సుమ రియల్ రాక్‌స్టార్.. పొగిడిన రేణు దేశాయ్!
on Nov 21, 2020
టీవీ ఉన్న ప్రతి తెలుగు కుటుంబానికీ సుమ ఎవరో తెలుసు. రెండు దశాబ్దాలుగా సుమ పేరు తెలుగిళ్లలో నానుతూనే ఉంది. తను హోస్ట్‌గా చేసే ప్రతి షోనూ పాపులర్ చేసిన ఘనత ఆమెది. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ, తెలుగు యాంకర్లకు మించి చక్కని తెలుగులో షోలను రక్తి కట్టించడం ఆమెకే చెల్లింది. అంతే కాదు.. సినిమా వేడుకల్లో సుమ యాంకరింగ్ అంటే.. దానికి వచ్చే ప్రత్యేక ఆకర్షణే వేరు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్‌గా ఆమె పేరు పొందారు.
నటుడు రాజీవ్ కనకాల భార్య అయినప్పటికీ తనకంటూ అస్తిత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ నిలుపుకుని రాణిస్తోన్న సుమను అభిమానించని, ఇష్టపడని వాళ్లెవరు! ఆమె అభిమానుల్లో రేణు దేశాయ్ కూడా చేరిపోయారు. రేణు కూడా ఇవాళ స్వంతంత్ర అస్తిత్వాన్ని వ్యక్తీకరిస్తున్న స్త్రీగా మనందరికీ తెలుసు. తెలుగు చిత్రసీమలో నటిగా అడుగుపెట్టి, పవన్ కల్యాణ్‌ను వివాహమాడి, ఇద్దరు పిల్లలు పుట్టాక తప్పని స్థితిలో ఆయనకు విడాకులిచ్చి, సింగిల్ మదర్‌గా పిల్లలను పెంచుతూనే తన కెరీర్‌ను మలచుకుంటున్న వ్యక్తి ఆమె.
ఆరేళ్ల క్రితం 'ఇష్క్ వాలా లవ్' అనే మూవీని సొంత డైరెక్షన్లో నిర్మించిన ఆమె ప్రస్తుతం 'ఆద్య' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఆద్య అనేది ఆమె కుమార్తె పేరు కూడా కావడం ఇక్కడ గమనార్హం. కృష్ణ మామిడాల డైరెక్ట్ చేస్తోన్న ఈ వెబ్ సిరీస్‌తో ఆమె ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
కాగా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా సుమతో కలిసున్న ఒక జత ఫొటోలను రేణు షేర్ చేశారు. ఇద్దరూ ఆ ఫొటోలలో వెలిగిపోతున్నారు. ఆ పోస్ట్‌కు "First pic is for Instagram. 2nd pic is the real rockstar Suma garu. Thank you for the awesomest shoot yesterday... looking forward to the episode @kanakalasuma" అంటూ రాసుకొచ్చారు రేణు. అదీ సుమ మహత్యం!
- YM
Also Read