English | Telugu

`మ‌నం` కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా!!

on Jun 24, 2019

`మ‌నం` అక్కినేని నాగేశ్వ‌ర‌రావు , నాగార్జున , నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమా  అక్కినేని కుటుంబానికి మ‌ర‌పురాని చిత్రంగా నిల‌చిపోయింది. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్ రూపొందించిన ఈ ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ అటు అక్కినేని అభిమానుల‌కే కాదు ఇటు స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు కూడా న‌య‌నానందాన్ని క‌లిగిచింది. క‌ట్  చేస్తే ఐదేళ్ళ సుదీర్ఘ విరామం త‌ర్వాత నాగార్జున, విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా  రానుంద‌ని స‌మాచారం.

ఆ వివ‌రాల్లోకి వెళితే ప్ర‌స్తుతం నాని `గ్యాంగ్ లీడ‌ర్` తో బిజీగా ఉన్న విక్ర‌మ్ ఆ సినిమా పూర్త‌య్యాక త‌న త‌దుప‌రి చిత్రాన్ని నాగ్ తో ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అంతేకాదు ఈ ఏడాది చివ‌ర‌లో ప‌ట్టాలెక్కే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని 2020 ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం నాగ్ `మ‌న్మ‌థుడు 2` , బంగార్రాజు, `బ్ర‌హ్మాస్త` (హిందీ) తో బిజీగా ఉన్నాడు. వీటిలో `మ‌న్మ‌థుడు 2 ` ఆగ‌ష్టులో రిలీజ్ కానుండగా `బంగార్రాజు`, `బ్ర‌హ్మాస్త‌` వ‌చ్చే ఏడాది తెర‌పైకి రానున్నాయి.మ‌రి `మ‌నం` త‌ర్వాత మ‌రోసారి జ‌ట్టుక‌డుతున్న నాగ్, విక్ర‌మ్ కాంబినేష‌న్ ఈసారి ఎలాంటి చిత్రంతో ప‌ల‌క‌రిస్తుందో చూడాలి.


Cinema GalleriesLatest News


Video-Gossips