'కల్కి' తరవాత 'గరుడవేగ 2'
on Jun 25, 2019

విజయం కోసం చకోర పక్షిలా ఎదురు చూసిన రాజశేఖర్ కి ఊపిరి ఇచ్చిన చిత్రం 'గరుడవేగ'. ఒక్కసారిగా యాంగ్రీ స్టార్ ను మళ్లీ రేసులోకి తీసుకు వచ్చిన చిత్రమది. సరైన సినిమా పెడితే రాజశేఖర్ మార్కెట్ ఎలా ఉంటుందనేది 'గరుడవేగ'తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు చూపించారు. ఈ శుక్రవారం విడుదల అవుతున్న 'కల్కి'కి ఇంత భారీ బడ్జెట్ పెట్టడానికి కారణం 'గరుడవేగ' విజయమే. ఇప్పుడా సినిమా గురించి ఎందుకంటే... దానికి సీక్వెల్ తీయడానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు సిద్ధమవుతున్నారు. 'కల్కి' తర్వాత రాజశేఖర్ నటించబోయే సినిమా 'గరుడవేగ 2' అని స్పష్టం చేశారు. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ. రాజశేఖర్, జీవిత కూడా రెడీ. 'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో 'గరుడవేగ 2'ను ప్రకటించారు. ఇదే కాదు... 'కల్కి'కి కూడా సీక్వల్ తెరకెక్కించే అవకాశాలు చాలా ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ 'కల్కి' క్యారెక్టర్ తో వరస సినిమాలు తీయవచ్చని, కల్కి ఫ్రెండ్ చేసి ఉంటుందని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



