సరికొత్త టాక్ షోతో రానా ప్రయోగం
on May 23, 2020
రానా దగ్గుబాటి మల్టీ టాలెంటెడ్. సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అదే సమయంలో మంచి క్యారెక్టర్ వస్తే గెస్ట్ రోల్ లేదా ఇంపార్టెంట్ రోల్ చేసేస్తాడు. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడు. అమరచిత్ర కథలు అంటూ కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తాడు. టీవీ షోలకు హోస్ట్ గా చేస్తాడు. ఖాళీగా ఉండడం రానాకు నచ్చదు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. లాక్ డౌన్ సమయంలోనూ రానా ఖాళీగా లేడు. ఒక యానిమేషన్ టాక్ షో చేశాడు.
యాక్టర్ కాకముందు రానా యానిమేటర్ గా వర్క్ చేశాడు. ఒక యానిమేషన్ కంపెనీ స్టార్ట్ చేసి కొన్ని సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేయించాడు. యానిమేషన్ లో అనుభవం ఉండడంతో ఈ ఖాళీ సమయంలో 'వై ఆర్ యు' అని ఒక టాక్ షో చేశాడు. ఇప్పటివరకు వచ్చిన టాక్ షో లకు భిన్నమైనది ఇది. అనిమేషన్ కాన్సెప్ట్ లో ఇప్పటి వరకు ఎవరూ షో చేయలేదు అనుకుంట. ఈ టాక్ షో త్వరలో ఓటీటీలో విడుదల కానుందని తెలిపాడు. ఎలా ఉంటుందో చూడాలి మరి.