English | Telugu

ఉగాదికి ఇంకెన్ని వస్తాయో?

on Feb 13, 2020

యువ హీరోల మధ్య ఉగాదికి మంచి పోటీ నెలకొనేలా ఉంది. ఈ ఏడాది మార్చి 25న ఉగాది. బుధవారం వచ్చింది. ఉగాదికి రెండు రోజులు తెలుగు ప్రజలందరూ ఫెస్టివల్ మోడ్ లో ఉంటారు. ఫ్యామిలీతో కలిసి సినిమాలకు వెళ్లాలని అనుకుంటారు. స్కూల్, ఇంటర్ ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు విడుదల కావు. అందుకని, మీడియమ్ రేంజ్ హీరోలు ఉగాదిపై కన్నేశారు.

నేచురల్ స్టార్ నాని ఫస్ట్ టైమ్ విలన్ క్యారెక్టర్ చేస్తున్న సినిమా 'వి'. ఇందులో సుధీర్ బాబు హీరో. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. ఉగాదిపై 'వి' సినిమా టీమ్ ఎప్పుడో కర్చీఫ్ వేశారు. లేటెస్టుగా ఉగాది రేసులోకి యువ హీరో రాజ్ తరుణ్ కూడా వచ్చాడు. 'గుండెజారి గల్లతయ్యిందే' ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా కేకే రాధామోహన్ నిర్మిస్తున్న 'ఒరేయ్ బుజ్జిగా' సినిమానూ ఉగాదికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రెండు మూడు చిన్న సినిమాలు ఎలాగో విడుదల అవుతాయి. అవి కాకుండా ఉగాదికి ఇంకెన్ని వస్తాయో చూడాలి.


Cinema Galleries



Latest News


Video-Gossips