హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన హీరోను పిల్లలు ఎలా స్వాగతించారో చూడండి..
on Oct 13, 2020

ఇటీవల 'కళ' సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో అంతర్గత గాయాలకు గురై ఐసీయూలో చేరిన మలయాళ హీరో టొవినో థామస్ సోమవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతడిని ఇంటికి కుటుంబసభ్యులు.. ప్రత్యేకించి అతడి ఇద్దరు పిల్లలు తహాన్, ఇజ్జా సాదరంగా ఆహ్వానించారు. హాస్పిటల్ నుంచి తాను డిశ్చార్జ్ అయిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నాడు టొవినో.
ఈ సందర్భంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన కొలీగ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్, సినీ ప్రియులు, తమ అభిమానాన్ని ప్రదర్శించిన ప్రతి ఒక్కరికీ అతను థాంక్స్ చెప్పాడు. తను అందుకున్న మెసేజ్‌లు, కాల్స్‌తో నిజంగా పాజిటివ్‌గా ఫీల్ అయ్యానని చెప్పిన అతను, సినిమా సెట్‌లో జరిగిన ఘటనతో తన గురించి తను మరింత శ్రద్ధ తీసుకొనేట్లు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. త్వరలో తిరిగి షూటింగ్‌కు హాజరవుతాననే నమ్మకాన్ని వ్యక్తం చేసిన అతను మంచి సినిమాలతో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటానని చెప్పాడు.

ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించే టైమ్‌లో అతడి పొట్టకు దెబ్బ తగిలి విలవిల్లాడు. వెంటనే అతడిని ఎర్నాకుళంలోని రెనాయ్ మెడిసిటీ అనే ప్రైవేట్ హాస్పిటల్‌లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్పించారు. సీటీ యాంజియోగ్రామ్‌లో అతడి పొత్తికడుపులో రక్తపు చారికలు (మెసెంటెరిక్ మెమటోమా) కనిపించాయి. అబ్జర్వేషన్ పీరియడ్ అయ్యాక మరోసారి సీటీ యాంజియోగ్రామ్ తీసినప్పుడు బ్లీడింగ్ కనిపించలేదు. థామస్ ప్రస్తుత కండిషన్ సంతృప్తికరంగా ఉందని ధ్రువపడినాక అతడిని డిశ్చార్జ్ చేసినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



