సోగ్గాడే చిన్ని నాయనాకి ఐదేళ్ళు
on Jan 15, 2021

కింగ్ నాగార్జున కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో సోగ్గాడే చిన్ని నాయనా ఒకటి. బంగార్రాజు, రాము.. అనే తండ్రీకొడుకుల పాత్రల్లో నాగ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటించారు. కళ్యాణ్ కృష్ణ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగ్ హోమ్ బేనర్ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి అతిథి పాత్రలో సందడి చేయగా అనసూయ, హంసా నందిని, నాజర్, బ్రహ్మానందం, నాగబాబు, సంపత్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.
అనూప్ రూబెన్స్ సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ఉత్తమ నూతన దర్శకుడు, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో నంది పురస్కారాలను అందుకున్న ఈ చిత్రం.. కన్నడలో ఉపేంద్ర మాట్టే బా (ఉపేంద్ర, ప్రేమ, శ్రుతి హరిహరన్ ప్రధాన పాత్రధారులు) పేరుతో రీమేక్ అయింది. సంక్రాంతి కానుకగా 2016 జనవరి 15న విడుదలై నాగ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయనా.. నేటితో ఐదు వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



