నాగశౌర్య, రీతువర్మ జోడీ కుదిరింది
on Feb 13, 2020

ఇటీవలే 'అశ్వథ్థామ'గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగశౌర్య హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం షూటింగ్ గురువారం లాంచనంగా మొదలైంది. 'పెళ్లిచూపులు', 'కేశవ' సినిమాల ఫేమ్ రీతువర్మ హీరోయిన్‌గా నటించే ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య డైరెక్టర్‌గా పరిచయమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిలింనగర్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి.
ఈనెల 19న్ సినిమా సెట్స్ మీదకు వెళ్తోంది. చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు మరికొద్దిరోజులలో ప్రకటిస్తామని సూర్యదేవర నాగవంశీ తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. నవీన్ నూలి ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



