ఓవర్సీస్ లో అ ఆ ప్రభంజనం..!
on Jun 7, 2016
.jpg)
నితిన్, సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా అ ఆ. గతవారం రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ లో పెద్ద సినిమాలకు పోటీ ఇస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో త్రివిక్రమ్ కున్న ఫాలోయింగ్ కనిపిస్తోంది. మొదటి వారం ముగిసేసరికి 1.7 డాలర్లను వసూలు చేసి ట్రేడ్ పండితులకు షాక్ ఇచ్చిన ఈ సినిమా, ఓవర్సీస్ కలెక్షన్స్ లో బాహుబలి, శ్రీమంతుడు తర్వాతి స్థానానికి చేరుకుంది. ఓవర్సీస్ లో త్రివిక్రమ్ సినిమాలకు డిమాండ్ ఎలా ఉంటుందో చూపిస్తోంది అ ఆ. పైపెచ్చు, సమ్మర్లో రిలీజైన పెద్ద సినిమాలేవీ ఆకట్టుకోకపోవడం కూడా అ ఆ కు ప్లస్ గా మారింది. ఇప్పటి వరకూ బాహుబలి 4.4 మిలియన్ డాలర్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, 2.09 డాలర్లతో శ్రీమంతుడు సెకండ్ ప్లేస్ లో ఉంది. మూడు నాలుగు ప్లేస్ లలో ఉన్న నాన్నకు ప్రేమతో, అత్తారింటికి దారేది సినిమాలను క్రాస్ చేసి థర్డ్ ప్లేస్ కు చేరింది. లాంగ్ రన్ లో అ ఆ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



