గోళ్లతో రక్కిన హీరోయిన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ కళ్లకు గాయాలు!
on Oct 14, 2020
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ సారా గుర్పాల్ రెండు కళ్లకు గాయాలయ్యాయి. ఆ గాయాలకు కారణం తోటి కంటెస్టెంట్ నిక్కీ తంబోలి ('తిప్పరా మీసం' హీరోయిన్) గోళ్లతో రక్కడం! అవును. అయితే ఈ విషయం సారా తొలివారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక బయటి ప్రపంచానికి తెలియడం గమనార్హం. చాలా మంది ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు మెడికల్ రీజన్స్ వల్ల కూడా ఆమె బయటకు వచ్చినట్లు అర్థమవుతోంది. కొత్తగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫొటోలు సారా కళ్లకైన గాయాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఒక ఇమ్యూనిటీ టాస్క్ సందర్భంగా తన గోళ్లతో నిక్కీ తంటోలి రక్కడంతో సారా గాయపడింది. సారా ఒక బుల్డోజర్ మీద కూర్చొని వుండగా, ఆమెను దాని మీద నుంచి తోసేసి, తాను కూర్చోవడానికి ప్రయత్నించింది నిక్కీ. ఈ క్రమంలో సారా ముఖాన్ని నిక్కీ రుద్దడంతో ఆమె కళ్లపై గోళ్లు గీసుకున్నాయి. అయితే ఆ ఫుటేజ్‌ను ఎపిసోడ్ నుంచి బిగ్ బాస్ నిర్వాహకులు ఎడిట్ చేసినప్పటికీ, ఆ ఇన్సిడెంట్ గురించి కంటెస్టెంట్లు మాట్లాడుకోవడం వినిపించింది.
సారా ఎలా గాయపడిందీ, అయినా దానిపై కంప్లయింట్ చేయకుండా ఎలా గేమ్ ఆడిందీ కంటెస్టెంట్లు ఐజాజ్ ఖాన్, హీనా ఖాన్, గౌహర్ ఖాన్ మాట్లాడుకోవడం వినిపించింది. తాజా సమాచారం ప్రకారం ట్రీట్మెంట్ తీసుకున్న సారా తన సొంతూరికి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
Also Read