రాకీ రోల్‌కి పర్ఫెక్ట్ షేప్ కోసం డబుల్ కష్టపడుతున్న యష్!
on Sep 23, 2020
2020 మోస్ట్ యాంటిసిపేటెట్ ఫిలిమ్స్‌లో ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న యష్ మూవీ 'కేజీఎఫ్: చాప్టర్ 2' ఒకటి. ఆ మూవీ కోసం ఫ్యాన్స్ అమితాసక్తిగా ఎదురు చూస్తుండగా, కొవిడ్-19 మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం యష్ ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అతని సన్నిహిత వర్గాల ప్రకారం 'కేజీఎఫ్ 2'లో రాకీ రోల్ కోసం యష్ జిమ్‌లో విపరీతంగా శ్రమిస్తూ, పర్ఫెక్ట్ షేప్ కోసం ట్రై చేస్తున్నాడు.
"సెట్స్‌పైకి తిరిగి రావడానికి, 'కేజీఎఫ్ 2' షూటింగ్ స్టార్ చెయ్యడానికి యష్ ఇదివరకటి కంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు. రెగ్యులర్ వర్కవుట్స్‌ను డబుల్ చేశాడు. తన డైలీ వర్కవుట్ రొటీన్‌ను భిన్న సెట్ల ఎక్సర్సైజులుగా విభజించుకొని చేస్తున్నాడు" అని ఆ వర్గాలు తెలిపాయి.
వివిధ రిపోర్టుల ప్రకారం, ఈ మూవీకి సంబంధించి అత్యధిక శాతం షూటింగ్ పూర్తయింది. మిగతా భాగం షూటింగ్‌ను త్వరలో పూర్తి చేయనున్నారు. ఇటీవల ప్రకాశ్‌రాజ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రీకరించాడు. వాటికి సంబంధించిన కొన్ని పిక్చర్లను ఆ ఇద్దరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశారు కూడా.
Also Read