శివగామి నీలాంబరిని నెట్టేస్తుందా?
on Jun 17, 2015
.jpg)
శివగామి నీలాంబరిని మెప్పిస్తుందా? నీలాంబరి కన్నా శివగామి పవర్ ఫుల్లా? టాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్. బాహుబలిలో శివగామిగా నటిస్తోన్న రమ్యకృష్ణ ట్రైలర్ చూసిన వారందరి నోటా ఇదే మాట. నరసింహా సినిమాలో నీలాంబరిగా దిమ్మతిరిగే నటన కనబర్చింది రమ్యకృష్ణ. ఒక్కమాటలో చెప్పాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోటీపడింది. కొందరైతే రమ్య ముందు రజనీ తేలిపోయాడని కూడా అన్నారు.
క్లాస్, మాస్, పొగరు, వగరు, అమాయకత్వం ఇలా నవరసాలకు న్యాయం చేసిన నటిగా రమ్యకృష్ణ సినీ ప్రియులతో ప్రశంసలందుకుంది. ఆమె సినీచరిత్రలో నీలాంబరి పాత్ర ఓ మైలురాయి అన్నారు. కానీ లేటెస్ట్ గా శివగామి క్యారెక్టర్ చూసి మాట మార్చుకుంటున్నారు. నీలాంబరిని తలదన్నేలా శివగామి పాత్ర ఉండబోతోందని డిస్కస్ చేసుకుంటున్నారు.
రాజమాతగా, వీరనారిగా, ధీరవనితగా.....దడపుట్టిస్తోంది. కొన్ని సెకన్ల వీడియోనే ఇంత పవర్ ఫుల్ గా ఉంటే.....ఇక సినిమాలో చెప్పేదేముంది. రమ్య రచ్చ చేయడం ఖాయం. ఈ లెక్కన శివగామి ఆమె పాత్రలన్నింటిలో కలికితురాయిగా ఉండిపోతుందేమో చూద్దాం....
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



