నందమూరి బాబాయ్, అబ్బాయ్‌లతో తమన్.. సేమ్ క్యాలెండర్ ఇయర్!
on Nov 21, 2020
ప్రస్తుతం తెలుగునాట నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు తమన్. ఇప్పుడు తమన్ చేతిలో ఉన్న సినిమాల్లో సింహభాగం స్టార్ హీరోలవే. నటసింహ నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ మహారాజా రవితేజ.. ఇలా పలువురి స్టార్స్ కొత్త చిత్రాలకు తమనే బాణీలు అందిస్తున్నాడు. ఇవన్నీ కూడా 2021లో థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అటు నందమూరి బాబాయ్ బాలకృష్ణ, ఇటు నందమూరి అబ్బాయ్ తారక్‌తో ఒకే క్యాలెండర్ ఇయర్లో ఇప్పటివరకు తమన్ సందడి చేసిన సందర్భం లేదు. ఆ ముచ్చట 2021లో తీరనుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న తాజా సినిమా.. ఇలా రెండిటికీ కూడా తమన్ స్వరకర్త.
మరి.. ఒకే ఏడాదిలో నందమూరి బాబాయ్, అబ్బాయిల కాంబినేషన్లో తమన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
