బన్నీతో సల్మాన్ ఖాన్ హీరోయిన్?
on Jan 15, 2021
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ 3తో నాయికగా తొలి అడుగు వేసింది సయీ మంజ్రేకర్. ప్రముఖ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ గారాల పట్టి అయిన సయీ తొలి చిత్రంతోనే నటిగా తనదైన మద్ర వేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు చిత్రాల్లో నాయికగా నటిస్తోంది.
అందులో ఒకటి మేజర్ కాగా.. మరొకటి బాక్సర్. మేజర్ లో అడివి శేష్ సరసన నాయికగా నటిస్తున్న మిస్ మంజ్రేకర్.. బాక్సర్ లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కి జంటగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే వెండితెరపై సందడి చేయనున్నాయి.
ఇదిలా ఉంటే.. సయీ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని టాక్. ఆ సినిమా మరేదో కాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న పేరు నిర్ణయించని చిత్రం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రంలో నాయిక పాత్ర కోసం సయీతో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. త్వరలోనే బన్నీ - కొరటాల శివ కాంబో మూవీలో సయీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం పుష్పతో బన్నీ, ఆచార్యతో కొరటాల బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్స్ అయ్యాకే వీరి కాంబినేషన్ మూవీ పట్టాలెక్కుతుంది.
Also Read