ఆ డైరెక్టర్ ఎంట్రీ, రి-ఎంట్రీ.. మలయాళ రీమేక్ ఫిలిమ్స్!
on Nov 21, 2020
తమిళనాట రీమేక్ రాజాగా గుర్తింపు పొందారు ఎడిటర్ మోహన్ తనయుడు, డైరెక్టర్ మోహన్ రాజా. జయం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కిక్, ఆజాద్.. ఇలా పలు రీమేక్స్ తో అక్కడివారిని అలరించారు రాజా.
వాస్తవానికి మోహన్ రాజా ఎంట్రీ ఫిల్మ్ హనుమాన్ జంక్షన్ కూడా ఓ రీమేక్ మూవీనే. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ వైపు దృష్టి సారించని రాజా.. త్వరలో టాలీవుడ్లో రి-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి మూవీతో.
ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'లూసిఫర్' తెలుగులో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమాకి పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే చివరాఖరికి ఆ అవకాశం మోహన్ రాజాకు దక్కిందని సమాచారం. అదే కనుక నిజమైతే.. టాలీవుడ్లో మోహన్ రాజా ఎంట్రీ, రి-ఎంట్రీ మూవీస్ రీమేక్‌లే కావడం వార్తల్లో నిలిచే అంశమే. విశేషమేమిటంటే.. ఈ రెండూ కూడా మలయాళంలో విజయం సాధించిన సినిమాలకు తెలుగు వెర్షన్స్ కావడం. త్వరలోనే మోహన్ రాజా ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరి 20 ఏళ్ల తరువాత తెలుగు చిత్రసీమలో రి-ఎంట్రీ ఇవ్వబోతున్న రాజా.. మరోసారి విజయఢంకా మ్రోగిస్తారేమో చూడాలి.
Also Read