సిగ్గు సిగ్గు విజయ్ సేతుపతి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్!
on Oct 14, 2020

శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800'లో ఆయన క్యారెక్టర్‌ను పోషించనున్న విజయ్ సేతుపతిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నిర్దాక్షిణ్యంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. జూలైలోనే ఈ మూవీని నిర్మాతలు అనౌన్స్ చేసినప్పటికీ, మంగళవారమే టైటిల్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఆ బయోపిక్ రాంగ్ రీజన్స్‌తో వార్తల్లోకెక్కడం గమనార్హం. మురళీధరన్ రోల్‌ను చేస్తున్న విజయ్ సేతుపతిని ట్విట్టర్ వినియోగదారులు టార్గెట్ చేశారు. #ShameOnVijaySethupathi, #BoycottVijaySethupathi అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు. తమిళ అనుకూలురు శ్రీలంక క్రికెటర్ క్యారెక్టర్ చేస్తున్నందుకు విజయ్ సేతుపతిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయినప్పటికీ, సేతుపతి ఫ్యాన్స్‌తో పాటు చాలామంది అతడికి సోషల్ మీడియాలో సపోర్ట్‌గా మాట్లాడుతుండటం గమనార్హం. తను ఎలాంటి సినిమాలు చేయాలో నిర్ణయించుకొనే హక్కు విజయ్ సేతుపతికి ఉందని ఒకరు ట్వీట్ చేశారు. మరొకరు "ఒక ఆర్టిస్ట్‌గా సినిమాలను ఎంచుకొనే ప్రతి హక్కూ విజయ్ సేతుపతికి ఉంది. ముత్తయ్య మురళీధరన్ ఒక క్రికెటర్. అతను హంతకుడు కాడు. తమిళ ఈలమ్ ఊచకోత కాలంలో అధికారంలో ఉన్న పొలిటీషియన్ కూడా కాదు. కాబట్టి #ShameOnVijaySethupathi ని ట్రెండింగ్‌లోకి తేవడంలో అర్థం లేదు." అని ట్వీట్ చేశారు.
ఎం.ఎస్. శ్రీపతి డైరెక్ట్ చేస్తున్న '800' మూవీకి శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నాడు. తమిళంలో రూపొందే ఈ సినిమాని తెలుగు సహా మరికొన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



