'అ!' దర్శకుడు నాని దగ్గరకు వెళ్లలేదట
on Feb 13, 2020

స్క్రిప్ట్ కంప్లీట్ అయినా సరైన నిర్మాత దొరక్క 'అ1 - 2' సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లలేదని 'అ!' దర్శకుడు ప్రశాంత్ వర్మ రెండు రోజుల క్రితం ట్వీట్ చేశాడు. ఆ సంగతిని ''అ!'శ్చర్యమే... నిర్మాత దొరకడం లేదు!' తెలుగువన్ పాఠకులకు తెలియజేసింది. సోషల్ మీడియా వేదికగా నిర్మాత గురించి ప్రశాంత్ వర్మ ట్వీట్ చేయడంతో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. 'అ!' సినిమాను నాని ప్రొడ్యూస్ చేశాడు. అతడికి 'అ! 2' స్క్రిప్ట్ నచ్చలేదనీ, అందుకే ప్రశాంత్ వర్మకు మరోసారి అవకాశం ఇవ్వలేదనీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. తనపై వస్తున్న విమర్శలకు దర్శకుడు చెక్ పెట్టాడు. "నేను 'అ! 2' కోసం నానిగారిని అప్రోచ్ కాలేదు. ఎందుకంటే... వాల్ పోస్టర్ సినిమా పతాకంపై కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. పుకార్లకు స్వస్తి పలుకుతారని ఆశిస్తున్నా" అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. అదీ సంగతి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



