బన్నీ అంతపని చేశాడా?
on Jun 17, 2015
.jpg)
ఒకటా రెండా ఏకంగా 11కోట్లు వద్దన్నాడట అల్లు అర్జున్. ఏంటీ కొంపతీసి ఏదైనా సినిమాకి రెమ్యునరేషన్ ఏమైనా తీసుకోవడం లేదా ఏంటి అంటారా? అదేం లేదుకానీ...అమెరికాకు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఇచ్చిన ఆఫర్ తిరస్కరించాడట. యూఎస్ లో ప్రముఖ నగరాల్లో ఓ వారంపాటూ లైవ్ డాన్స్ షోలు నిర్వహించాలని సదరు కంపెనీ భావించిందట.
ఈ ప్రోగ్రామ్ కి దక్షిణాదికి చెందిన యంగ్ హీరోలు, హీరోయిన్స్ పాల్గొనేలా ప్లాన్ చేసిందట. ఇందుకోసం కేవలం బన్నీ ఒక్కడికే 11కోట్లు ఇస్తానంది. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అస్సలు నచ్చవని... ఏదైనా సంస్థ ఛారిటీ కోసం అయితే డాన్స్ చేస్తా అని ట్విస్ట్ ఇచ్చాడు ఈ దేశముదురు. దీంతో అవాక్కవడం ఆ కంపెనీ వంతైంది.
ఎందుకంటే గతంలో సల్మాన్ ఖాన్ తో ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్ చేసిన సంస్థ అది. ఏదిఏమైనా బన్నీ ఫ్యాన్స్ మాత్రం మనసున్న హీరో అంటూ తెగ ముచ్చటపడిపోతున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే....చారిటీ కోసం అయితే స్టెప్పులేస్తా అని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బన్నీని ఎరు వాడుకుంటారో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



