కరోనా వ్యాక్సిన్ వచ్చాక పెళ్లి చేసుకుంటా
on May 23, 2020

కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని 'బిగ్ బాస్' ఫేమ్, గ్లామరస్ యాక్టర్ తేజస్విని మదివాడ చెబుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'హార్ట్ ఎటాక్'లో హీరోయిన్ చెల్లెలుగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఐస్ క్రీమ్' సినిమాల్లో కథానాయికగా నటించిన తేజస్విని మదివాడకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. సోషల్ మీడియాలో వాళ్లతో చాటింగ్ చేస్తే... 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?' అని ఒకరు అడిగాడు. 'కరోనాకి వాక్సిన్ వచ్చిన తర్వాత' అని బదులిచ్చారు. అలాగే, తనకు బాయ్ ఫ్రెండ్ లేడు అని క్లారిటీ ఇచ్చింది. తన వయసు ఎంతో చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు.
ఇప్పటి వరకు తాను నటించిన వాటిలో 'మన ముగ్గురి లవ్ స్టోరీ' తనకు బాగా నచ్చినదని తేజస్విని మదివాడ తెలిపింది. హైదరాబాదులో తనకు ఇష్టమైనది తన ఇల్లే అని, ఫేవరెట్ ఫుడ్ విషయానికి వస్తే... పానీ పూరి, తాటి ముంజలు, చెరుకుగడలు పచ్చిమామిడికాయలు, కాకరకాయ తనకు ఇష్టమని ఆమె చెప్పింది. తేజస్వి మదివాడ నటించిన 'కమిట్మెంట్' సినిమా విడుదలకు సిద్ధమైంది. థియేటర్లు ఓపెన్ అయ్యాక ఆ సినిమా విడుదల అవుతుందని ఆమె చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



