English | Telugu

రాళ్లపల్లి ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

on May 18, 2019

ఓ సినిమా హిట్ అయితే.... అందులో హీరో, హీరోయిన్లు రెండో సినిమాకు రెమ్యునరేషన్ పెంచేస్తున్న రోజులివి. ఏదైనా సినిమాలో ఒక పాత్రకు పేరు వస్తే... అందులో నటించిన ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ నెక్స్ట్ సినిమాకు కొండెక్కి కూర్చుంటుంది. కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతల కంటే డబ్బుకు విలువ ఇస్తున్న రోజులివి. శుక్రవారం తుదిశ్వాస విడిచిన ఒకప్పటి నటుడు రాళ్లపల్లి మాత్రం డబ్బు కంటే పేరుకు ఎక్కువ విలువ ఇచ్చారు. ఆయన 'స్త్రీ' చిత్రానికి అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా? రూ. 300 మాత్రమే. నిజానికి, ఆయన తొలి చిత్రం 'స్త్రీ' అయినప్పటికీ... తొలి అవకాశం వచ్చినది మాత్రం 'ఊరుమ్మడి బతుకులు' చిత్రంలో! అది రెండో చిత్రంగా విడుదలైంది. ఆ చిత్రానికి రూ. 800 పారితోషకం అందుకున్నారు. అప్పట్లో ఆయన జీతం ఎంతో తెలుసా? నెలకు రూ. 2000! అప్పట్లో ఆ జీతం గొప్పే. హైదరాబాద్‌లోని మినిస్ట్రీస్ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌లో ఊరూరా తిరిగి కుటుంబ నియంత్రణ వంటి పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా నాటకాలు వేసే ఉద్యోగం చేసేవారు. రెమ్యునరేషన్ తక్కువ అయినా... పేరు కోసం రాళ్లపల్లి సినిమాల్లోకి వచ్చారు. సుమారు 800 చిత్రాల్లో నటించారు. ఎనిమిది వేలకు పైగా నాటకాల్లో నటించారు. సినిమాల్లోకి వచ్చిన తరవాత కూడా నాటకాలు వేశారు. 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here