షాకింగ్.. సింగిల్ అని బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది. కానీ ఆమె కథ వేరే!
on Oct 14, 2020

బిగ్ బాస్ 14లో తొలివారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన పంజాబీ నటి, గాయని సారా గుర్‌పాల్‌కు సంబంధించిన షాకింగ్ విషయం వెల్లడైంది. ఆమె హౌస్‌లోకి తాను సింగిల్ అంటూ వచ్చింది. కానీ ఆమెకు పెళ్లయిందనే విషయం ఆమె భర్త తుషార్ కుమార్ బయటపెట్టాడు. అతను కూడా పంజాబీ సింగరే. 2014లోనే తాము పెళ్లి చేసుకున్నామనీ, ఆమె తన వైవాహిక జీవితం గురించి అబద్ధాలు చెప్పి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వెళ్లిందనీ అతను ఆరోపించాడు. తమ మ్యారేజ్‌కు సంబంధించిన కొన్ని పిక్చర్లను రుజువులుగా అతను షేర్ చేశాడు. అంతే కాదు, మ్యారేజ్ సర్టిఫికెట్‌ను కూడా బయటపెట్టాడు. అందులో సారా గుర్‌పాల్ పేరు రచనా దేవి అని ఉంది.

బిగ్ బాస్ 14 హౌస్ నుంచి బయటకు వచ్చిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచిన సారా తన పెళ్లి గురించి ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది. తుషార్ కుమార్‌తో తన వైవాహిక జీవితం వేధింపులతో సాగిందని ఆమె ఆరోపించింది. తను బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యాకే తుషార్ తమ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడాడనీ, అంతకు ముందు ఎందుకు మాట్లాడలేదనీ ఆమె ప్రశ్నించింది. తాము దాదాపు నాలుగేళ్లకు పైనుంచే విడిగా ఉంటున్నామనీ అతనే చెప్పాడని సారా తెలిపింది. నిజంగా అది వేధింపుల బంధమనీ, తనకు ఆరోగ్యకరం కాని బంధం నుంచి దూరంగా వెళ్లే హక్కు ప్రతి అమ్మాయికీ ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పింది సారా.
.jpg)
"ఈ నాలుగేళ్లుగా అతనెక్కడున్నాడు? బిగ్ బాస్ షో మొదలవగానే, అతను మాట్లాడటం మొదలుపెట్టాడు. నా జీవితంలోని ముఖ్యమైన వ్యక్తుల్లో అతనిది చివరి స్థానం. అతను ముఖ్యమైనవాడైతే, నా జీవితంలో అతను ఉండేవాడే కదా" అని ఆమె చెప్పింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



