నాగ్ కార్తీల ' ఊపిరి ' ఆడియో రిలీజ్ డేట్
on Jan 24, 2016
సంక్రాంత్రికి సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో వచ్చి, రేస్ లో గెలిచిన నాగార్జున, అదే ఉత్సాహంలో్, తన నెక్స్ట్ సినిమాపై దృష్టి సారించారు..హీరో కార్తీ,నాగార్జున కాంబినేషన్లో తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ' ఊపిరి '. దాదాపుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ' ఊపిరి 'ని మార్చి 25న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ పివిపి ప్రకటించిన సంగతి తెలిసిందే..తాజాగా, ఆడియో రిలీజ్ డేట్ ను కూడా మూవీ టీం డిసైడ్ చేసింది..మళయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరాలు అందించిన ' ఊపిరి ' పాటలను ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు..
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రాబోతున్న ఈ బైలింగ్వల్ మూవీ,ఫ్రెంచ్ మూవీ ' ది ఇన్ టచబుల్స్ ' కు రీమేక్ . నాగార్జున,కార్తీలతో పాటు తమన్నా,అనుష్క,అడివిశేష్ లు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్...ప్రయోగాత్మక కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో, నాగ్ పూర్తిగా వీల్ చైర్ కే పరిమితమయ్యే పాత్రలో కనిపించడం విశేషం..