టైటిల్ అదే, ట్యాగ్ లైన్ మాత్రం తీసేశారు..!
on Jun 7, 2016
సందీప్ కిషన్, నిత్య మీనన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ఒక్క అమ్మాయి తప్ప. రాజసింహా దర్శకుడిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ట్యాగ్ లైన్ వివాదంలో చిక్కుకుంది. ఒక్క అమ్మాయి తప్ప అన్న టైటిల్ బాగానే ఉన్నా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ట్యాగ్ లైన్, స్కూల్స్ లో చేయించే ప్రతిజ్ఞ తాలూకు వాక్యం కావడంతో, వివాదం మొదలైంది.
సినిమాకు ఇలాంటి ట్యాగ్ ఎలా పెడతారంటూ జనాలు ప్రశించడంతో, నష్ట నివారణా చర్యలు చేపట్టారు మూవీ టీం. కేవలం ఒక్క అమ్మాయి తప్ప అన్న టైటిల్ ను ఉంచి, ట్యాగ్ ను తీసేసి కొత్త పోస్టర్లు రిలీజ్ చేశారు. దీంతో సినిమా వివాదం నుంచి బయటపడినట్టే అంటున్నారు. ఈ సినిమా కోసం సందీప్ కిషన్, నిత్యామీనన్, కెమేరా మ్యాన్ ఛోటా కే నాయుడు డబ్బులు తీసుకోకుండా పనిచేయడం విశేషం.