల్లల్లో పెరుగుదల కనపడుతుందని వైద్యులు తెలిపారు.  * టానిక్కులు, ప్రోటీన్ పౌడర్, ఇతర మందులపై ఆశపెట్టుకోకూడదంటున్నారు వైద్యులు. ఇవి బలహీనంగానున్న పిల్లలకు మాత్రమే పనికొస్తాయి.  * మరీ మీ పిల్లల ఎదుగుదల గురించి బెంగ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించండి.