బాయ్‌ఫ్రెండ్‌తో తాప్సీ చిందులు!
on Oct 13, 2020
తాప్సీ పన్ను త్వరలో తన సినిమాల సెట్స్ పైకి రానుంది. ఈలోగా సెలవు రోజుల్ని సందడిగా, ఆహ్లాదభరితంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది. దాంతో.. తన సిస్టర్స్ షగుణ్, ఎవానియా పన్నులను వెంటబెట్టుకొని మాల్దీవులకు వెళ్లింది. ఆగండాగండి.. వాళ్లతో ఒక పురుషుడు కూడా వెళ్లాడు. అతను తాప్సీ బాయ్‌ఫ్రెండ్ మథియాస్ బో. కొంత కాలంగా తాప్సీ, బో డేటింగ్లో ఉన్నారు. సాధారణంగా తమ రిలేషన్‌షిప్‌ను ప్రైవేట్ వ్యవహారంగానే ఇంతదాకా ఆ ఇద్దరూ ఉంచుతూ వచ్చారు. అయితే తమ మాల్దీవుల విహారాన్ని మాత్రం వారు దాచలేదు. అక్కడి నుంచి షేర్ చేస్తున్న పిక్చర్లలో బికినీలో తాప్సీ అందాలు కళ్లు చెదిరించేస్తున్నాయి.
ఇటీవల 'బిగ్గిని' షూట్ వీడియోను తన సిస్టర్స్, బాయ్‌ఫ్రెండ్‌తో రిక్రియేట్ చేసిన ఓ వీడియోను తాప్సీ షేర్ చేయగా, తాజాగా మథియాస్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన పిక్చర్ అందరినీ ఆకట్టుకుంటూ, ఆన్లైన్లో వైరల్ అవుతోంది. మాల్దీవుల అందాన్ని ఆస్వాదిస్తున్న ఆ ఇద్దరూ ఆ ఆనందంలో చిందులేస్తున్నట్లుగా ఆ పిక్చర్లో కనిపిస్తున్నారు. దానికి “Holiday got me like....” అనే క్యాప్షన్ పెట్టాడు బో. అతను డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్. కొంతకాలంగా తాప్సీతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
ఆగస్ట్ 1న తాప్సీ బర్త్‌డే సందర్భంగా అతడు పెట్టిన పోస్ట్ చాలా మందిని ఆకట్టుకుంది. తాప్సీని క్రేజీ లిటిల్ క్రీచర్గా సంబోధించిన అతను, "మనం త్వరగా పెద్దవాళ్లమవుతున్నాం, ప్రత్యేకించి నువ్వు" అని వెక్కిరించాడు. "నిన్ను కనిపెట్టినందుకు నేనెంత అదృష్టవంతుడినో నమ్మలేకపోతున్నాను. నా కుళ్లు జోకులకు కూడా నవ్వే నిన్ను ఎప్పుడూ నవ్వించడానికి వీలైనంతగా ప్రయత్నిస్తుంటాను." అని అతను పోస్ట్ చేశాడు.
Also Read