మంచుకొండల్లో 'వెంకీ మామ'
on May 18, 2019

ఇటు సమ్మర్ వెకేషన్... అటు సినిమా షూటింగ్... స్వామి కార్యం తో పాటు స్వకార్యం కూడా జరుగుతోంది 'వెంకీ మామ' చిత్ర బృందానికి! వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో మొదలైంది. అక్కడి మంచుకొండల్లో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ రైతుగా, నాగచైతన్య మిలిటరీ మ్యాన్ గా కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం మిలిటరీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను తీస్తున్నట్లు ఉన్నారు. ఇప్పటికే రాజమండ్రిలో ఒక షెడ్యూల్, హైదరాబాద్లో మరో షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. రైతు సభ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. చూస్తుంటే కె.ఎస్.రవీంద్ర పెద్ద కథను చెబుతున్నట్టు ఉన్నాడు. ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



